జైలు ఆవరణలో కాల్పులు
భటిండా: పంజాబ్ లోని భటిండా జైల్లో కాల్పుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. జైలు ఆవరణలో ఖైదీల మధ్య గ్యాంగ్వార్గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో కరడుకట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఆయుధాల కేసులో అండర్ ట్రయిల్ ఖైదీ కుల్బీర్ సింగ్ నౌరానాకు ఈ కాల్పులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా గత నెలలో నౌరానా సెల్ఫోన్లో మాట్లాడుతూ ఫోజులిచ్చిన ఫోటోలు ఫేస్బుక్ లో దర్శనమిచ్చాయి. ఆ తరువాత వాటిని పోలీసులు వాటిని తొలగించినట్టు సమాచారం.