జైలు ఆవరణలో కాల్పులు | Firing Inside Punjab Jail, Inmate Shot in Suspected Gang-War | Sakshi
Sakshi News home page

జైలు ఆవరణలో కాల్పులు

Published Thu, Apr 16 2015 11:11 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

జైలు ఆవరణలో కాల్పులు - Sakshi

జైలు ఆవరణలో కాల్పులు

భటిండా:  పంజాబ్ లోని భటిండా జైల్లో కాల్పుల  ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.   జైలు ఆవరణలో ఖైదీల మధ్య గ్యాంగ్వార్గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  గురువారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో కరడుకట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.  అతడ్ని ఆసుపత్రికి తరలించారు.  పోలీసుల సమాచారం ప్రకారం ఆయుధాల కేసులో అండర్ ట్రయిల్ ఖైదీ కుల్బీర్ సింగ్ నౌరానాకు  ఈ కాల్పులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.  
కాగా గత నెలలో నౌరానా సెల్ఫోన్లో మాట్లాడుతూ  ఫోజులిచ్చిన ఫోటోలు ఫేస్బుక్ లో దర్శనమిచ్చాయి.   ఆ తరువాత వాటిని పోలీసులు వాటిని  తొలగించినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement