sword attack
-
ఓటమి భయంతోనే బద్నాం చేస్తున్నారు
అంబర్‌పేట (హైదరాబాద్): పొడిచిన వ్యక్తి బీజేపీ.. కత్తిపోటుకు గురైన వ్యక్తి బీఆర్ఎస్ నేత అయితే సీఎం కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌ను బద్నాం చేయడం ఆయన ఓటమి భయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబర్‌పేట పార్టీ అభ్యర్థి రోహిన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వి.హనుమంతరావుతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలతో కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరిన వ్యక్తి.. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేస్తే ఇది కాంగ్రెస్ పని అని సీఎం కేసీఆర్ దివాలాకోరు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో పని చేస్తుందని, శాంతియుత వాతావరణంలో తాము ఎన్నికల్లో కొట్లాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంబర్‌పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీఇచ్చారు. వీహెచ్ మాట్లాడుతూ తన హయాంలోనే అంబర్‌పేట చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందిందని తెలిపారు. టికెట్ల విషయంలో పార్టీ నేతలకు జరిగిన అన్యాయాన్ని అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని వీహెచ్ రేవంత్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ఇచి్చన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి అంబర్‌పేటలో విజయం సాధిస్తామని రోహిన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..
ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్ అప్ వ్యాన్ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!) -
ఫ్రాన్స్ చర్చిలో కత్తితో దాడి
పారిస్: ఫ్రాన్స్‌లో మరో ఘోరం జరిగింది. చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఓ మహిళ తల తెగిపడింది. మరో ఇద్దరు మరణించారు. నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కిరాతకుడి వివరాలను అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఉగ్రవాద చర్యేనని భావిస్తున్నారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో అతను గాయపడ్డాడని నైస్ నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ చెప్పారు. చర్చిలో జరిగిన దాడిలో ముగ్గురు చనిపోవడం పట్ల ఫ్రాన్స్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమ దేశానికి ముప్పు గరిష్ట స్థాయికి చేరినట్లు భావిస్తున్నామని అన్నారు.మరోవైపు, అవిగ్నొన్ నగరం సమీపంలోని మాంట్ఫెవిట్లో ఓ వ్యక్తి తుపాకీ చూపిస్తూ స్థానికులకు బెదిరింపులకు గురిచేశాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయలేదు. పోలీసులు అతడిని కాల్చివేసినట్లు స్థానిక రేడియో వెల్లడించింది. -
సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..
సాక్షి, హుబ్లీ: పండుగ వేళ ఆ ఇంట్లో రక్తం చిందింది. హుబ్లీ నగరంలో భార్య కాపురానికి రాలేదని ఉన్మాదిగా మారిన వైద్యుడు భార్య, ఆమె తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. శంకర్ ముసన్నవర్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌గా ఇటీవల రిటైరయ్యారు. ఈయన హుబ్లీ లింగరాజునగర్లో కుటుంబంతో ఉంటున్నారు. శనివారం ఉదయం వాకింగ్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా అల్లుడు సంతోష్ చొరబడి కత్తితో విచ్చలవిడిగా దాడిచేశాడు. కత్తిపోట్లతో శంకర్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, కుమార్తె లతకు గాయాలయ్యాయి. అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఉన్మాది సంతోష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. (ప్రేమ వివాహం.. భర్త హత్య) ఇద్దరూ వైద్యులే సంతోష్– భార్య లతల మధ్య గొడవలే ఘోరానికి కారణమని తెలిసింది. వీరిద్దరూ కూడా వైద్యులే కావడం గమనార్హం. గొడవల వల్ల వేరువేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. లతా హుబ్లీలో తండ్రి ఇంట్లో నివసిస్తూ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తోంది. దంత వైద్యుడైన సంతోష్ భార్యను తన వద్దకు పంపాలని అప్పుడప్పుడు మామ ఇంటికి వచ్చి ఘర్షణ పడేవాడు. ఎవరూ తన మాట వినడం లేదని చివరకు దారుణానికి ఒడిగట్టాడు. ఘటనాస్థలాన్ని పోలీస్ కమిషన్ లాబురామ్ పరిశీలించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం
-
గొడవ చేయొద్దన్నందుకు.. దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: ఫంక్షన్ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుమారుడు ఫిరోజ్ (22) శనివారం రాత్రి చింతల్మెట్లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్ ఫిరోజ్‌పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్మెట్లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. -
గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి
భటిండా: పదో తరగతి ఫేయిలై జులాయిగా మారిన ఓ యువకుడు తొమ్మిదో తరగతి బాలికను ఏడిపిస్తూ ఏకంగా కత్తితో దాడికి దిగాడు. పాఠశాల ఆవరణలోనే దాడికి పాల్పడగా ఆ బాలిక గాయపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని భటిండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం జస్బీర్ సింగ్(18) అనే ఓ యువకుడు భటిండాలోని పాఠశాల వద్దకు చేరుకొని ఓ పద్నాలుగేళ్ల బాలికతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అందుకు బాలిక నిరాకరించడంతో గేటు వద్దే గొడవకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. దాడిని గమనించి అప్రమత్తమైన తోటి విద్యార్థులు, టీచర్లు ఆమెను రక్షించేందుకు పరుగులు తీయడంతో జస్బీర్ పరారయ్యాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో జస్బీర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు.