సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్‌లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్‌లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి.
హోటల్‌లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment