Punjab University
-
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్‌లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే ‘జలకన్య’. ఆంగ్లంలో అయితే మెరమైడ్ (Meramaid). అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట. ఆసక్తిగొలుపుతున్న ఈ మొక్క వివరాలు తెలుసుకోండి. 2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఫెక్లీ బస్త్ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు. -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా..
న్యూఢిల్లీ : పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశానికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రథమ స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ‘భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటు కూలంకశంగా చర్చించింది. ఉభయసభల ఆమోదం పొందింది. ఇదంతా భారతదేశ అంతర్గత వ్యవహారం. ఇతర దేశాలు (పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశిస్తూ) మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత.. ‘ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానంటూ’ చివరి ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఉపరాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. భారతదేశ ఆలోచనలు, విదేశాంగ విధానాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, హుందాగా అదే సమయంలో బలంగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆమెను ‘ఆదర్శ భారతీయ మహిళ’గా కీర్తించారు. మాటలు, చేతల్లో స్పష్టత.. ఆలోచన, ఆహార్యం, ప్రసంగాల్లో భారతీయతకు ఆమె ప్రతిరూపమన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని.. తను పనిచేసిన ప్రతిచోట తనదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆదర్శంతమైన రాజకీయ నాయకురాలి జీవితాన్ని, ఆమె సాధించిన విజయాలను కొత్తతరం రాజకీయ నాయకులు ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. 1996లో పార్లమెంటులో ‘భారతీయత’పై శ్రీమతి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం తనకింకా గుర్తుందన్నారు. ‘ఓ చక్కటి వక్తగా, కార్యశీలిగా, రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా.. మానవతా విలువలున్న వ్యక్తిగా కూడా సుష్మాస్వరాజ్ అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఆమె పేరుముందు స్వర్గీయ అని పెట్టేందుకు కూడా మనసు అంగీకరించడంలేదు. మిత్రులు, మద్దతుదారులు, ప్రజలు ఇలా ఎవరికేం అవసరం వచ్చి ఆమె తలుపు తట్టినా.. నేనున్నానంటూ వచ్చి సాయం చేసే ఓ మంచి సోదరిని ఇంకా మరిచిపోలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నసమయంలోనూ.. సమస్య ఉందని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు వచ్చిన తక్షణమే స్పందించేవారని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలి కాలంలో నేను చూసిన గొప్ప విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్’ అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏడుసార్లు లోక్‌సభకు, అంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. ప్రజల గుండెల్లో ఆమెకున్న స్థానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘అందరికీ అర్థమయ్యేలా భాషలో స్పష్టత, ఆకట్టుకునే పదాలు వీటికితోడు చక్కటి వక్తృత్వం వెరసి సుష్మాస్వరాజ్ తన ఆలోచనలను చాలా స్పష్టంగా వెల్లడించేవారు. హిందీ, సంస్కృతం, హరియాణ్వీతోపాటుగా కర్ణాటక ఎన్నికల్లో కన్నడ భాషలోనూ స్పష్టంగా మాట్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బహుభాషా కోవిదురాలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘సుష్మాజీ మా కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికొచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నాను. మొన్న రాఖీ పండగ సందర్భంగా సుష్మాజీ గుర్తుకొచ్చి ఉద్వేగానికి గురయ్యాను. ఆమె పేరుకు ముందు స్వర్గీయ అని పిలిచేందుకు ఇంకా మనసు రావడం లేదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. గొప్ప వ్యక్తుల సంస్మరణ సభలు నిర్వహించడం కేవలం వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే కాదని.. వారు చూపిన ఆదర్శాలను అన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్ కుమార్, సుష్మాస్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం
కటక్: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్ జిందాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్ 21–16, 21–19తో అభిషేక్ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–కృష్ణప్రసాద్ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్ జిందాల్–హార్దిక్ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
అమ్మాయిల హాస్టల్లో అమానుషం
బతిండా: పంజాబ్ బతిండా జిల్లా తల్వాండీ సాబొలోని అకాల్ యూనివర్సిటీలో అమానుష ఘటన వెలుగు చూసింది. క్యాంపస్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యార్థినులు ఆందోళన చేయడంతో బాధ్యులైన నలుగురు మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వాడేసిన శానిటరీ నాప్కిన్లను మరుగుదొడ్డిలో పడేయడంతో ఎవరు రుతుక్రమంలో పరీక్షించేందుకు దుస్తులు విప్పాలని హాస్టల్ వార్డెన్లు తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ దారుణంపై వైస్ ఛాన్స్లర్ గుర్మైల్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన యూనివర్సిటీ అధికారులు.. హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్, ఇద్దరు మహిళా సెక్యురిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై తమకు విద్యార్థినిలు, యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తల్వాండీ సాబొ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఉదంతం తమ పరిశీలనకు రాలేదని పంజాబ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ చెప్పారు. -
చర్చ లేకుండానే మరోరోజుకు వాయిదా..
