
సాక్షి, హైదరాబాద్: ఫంక్షన్ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుమారుడు ఫిరోజ్ (22) శనివారం రాత్రి చింతల్‌మెట్‌లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్ ఫిరోజ్‌పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్‌మెట్‌లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.

ఫిరోజ్ మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment