
సాక్షి,హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిస్తాహౌజ్ హోటల్‌లో శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో మంటలు చెలరేగాయి.
మంటలతో చుట్టుపక్కల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే హాస్పిటల్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.