cooking gas cylinder
-
వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గింపు. నారీశక్తికి లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
రెండు గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన మరో రెండు గ్యారంటీ హామీల ప్రారంభోత్సవ వేదిక మారింది. ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనుంది. నిజానికి మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలవడం, వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభ కోసం టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
ఏప్రిల్ 1 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్!
జైపూర్: దేశంలో వంట గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌవ్ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
-
రేషన్ షాపుల్లో 5 కిలోల సిలిండర్
సాక్షి, హైదరాబాద్ : గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు, బ్యాచిలర్లు, వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా అయిదు కిలోల వంటగ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆయిల్ కంపెనిలన్నీ తమ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకుల ద్వారా వీటిని విక్రయిస్తుండగా, త్వరలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులో తెచ్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహాపయోగం కోసం 14.2 కిలోల, వాణిజ్య అవసరాల కోసం 19 కిలోల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. చిన్న సిలిండర్లు డోర్ డెలివరీ లేనప్పటికీ ఖాళీ సిలిండర్ తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీలు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నుంచి రీఫిల్ చేసి తీసుకునే వెసులుబాటుంది. తాజాగా రేషన్ దుకాణాల్లోకి అందుబాటులోకి వస్తే అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్న గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చమురు సంస్థల వంట గ్యాస్‌ను బట్టి చిన్న సిలిండర్ ధర ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 5 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన చిన్న సిలిండర్ రూ.528.32కు లభిస్తుందని సమాచారం. (క్లిక్: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు..) -
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
మళ్లీ పేలిన గ్యాస్ బండ!
సాక్షి, అమరావతి: వంట గ్యాస్ సిలిండర్ మరోసారి భగ్గుమంది. సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 చొప్పున ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్పత్తి సంస్థలు ధర పెంచిన నేపథ్యంలో విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.857 నుంచి రూ.882కి పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రవాణా వ్యయం ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.882కి కాస్త అటూఇటుగా ఉంది. 2019 ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ రూ.732 ఉండగా ఇప్పుడు రూ.882లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.150 మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత నెలలోనూ.. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. గత నెల 1న గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.5 పెంచిన ఉత్పత్తి సంస్థలు తాజాగా మరో రూ.25 పెంచేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. -
సిటీ గ్యాస్ బిడ్డింగ్‌లో ఐవోసీ టాప్
న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్జీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35 నగరాల్లో సొంతంగా, అదానీ గ్యాస్ భాగస్వామ్యంతో మరో ఏడు నగరాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. అదానీ గ్యాస్ సొంతంగా 19 నగరాలకు, ఐవోసీ భాగస్వామ్యంతో ఏడు నగరాలకు బిడ్లు వేసింది. ప్రభుత్వ రంగ గెయిల్ గ్యాస్ ప్రాంతాలకు బిడ్స్ దాఖలు చేసింది. పదో విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సహా మొత్తం 50 నగరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 7–9 మధ్యలో బిడ్లు తెరిచారు. 14 రాష్ట్రాల్లో 124 జిల్లాలకు ఈ లైసెన్సుల ద్వారా సేవలు అందించవచ్చు. -
ఈ నెలలో సబ్సిడీ గ్యాస్ ధర ఎంత పెరిగింది?
న్యూఢిల్లీ: గత 17 నెలలుగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెలా పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు డిసెంబర్లో తాత్కాలిక విరామం ఇచ్చాయి. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ గుజరాత్ ఎన్నికలే దీనికి కారణమనీ, ప్రభుత్వమే ఆ మేరకు చమురు సంస్థలను కోరిందని తెలుస్తోంది. వంటగ్యాస్ సిలిండర్లపై అన్ని రాయితీలను 2018 మార్చికల్లా ఎత్తివేయాలనీ, అందుకోసం ప్రతినెలా ధర పెంచుతూ పోవాలని కేంద్రం గతేడాది చమురు సంస్థలను ఆదేశించింది. దీంతో గతేడాది జూలై నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా రూ.2 తో మొదలుకొని రూ.4.50 వరకు చమురు సంస్థలు సిలిండర్ల ధర పెంచుతూ వచ్చాయి. ఏడాదిన్నరలో రాయితీ సిలిండర్ ధర రూ.76.50 పెరిగింది. డిసెంబర్లో రాయితీ సిలిండర్ ధరను పెంచలేదని ఓ అధికారి చెప్పారు. రాయితీయేతర సిలిండర్ ధరను మాత్రం డిసెంబర్ 1న రూ.5 పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ ప్రకారం 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.496, రాయితీయేతర సిలిండర్ ధర రూ.747గా ఉంది. దేశంలో 18.11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 3 కోట్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అత్యంత పేద మహిళలకు మంజూరైనవి. -
