గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి | Bathinda teen hurt in sword attack by stalker | Sakshi
Sakshi News home page

గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి

Published Wed, Jul 26 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి

గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి

భటిండా: పదో తరగతి ఫేయిలై జులాయిగా మారిన ఓ యువకుడు తొమ్మిదో తరగతి బాలికను ఏడిపిస్తూ ఏకంగా కత్తితో దాడికి దిగాడు. పాఠశాల ఆవరణలోనే దాడికి పాల్పడగా ఆ బాలిక గాయపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని భటిండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం జస్బీర్‌ సింగ్‌(18) అనే ఓ యువకుడు భటిండాలోని పాఠశాల వద్దకు చేరుకొని ఓ పద్నాలుగేళ్ల బాలికతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.

అందుకు బాలిక నిరాకరించడంతో గేటు వద్దే గొడవకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. దాడిని గమనించి అప్రమత్తమైన తోటి విద్యార్థులు, టీచర్లు ఆమెను రక్షించేందుకు పరుగులు తీయడంతో జస్బీర్‌ పరారయ్యాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో జస్బీర్‌ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement