గత నెలలో రక్షాబంధన్ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. రానున్న మూడు సంవత్సరాల్లో 7.5 మిలియన్ల పేదలకు స్టవ్‌తో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2026 నాటికి 75 లక్షల LPG కనెక్షన్‌లు ఉచితంగా అందివ్వడం జరుగుతుందని కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' వెల్లడించారు. ఇందులో స్టవ్ మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న మహిళలు దీనికి అర్హులు.
ఈ పథకం అమలు చేయడానికి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ. 2200 చొప్పున మొత్తం రూ. 1650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2016లో ఉత్తరప్రదేశ్‌లో 80 మిలియన్ల కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కాగా 2021 నాటికి 10 మిలియన్ కనెక్షన్‌ల లక్ష్యాన్ని చేరుకుంది. రానున్న రోజుల్లో కేంద్రం ఈ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు!
ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఎలా?
- ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అందులో డౌన్‌లోడ్ ఫారమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- తరువాత మీకు ఒక ఫారమ్ డౌన్‌లోడ్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను ఫిల్ చేయాలి.
- ఇవన్నీ ఫిల్ చేసిన తరువాత సమీపంలో ఉన్న గ్యాస్ ఏజన్సీలో సమర్పించాలి. దీనికి అవసరమైన రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నెంబర్ వంటివి కూడా అందించాల్సి ఉంటుంది.
- సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉంటే.. వెరిఫికేషన్ తరువాత కొత్త కనెక్షన్ పొందుతారు.
#WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "Two decisions were taken today... The first decision is that more 75 Lakh LPG connections would be given free of cost in the next 3 years till 2026... This is an extension of Ujjwala Yojana... The second decision is that the… pic.twitter.com/H0ShPmTt8M
— ANI (@ANI) September 13, 2023
Comments
Please login to add a commentAdd a comment