‘సీడింగ్’ మందకొడి
వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీ జమచేసే డీబీటీఎల్ పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాంకు ఖాతాల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి మూడునెలలు గడువు ఇవ్వడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. దీంతో డీబీటీఎల్ అమల్లో బ్యాంకర్ల పాత్ర కీలకం కానున్నది. సీడింగ్ పురోగతిలా! ఎల్పీజీ వినియోగదారులు 5,03,947 అనుసంధానం చేసుకుంది 2,79,627 బ్యాంకు ఖాతాల అనుసంధానం 1,61,369 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వంట గ్యాస్ వినియోగదారులకు మోడిఫైడ్ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం (డీబీటీఎల్)ను కేంద్రం గత యేడాది ప్రకటించింది. నవంబర్ ఆరో తేదీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అమల్లోకి తెచ్చింది. 2015 జనవరి నుంచి తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ ఈ పథకా న్ని అమలు చేస్తామని ప్రకటించింది. వంటగ్యాస్ సిలిం డర్ వినియోగదారులకు (ఎల్పీజీ) సబ్సిడీ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సిలిండర్ పూర్తి ధరను చెల్లిస్తే, సబ్సిడీ మొత్తాన్ని తిరిగి వినియోగదారుడి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సబ్సిడీ పొందేందుకు గ్యాస్ కనెక్షన్ వివరాలతో ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను అనుసంధానం (సీడింగ్) చేయాలనే నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ జనవరి ఒకటో తేదీ నుంచి డీబీటీఎల్ పథకం ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో ఆధార్, బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కేవలం 32.02 శాతం వినియోగదారులు మాత్రమే గ్యాస్ కనెక్షన్ వివరాలతో బ్యాంకు ఖాతాల వివరాలను అనుసంధానించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 55.49శాతం వినియోగదారులు కేవలం ఆధార్ కార్డు వివరాలు మాత్రమే సమర్పించారు. మూడు నెలలు వెసులుబాటు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. జిల్లాలో హిందుస్తాన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఏజెన్సీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ఆయా కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల వద్ద వివరాల నమోదుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా స్పందన కనిపించడం లేదు. మూడు నెలల్లో సీడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోని వారికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వినియోగదారుల నుంచి అందుతున్న సీడింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సంబంధిత బ్యాంకులకు సమర్పిస్తున్నాయి. అయితే పని ఒత్తిడి సాకుగా చూపుతూ బ్యాంకర్లు సీడింగ్ ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ‘సీడింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల నుంచి అందిన దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు అందజేస్తున్నారు. వినియోగదారులకు బ్యాంకు ఖాతాల సీడింగ్‌పై అవగాహన కల్పిం చేందుకు ఏజెన్సీలు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే పలు దఫాలుగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించామని’ జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ యాస్మిన్ వెల్లడించారు. -
మళ్లీ వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి రోజువారీ జీవితాన్ని అష్టకష్టాలతో నెట్టుకొస్తున్న సగటు జీవిపై చమురు సంస్థలు కొరడా ఝుళిపించాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించాయి. ఎన్నడూలేని విధంగా ధరలను పెంచడంతో ఆమ్ఆద్మీ గుండె గుభేల్మంది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రాయితీ సిలిండర్‌పై రూ.25 పెంచగా, రాయితీ అవధి దాటిన (9సిలిండర్లు) వాటిపై ఏకంగా రూ.217 పెంచేసింది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.385కు హెచ్చించింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. జిల్లాలో 52 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ కనెక్షన్లు 13.55లక్షలున్నాయి. వీటిలో నెలవారీగా 9లక్షల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చమురు సంస్థలపై నియంత్రణ ఎత్తివేయడంతో అడ్డూ,అదుపు లేకుండా ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వచ్చే మార్పులను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్న చమురు సంస్థలు.. తాజాగా వంటగ్యాస్‌పై ధరలను భారీగా పెంచాయి. రాయితీపై ఇచ్చే సిలిండర్ ధర రూ.25 పెంచగా, రాయితీ లేని సిలిండర్‌పై రూ.217 పెంచాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే తొమ్మిది రాయితీ సిలిండర్లు ఒక్కో దానిపై రూ.419 కాస్త రూ.444కు చేరింది. అదేవిధంగా 9 సిలిండర్ల తర్వాత ఇచ్చే రాయితీ లేని సిలిండర్ ధర కాస్త రూ.1109 నుంచి రూ.1326కు చేరింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ప్రస్తుత ధర రూ.1881 ఉండగా.. తాజా పెంపుతో ఈ ధర రూ.2266 కు పెరిగింది. పెంచిన ధరలు అతి త్వరలో అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై ఏటా రూ.97.47కోట్ల భారం పడనుంది.