-
చర్చ లేకుండానే మరోరోజు
క్యూల మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారానికి విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా ఎలాంటి చర్చ జరగకుండానే వరుసగా నాలుగోరోజూ వారుుదాపడ్డాయి. క్యూల మృతుల పరిహారంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. లోక్‌సభలో విపక్షాల వారుుదాతీర్మానాల డిమాండ్‌కు అన్నాడీఎంకే జతచేరింది. నోట్లరద్దు నిర్ణయంలో ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధమేనని మంత్రి అనంత్ కుమార్ చెప్పగా.. చర్చకు తాము సిద్ధమేనని అయితే ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యసభలో..: ఎగువ సభ ప్రారంభమైనప్పటినుంచీ.. విపక్ష సభ్యులు వెల్‌లోనే నిలబడ్డారు. ప్రధాని సభకు వస్తేగానీ నోట్లరద్దుపై చర్చ ముందుకు సాగనివ్వమన్నారు. పాత కరెన్సీ నోట్లు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఎంసీల సభ్యులకు.. యూపీ బరిలో బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా జతచేరటంతో నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ పలుమార్లు వారుుదా పడింది. లోక్‌సభలో రచ్చ.. శీతాకాల సమావేశాల మొదటిరోజునుంచీ నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు మంగళవారం అన్నాడీఎంకే సభ్యులూ జతచేరారు. విపక్ష సభ్యులు వెల్‌చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అమ్మా మీరు మా మాట కూడా వినాలి’అని ఖర్గే వ్యాఖ్యానించగా.. ‘తల్లి తన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది’అని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించి సభను వారుుదా వేశారు. కాగా, నోట్లరద్దుపై పార్లమెంటు లో అవసరాన్ని బట్టి ప్రధాని మాట్లాడతారని కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాతో అన్నారు. నోట్ల రద్దుపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న విపక్షాలు.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా చేయాలని నిర్ణరుుంచాయి. మన్మోహన్ పాఠాలు చెప్పుకోవచ్చు పంజాబ్ వర్సిటీలో ఆతిథ్య ఉపాధ్యాయుడిగా చేరటం వల్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయలేమని, ఈ అంశంపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. జూలైలో పంజాబ్ వర్సిటీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ‘జవహార్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్’ అందుకోవాలని కోరింది. -
మళ్లీ ప్రొఫెసర్‌గా మన్మోహన్!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాను చదువుకున్న, పాఠాలు చెప్పిన పంజాబ్ వర్సిటీకి తిరిగి వెళ్లనున్నారు. గతంలో ఆయనను జవహర్లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌షిప్‌గా వ్యవహరించాలని పంజాబ్ వర్సిటీ కోరింది. అయితే అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మన్మోహన్ తాను ఆ పదవిని అలంకరిస్తే సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందా అని రాజ్యసభ చైర్మన్‌ను అడిగారు. దీనిపై ఏర్పాటైన కమిటీ ఈ నెల 14న లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక ఇచ్చింది. వర్సిటీ ప్రతిపాదించిన పదవిని మన్మోహన్ చేపడితే అది లాభదాయక పదవి కిందికి రాదని అందులో పేర్కొన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని తెలిపింది. దీంతో త్వరలోనే ఆయన యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌షిప్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
ఉద్యోగ సమాచారం
ఐజీఐఎంఎస్‌లో ప్రొఫెసర్ పోస్టులు పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 44. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 16. వివరాలకు www.igims.org చూడొచ్చు. పంజాబ్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పంజాబ్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 40. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.jobs.puchd.ac.in చూడొచ్చు. హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్‌లో వివిధ పోస్టులు షిల్లాంగ్‌లోని నార్త ఈస్టర్న ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్స పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 31. ఇంటర్వ్యూ తేది ఫిబ్రవరి 4. వివరాలకు www.neigrihms.gov.in చూడొచ్చు. నేషనల్ డెయిరీ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో పోస్టులు హరియాణాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. వివిధ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిన టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 56. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 16. వివరాలకు www.ndri.res.in చూడొచ్చు. కొచ్చిన్ షిప్యార్డలో మేనేజర్, ట్రైనీ పోస్టులు కొచ్చిన్ షిప్యార్డ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 24. వివరాలకు www.cochinshipyard.com చూడొచ్చు. ఎన్ఎస్ఐసీలో గెస్ట్ ఫ్యాకల్టీ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ).. వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది జనవరి 27. వివరాలకు www.nsic.co.in చూడొచ్చు.