లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment