pista house
-
HYD: పిస్తాహౌజ్లో అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిస్తాహౌజ్ హోటల్లో శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటలతో చుట్టుపక్కల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే హాస్పిటల్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
పిస్తా హౌస్‌లో రౌడీ షీటర్ల వీరంగం.. కస్టమర్లపై దాడి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: గగన వీధుల్లో.. లోహ విహంగంలో కూర్చుని ఇష్టమైన ఆహారం భుజించడం ఎవరికైనా ఇష్టమే. అసలు విమాన ప్రయాణమే చేయనివారికైతే మరింత మధురానుభూతి. ఇలాంటి వారి కోసమే మన హైదరాబాదీలు సరికొత్త ఆలోచన చేశారు. ఆతిథ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. ఆకాశంలో చుక్కల నడుమ రాకపోకలు సాగించే విమానాన్ని నేలమీద పెట్టి.. దీనినే ‘స్టార్’ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా షెడ్డుకు వెళ్లిన విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ లైవ్ ఫ్లైట్ లోపలిభాగంలో మార్పులు, చేర్పులు చేసి.. రెస్టారెంట్‌గా మలచనున్నారు. ఆహార ప్రియులకు సరికొత్త ఆనుభూతిని మిగిల్చేలా.. దేశీయ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీకి పరిమితమైన లైవ్ ఫ్లెయిన్ రెస్టారెంట్ త్వరలో సిటీజనులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరవాసులకు హైదరాబాద్ స్టైల్ వంటకాల్లో పేరొందిన ‘పిస్తా హౌస్’ యాజమాన్యం.. ఈ రెస్టారెంట్‌ను త్వరలోనే నగర శివార్లలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా దీన్ని ప్రారంభించే అకాశముంది. కలల విమానంలో కడుపారా.. సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక శామీర్‌పేట చెరువు అందాలను వీక్షిస్తూ.. నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకొని తింటుంటే ఈ మజానే వేరు. త్రివేండ్రంలో కొనుగోలు హోటల్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న ప్రయోగాలు చేసే పిస్తా హౌస్ యజమాని మహ్మద్ అబ్దుల్ మజీద్ మదికి విమాన రెస్టారెంట్ ఆలోచన తట్టింది. ఇప్పటికే లైవ్ ఫ్లైట్ కాకుండా.. మోడల్ విమానాల్లో రెస్టారెంట్లు నడుస్తున్నా ఆయన ఆలోచన లైవ్ ఫ్లెయిన్పైనే పడింది. దీంతో చెడిపోయిన, ఫిట్నెస్ లేని విమానాల కోసం ఆయన విమానయాన సంస్థలను సంప్రదించారు. ఈ క్రమంలోనే కేరళ త్రివేండ్రంలో ఎయిర్ ఇండియా వద్ద ఎ– 320 ఉందని తెలిసింది. దీన్ని వేలం ద్వారా కొనుగోలు చేసి.. ఇక్కడకు చేరుస్తున్నారు. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న ఈ లోహ విహంగం ఈ వారాంతానికి నగరానికి చేరుకోనుంది. ఈ విమానం కొనుగోలు, తరలింపు ఖర్చు రూ.కోటి. ఈ ఫ్లైట్‌ను సమూలంగా మార్చి లోపలిభాగంలో అధునాతన సీటింగ్, విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్, విమానం ఆగిన ప్రదేశాన్ని రన్‌వే తరహాలో తీర్చిదిద్దనున్నారు. -
ధరల కొలిమిలో హలీం.. తినే ఉత్సాహం, మూడు మాటాష్!
చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు. ఇవి వాడతారు? ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు. ఇలా పెరిగాయి.. ► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. గత రెండేళ్లలో కరోనా ప్రభావం.. 2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గిన గిరాకీ.. పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండ్రోజులకోసారే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా. – షేక్ నదీం, శాలిబండ తినడం మానేశా.. ప్రతి రంజాన్‌లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్‌లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది. – ఫహీం, అలీనగర్ -
పిస్తా హౌస్‌తో జియో భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా పిస్తా హౌస్, రిలయన్స్ జియోలు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి హలీం డిస్కౌంట్ కూపన్లను అందిస్తుంది. వినియోగదారులు ఈ డిస్కౌంట్ కూపన్ తో హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన పిస్తా హౌస్ కౌంటర్లలో హలీంను కొనుగోలు చేయవచ్చు. కొనసాగుతున్న ‘జియోఫోన్’ జోరు ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు 'జియోఫోన్' స్మార్ట్ ఫీచర్ ఫోన్ తో మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. కేవలం రూ.49 లకే నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. గతంలో ఇతర ఫీచర్ ఫోన్లను ఉపయోగించి కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే చేసేవారు. కానీ జియో ఫీచర్ ఫోన్లో వినియోగదారులు వీడియో కాల్స్‌తో పాటు, ఉచిత టీవీ సౌకర్యం కూడా ఆనందిస్తున్నారని జియో తెలిపింది. -
హలీం తయారీ ప్రత్యేకం..