కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ | Indian Scientists Found New Plant The Name Was Merimaid | Sakshi
Sakshi News home page

కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’

Published Wed, Aug 18 2021 4:59 PM | Last Updated on Wed, Aug 18 2021 10:54 PM

Indian Scientists Found New Plant The Name Was Merimaid - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు
కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే ‘జలకన్య’. ఆంగ్లంలో అయితే మెరమైడ్‌ (Meramaid). అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట. ఆసక్తిగొలుపుతున్న ఈ మొక్క వివరాలు తెలుసుకోండి.

2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్‌ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్‌ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఫెక్లీ బస్త్‌ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement