తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న సంప్రదాయ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్
ఆన్‌లైన్ డెలివరీలతో ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు సిద్ధమవుతున్న సంస్థలు
హైదరాబాద్‌సహా పలు ముఖ్యమైన నగరాల్లో ‘షిప్ రాకెట్ క్విక్ ’
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పండుగల సీజన్ మొదలైంది. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనంతో వినాయకచవితి ఉత్సవాలు ముగియగా...ఇక దసరా, దీపావళి వరుస పండుగల సందడి ప్రారంభం కానుంది. వచ్చే జనవరి మధ్యలో జరగనున్న సంక్రాంతి దాకా రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు ఈసారి క్విక్–కామర్స్ అనేది కీలకంగా మారనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి ముగిసే దాకా సుదీర్ఘకాలం పాటు పండుగ ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువులు, ఆయా ఉత్పత్తులు వేగంగా ఇళ్లు, కస్టమర్లకు చేరవేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశంలోని సంప్రదాయ ఎల్రక్టానిక్ (ఈ)–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే వివిధ వర్గాల వినియోగదారులపై తమ ముద్రను బలంగానే చూపాయి. దీంతో రిటైల్ రంగంలోని వ్యాపార సంస్థలు, వ్యాపారులను ఈ–కామర్స్ దిగ్గజాలు కొంతమేరకు దెబ్బకొట్టాయి. అయితే మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ–కామర్స్‌ను తలదన్నేలా క్విక్ (క్యూ)–కామర్స్ అనేది ఓ కొత్త కేటగిరీగా ముందుకొచి్చంది. అమెరికాతో సహా వివిధ దేశాల్లో నిత్యావసరాలు మొదలు వివిధ రకాల వస్తువులను ఆ¯Œన్‌లైన్‌లో ఆర్డర్ చేశాక మరుసటి రోజుకు చేరవేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులను తెచ్చుకున్నంత సులువుగా వివిధ వినియోగ వస్తువులు, ఉత్పత్తులను పది నిమిషాల్లోనే కస్టమర్లకు చేరవేసే డెలివరీ మోడళ్లు మనదేశంలో హైదరాబాద్‌తో సహా పలు ప్రముఖనగరాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సంప్రదాయ ఈ–కామర్స్ సంస్థలకు పోటీగా క్యూ–కామర్స్ ఎదుగుతోంది. ఇదిలా ఉంటే...డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ కూడా వేగంగా తమ వినియోగదారులను చేరుకోవడం ద్వారా తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ పరిశ్రమ ద్వారా 35 శాతం అమ్మకాలు పెరుగుతాయని ‘టీమ్ లీజ్’తాజా నివేదిక వెల్లడించింది. డిమాండ్‌ను తట్టుకొని ‘ఆన్ టైమ్ డెలివరీ’చేసేందుకు వీలుగా ఆయా సంస్థలు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి.
⇒ క్విక్–కామర్స్ సెగ్మెంట్‌లో.. వచ్చే అక్టోబర్‌లో నిర్వహించనున్న వార్షిక ఉత్సవం ‘బిగ్ బిలియన్ డేస్–2024’కోసం ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల్లో వంద దాకా ‘డార్క్ స్టోర్స్’ను తెరవనుంది
⇒ ప్రస్తుతమున్న 639 డార్క్ స్టోర్ల నుంచి 2026 ఆఖరుకల్లా రెండువేల స్టోర్లకు (ఈ ఆర్థిక సంవత్సరంలోనే 113 స్టోర్ల ఏర్పాటు) బ్లింకిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది
⇒ వచ్చే మార్చికల్లా దేశవ్యాప్తంగా 700 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని (ఇప్పుడున్న 350 స్టోర్ల నుంచి) జెప్టో నిర్ణయించింది.
⇒ డెలివరీ పార్ట్‌నర్స్, లాజిస్టిక్స్ సపోర్ట్‌ను అందించే ‘షిప్ రాకెట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్ వంటివి కస్టమర్లకు వేగంగా డెలివరీలు చేసేందుకు వీలుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటున్నాయి
⇒ హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, పణే వంటి నగరాల్లో షిప్ రాకెట్ ఇప్పటికే ‘షిప్ రాకెట్‌క్విక్’లను ప్రారంభించింది. పలు నగరాల్లో మరో నెలలో ఈ సరీ్వసులు మొదలుకానున్నాయి
⇒ కస్టమర్లకు వారి ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు వీలుగా షిప్‌రాకెట్ కంపెనీ స్థానిక లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్స్ పోర్టర్, ఓలా, బోర్జె, ర్యాపిడో, షాడో ఫాక్స్‌తో భాగస్వామ్యాన్ని తయారు చేసుకుంది
⇒ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దేశంలోని పది మెట్రో నగరాల్లో ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది
⇒ గిఫ్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ’ఫెర్న్స్ ఏన్‌పెటల్స్’క్విక్ కామర్స్ ద్వారా పంపిణీకి సిద్ధం చేసిన ప్రత్యేక ఉత్పత్తుల రేంజ్‌లు సిద్ధం చేసింది. ఇందుకు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దేశంలో క్యూ–కామర్స్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ పండుగల సీజన్‌లో తమ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని విశ్వసిస్తోంది
⇒ లాజిస్టిక్స్ మేజర్ డెలివరీ సంస్థ ఇప్పటికే ఈ–కామర్స్ కంపెనీలకు డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్‌ను అందించేందుకు ‘సేమ్‌డే డెలివరీ’అనే కొత్త సర్వీస్‌ను ప్రకటించింది
‘డార్క్ స్టోర్స్’అంటే...
ఇలాంటి స్టోర్ట్స్ కస్టమర్లు ప్రత్యక్షంగా వెళ్లి షాపింగ్ చేసేందుకు ఉద్దేశించినవి కాదు. వినియోగదారుల నుంచి వచ్చే ఆన్‌లైన్ ఆర్డర్లకు వీలైనంత ఎక్కువ వేగంగా వారి ఇళ్లకు డెలివరీ చేసేందుకు ఉద్దేశించి... విభిన్న రకాల వస్తువులు, ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు నగరంలోని బిజీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే స్టోర్లు ఇవి. పలురకాల వస్తువులను స్టోర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, అక్కడి నుంచి కస్టమర్ల ఇళ్లకు తరలించడానికి ఉద్దేశించినవి. ఇవి డి్రస్టిబ్యూషన్‌న్‌ఔట్‌లెట్లుగా పనిచేస్తాయి. ప్రధానంగా మెరుగైన పంపిణీ, వేగంగా డెలివరీ, విభిన్నరకాల ఉత్పత్తులను స్టోర్ చేసే అవకాశం, తదితరాలకు సంబంధించినవి.
Comments
Please login to add a commentAdd a comment