చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
అయితే ఈ సందర్బంగా క్యాంపస్‌లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment