gas connection
-
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా..
గత నెలలో రక్షాబంధన్ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. రానున్న మూడు సంవత్సరాల్లో 7.5 మిలియన్ల పేదలకు స్టవ్‌తో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2026 నాటికి 75 లక్షల LPG కనెక్షన్లు ఉచితంగా అందివ్వడం జరుగుతుందని కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' వెల్లడించారు. ఇందులో స్టవ్ మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఈ పథకం అమలు చేయడానికి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ. 2200 చొప్పున మొత్తం రూ. 1650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2016లో ఉత్తరప్రదేశ్‌లో 80 మిలియన్ల కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కాగా 2021 నాటికి 10 మిలియన్ కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంది. రానున్న రోజుల్లో కేంద్రం ఈ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఎలా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, అందులో డౌన్లోడ్ ఫారమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తరువాత మీకు ఒక ఫారమ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తరువాత సమీపంలో ఉన్న గ్యాస్ ఏజన్సీలో సమర్పించాలి. దీనికి అవసరమైన రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నెంబర్ వంటివి కూడా అందించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉంటే.. వెరిఫికేషన్ తరువాత కొత్త కనెక్షన్ పొందుతారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "Two decisions were taken today... The first decision is that more 75 Lakh LPG connections would be given free of cost in the next 3 years till 2026... This is an extension of Ujjwala Yojana... The second decision is that the… pic.twitter.com/H0ShPmTt8M — ANI (@ANI) September 13, 2023 -
పైపులైన్ ద్వారా వంట గ్యాస్.. తుది దశకు గ్యాస్ స్టేషన్ పనులు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రాష్ట్రంలో తొలిసారిగా ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చేపడుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పెద్దపెల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్లోని గౌతమినగర్, శాంతినగర్‌లలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్, సింగరేణి ఇతర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, శాంతినగర్, గౌతమినగర్‌లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వినియోగదారులకు రూ.618లతో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ ఫీజు చెల్లించిన వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ మీటర్లు బిగించారు. ఆగస్టు 1 నాటికి ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో పనులు పూర్తి.. రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత భారీ, చిన్న తరహా పరిశ్రమలకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో మేలు జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు సీఎన్జీ బంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్లవరం పోర్టు నుంచి పైపులైన్ ద్వారా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలోని గ్యాస్ స్టేషన్‌కు ఇప్పటికే గ్యాస్ సరఫరా అవుతోంది. నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టేషన్‌కు గ్యాస్ తరలింపుపై ట్రయల్ రన్ నిర్వహించారు. లీకేజీ అవకాశాలు తక్కువ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధర 30 శాతం వరకు తక్కువగా ఉండనుంది. పైపులైన్ ద్వారా వచ్చే గ్యాస్ బరువు తక్కువగా ఉండటంతో లీకేజీ, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువ. వినియోగదారుల ఇళ్లకు మీటర్లు బిగించి, యూనిట్ల ఆధారంగా బిల్లు వసూలు చేస్తారు. -
నత్తనడకన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇళ్లకు నేరుగా పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలనే లక్ష్యంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) 2011లో ప్రారంభించిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఎనిమిదేళ్లయినా లక్ష్యం చేరుకోలేదు. దీంతో పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ చౌకగా అందుతుందని భావించిన నగరవాసుల ఆశలు అడియాసలయ్యాయి. బీజీఎల్‌తొలి విడతగా మూడేళ్లలో నగరంలోని లక్ష కుటుంబాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అందించాలని లక్ష్యంనిర్దేశించుకుంది. ఆ గడువు ముగిసి ఐదేళ్లయినా లక్ష్యంచేరుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రమంత్రి 2021 నాటికి 2.5 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నట్లుప్రకటించిన విషయం విదితమే. ఇదీ లక్ష్యం... నగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించేందుకు బీజీఎల్ సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న ప్రాజెక్టును ప్రారంభించింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పీఎన్జీ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యం పెట్టుకుంది. తొలి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించింది. రానున్న 20 ఏళ్లలో సుమారు రూ.3,166 కోట్లతో నగరవ్యాప్తంగా విస్తరించాలని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికీ 10 శాతమే... బీజీఎల్ తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉన్న 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు అందించింది. ఆ తర్వాత మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. వాస్తవానికి మేడ్చల్‌లో దాదాపు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి, అప్పటి సీఎం ద్వారా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అది వాయిదా పడడంతో కొన్ని కనెక్షన్లే ఇచ్చి చేతులు దులుపుకుంది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ పరిధిలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో కనెక్షన్లు ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 10,579 పీఎన్జీ కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఇక శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ మీదుగా జీడిమెట్ల వరకు 46.6 కిలోమీటర్ల మేరనే çస్టీల్ పైప్‌లైన్ పనులు జరిగాయి. కొంతకాలంగా పైప్‌లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. సీఎన్జీ అంతంతే... వాహనాలకు సీఎన్జీ కూడా అందుబాటులో లేకుండా పోయింది. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉండడం లేదు. నగరంలో ప్రజారవాణకు వినియోగించే 85వేల ఆటోలు.. 7,500 బస్సులు, 20 వేలకు పైగా ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకే బీజీఎల్ ప్రాజెక్టును ప్రారంభించింది. తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు సంబంధించిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ తర్వాత 130 బస్సులకే పరిమితమైంది. మొత్తమ్మీద 25వేల వాహనాలకు సీఎన్జీ అందిస్తోంది. -
గ్యాస్ ఉంటే.. కిరోసిన్ కట్
గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ బంద్ చేయనున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే నీలి కిరోసిన్‌ను ఈనెల నుంచే నిలిపి వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని దీపం పథకం కింద సిలిండర్లు పొందిన లబ్ధిదారులకు మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి కిరోసిన్ ఇస్తే దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని భావించిన పౌరసరఫరాల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. సాక్షి, మెదక్ : జిల్లా వ్యాప్తంగా 521 రేషన్‌దుకాణాలు ఉండగా 2,14,165 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహారభద్రత(తెల్లరేషన్) కార్డులు 2,01,059 అంత్యోదయ కార్డులు 13018 అన్నపూర్ణ 88 కార్డులు చొప్పున జిల్లాలో ఉన్నాయి. వీరికి నెలకు 2,14,000 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో నేరుగా తీసుకున్న వాటితో పాటు దీపం, పథకం కింద గ్యాస్పు పొందిన వారితో పాటు అసలే గ్యాస్ కనెక్షన్లు లేని వారు మొత్తం జిల్లాలో 84 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈలెక్కన స్వయంగా గ్యాస్కనెక్షన్లు పొందిన వారి సంఖ్య 1,30,165 మంది ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచి కిరోసిన్ బంద్ కానుంది. కేవలం దీపం పథకం ద్వారా గ్యాస్ పొందిన వారితో పాటు అసలు ఏ గ్యాస్కనెక్షన్ లేనటువంటి 84 వేల కుటుంబాలకు మాత్రమే నెలకు ఒక్కో కుటుంబానికి 1లీటర్ కిరోసిన్ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు గ్యాస్కనెక్షన్తో సంబంధం లేకుండా ఒక్కో కార్డుపై రూ.33కు లీటర్ చొప్పున అందించే వారు. ఇక నుంచి అన్ని కుటుంబాలకు ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు. నల్లబజారుకు తరలిస్తున్నారని.. కిరోసిన్ నల్లబజారుకు తరలిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అందరికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా పల్లెలోనూ వివిధ పథకాల కింద కొంత మంది లబ్ధిదారులకు అందించారు. వీరికి రేషన్ కార్డులు ఉండటంతో ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వార కిరోసిన్ తీసుకునే వారు. వారిలో కొందరికి కిరోషిన్ అవసరం లేకున్నా తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అమ్ముకుంటుండగా, అవసరం లేని వారు రేషన్ షాపుల్లో నుంచి తీసుకెళ్లేవారు కాదు. దీంతో సదరు డీలర్ మిగిలిన దానిని నల్లబజార్లో విక్రయించుకునే వారు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించి ఈ నెల నుంచి జిల్లాకు కిరోసిన్ నిలిపివేశారు. కరెంట్‌పోతే చీకట్లోనే.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కిరోసిన్ నిలిపివేస్తునట్లు పౌరసరాఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 1,30,165 కుటుంబాలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్లు నేరుగా తీసుకున్న వారు ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచే కిరోసిన్ నిలిపివేస్తునట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ రాత్రి వేళలో కరెంట్ పోయినట్లయితే ఆ కుటుంబాలు చీకట్లో మగ్గే పరిస్థితి నెలకొంటుంది. దీంతో జిల్లాలో ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నాయి. నేడు గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ధనవంతులు అనుకుంటే పౌరసరఫరాల శాఖ పప్పులో కాలు వేసినట్లే. గతంలో వంటచెరుకు కోసం అడవులను నరికిన జనాలకు వాటిని నరకటంతో జరిగిన నష్టాలను తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. వారిని అభినందించాల్సిన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వం వారిని ధనవంతుల కింద జమకట్టి కిరోసిన్ కట్ చేయటం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇక నుంచి కిరోసిన్ బంద్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ ఈనెల నుంచి కిరోసిన్ నిలిపివేస్తున్నాం. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు పొందిన పేదలతో పాటు అసలు గ్యాస్ కనెక్షన్ లేని వారికి మాత్రమే నెలకు ఒక లీటర్ చొప్పున కిరోసిన్ ఇస్తాం. జిల్లాలో మొత్తం 2,14,165 రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారితో పాటు అస్సలు గ్యాస్ కనెక్షన్లు లేనివారు 84 వేల మంది ఉన్నారు. వారికి మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వటం జరుగుతుంది. ఈలెక్కన 1,30,165 మందికి కిరోసిన్ నిలిపి వేయటం జరిగింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇన్చార్జి డీఎస్వో -
కిరోసిన్ కట్
సాక్షి, మంచిర్యాలటౌన్(ఆదిలాబాద్) : పేదలకు సబ్సిడీపై రేషన్ దుకాణాల ద్వారా అందించే సరుకులను ఒక్కొక్కటిగా తగ్గి స్తున్నారు. గత ప్రభుత్వం 9 రకాల సరుకులు ఇవ్వగా.. ప్రస్తుతం ఒక్కొక్కటిగా కోత పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, అంతంత మాత్రంగా అందిస్తున్న పంచదార, ఒక్కో కార్డుపై కేవలం ఒక లీటరు మాత్రమే ఇస్తున్న కిరోసిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు నుంచి ఆంక్షలు విధించనున్నాయి. గ్యాస్ కనెక్షన్ ఉంటే కిరోసిన్ సరఫరా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు తగినట్లుగానే వచ్చే ఆగస్టు నెలలో కోటాను మూడోవంతు తగ్గించేశారు. గతంలోనే గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు నీలి కిరోసిన్ కోటాను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద కనెక్షన్ తీసుకున్న కుటుంబాలు, అసలు గ్యాస్ కనెక్షన్ లేని కుటుం బాలకు మాత్రమే ఆగస్టు నుంచి కిరోసిన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుండగా, కిరోసిన్‌ను సైతం సబ్సిడీపై ఇస్తుండడం ప్రభుత్వాలకు భారంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 52 వేల లీటర్లు మాత్రమే.. మంచిర్యాల జిల్లాలో మొత్తం 423 రేషన్ దుకాణా లు ఉండగా, ఆహారభద్రత కార్డులు 2,01,147, అంత్యోదయ కార్డులు 15,079, అన్నపూర్ణ కార్డులు 189 మొత్తంగా జిల్లాలో 2,16,415 కార్డుదారులు ఉన్నారు. వీరికి గతంలో నెలకు 2.16 లక్షల లీటర్ల కిరోసిన్ అందించేవారు. ఇందులో గ్యాస్ క నెక్షన్ ఉన్నవారు 1,59,791 కుటుంబాలు ఉండగా, దీపం పథకం లబ్ధిదారులు 47,324 మంది ఉ న్నారు. వీరికి ప్రతినెలా సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ప్రతినెలా కిరోసిన్ పంపిణీని ఆలస్యం చేయడం, ల బ్ధిదారులు సైతం కిరోసిన్‌ను తీసుకునేందుకు అం తగా ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో ప్రతి నెలా 30 వేలకుపైగా లీటర్ల కిరోసిన్ రేషన్ దుకాణాల్లో మిగులుగా ఉంటోంది. బియ్యం, కిరోసిన్‌లను ప్ర తి నెలా లబ్ధిదారులకు ఈ–పాస్ విధానం ద్వారా నే అందిస్తున్నారు. అంటే లబ్ధిదారులు నేరుగా ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి, వారి వేలిముద్రలు వేస్తేనే రేషన్ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కొందరు లబ్ధిదారులు కిరోసిన్‌ను వాడడం పూర్తిగా వదిలేశారు. దీంతో ప్రతి నెలా కిరోసిన్ కోటా విడుదల అవుతున్నా, లబ్ధిదారులు మాత్రం గ్యాస్ కనెక్షన్ ఉండడంతో తీసుకునేందుకు అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు కిరోసిన్‌ను ఆగస్టు నుంచి పూర్తిగా నిలిపివేయనున్నారు. కిరోసిన్‌ను అత్యంత పేద కుటుంబాలకు మాత్రమే అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నీలి కిరోసిన్‌కు నల్ల బజారులో బాగా డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది దానిని వినియోగించకుండా దళారులకు విక్రయిస్తున్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్‌లకు ప్రత్యామ్నయంగా ఉండడంతో చాలా వరకు పలువురు వాహనాలు, ఇతర యంత్రాల నిర్వహణకు వాడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీటర్ కిరోసిన్‌ను రూ.33కు రేషన్ దుకాణాల్లో విక్రయిస్తుండగా, బ్లాక్ మార్కెట్లో రూ.50 వరకు అమ్ముకుంటున్నారు. కిరోసిన్‌ను వంటకు వినియోగించకుండా, పలువురు వాహనాలను మరమ్మతుకు, జనరేటర్లు, ఇతర మోటార్లను నడిపేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం రేషన్ ద్వారా అందే సబ్సిడీ కిరోసిన్‌నే వాడుతున్నట్లుగా తెలు స్తోంది. దీంతో రేషన్ ద్వారా సబ్సిడీపై అందించే కిరోసిన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. గ్యాస్ కనెక్షన్ ఉంటే కిరోసిన్ ఇవ్వం సబ్సిడీ కిరోసిన్‌ను పొందే కుటుంబాలకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఆగస్టు నుంచి కిరోసిన్ సరఫరా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఆగస్టులో అందించే కిరోసిన్ కోటాను సైతం తగ్గించారు. గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు మాత్రమే ఇకపై కిరోసిన్ ఇస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
తప్పనున్న పొగ తిప్పలు.!
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంటింట్లో పొగ తిప్పలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేద మహిళలను అర్హులుగా చేర్చుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకంతో మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించి సిలిండర్లు అందజేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 11,142 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉచితంగా సిలిండర్లు.. దారిద్య్ర రేఖకు దిగవనున్న కుటుంబాల్లో నేటికీ వంట చేసుకోవడానికి కట్టెలే దిక్కు. ఇలాంటి వారిని పొగ నుంచి విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టింది. నేటికీ చాలా వరకు గ్రామాల్లో కట్టెల పొయ్యి దిక్కు. వంట చేసేటప్పుడు మహిళల కళ్లల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఆహారం సైతం కలుషితమవుతుంది. 2016లో ఉత్తరప్రదేశ్‌లోని బాల్లియాలో మొదటగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. దశల వారీగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రూ.1600లు విలువ చేసే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. గ్యాస్ పొయ్యితో పాటు రెగ్యులేటర్, మిగితా అన్ని వస్తువులను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి. పథకానికి అర్హులు వీరే.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు. అంత్యోదయ కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇది వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారికి సైతం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్‌కార్డు కలిగి ఉన్న పేదలను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారు. ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే మహిళకు బ్యాంకు ఖాతా పుస్తకం ఉండాలి. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అవసరం. రేషన్ కార్డు ఉండాలి. మొబైల్ నంబరుతో సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట దరఖాస్తు గడువు ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఈనెల 18 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా జిల్లాలో 11,142 మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. అర్హులు ధ్రువపత్రాలను సంబంధత అధికారులకు అందించి నేరుగా కనెక్షన్లు పొందవచ్చు. ఈ పథకం దరఖాస్తు గడువు ఆగస్టు నెలలోనే ముగిసింది. తిరిగి మళ్లీ నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. – టి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
ప్రేమ్‌చంద్ కథకు ‘ఉజ్వల’ లింకేమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన వినూత్న ఉజ్వల పథకం విజయ ప్రస్థానం గురించి దేశ పేద మహిళల ముందు ప్రస్థావిస్తూ ‘పిట్ట’ కథకు బదులుగా ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ చిన్న కథ గురించి వివరంగా చెప్పారు. అందులో హమీద్ అనే చిన్న కుర్రాడు చేగోడీలో, పకోడీలో కొనుక్కోకుండా దాచుకున్న తన జేబు డబ్బును తన నానమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు చేతులు కాల్చుకోకుండా ఉండేందుకుగాను పటకారు కొంటాడు. ‘నానమ్మ చేతులు కాల్చుకోకుండా ఓ చిన్న కుర్రవాడు చేసినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నేను ఈ మహిళలకు ఎందుకు చేయలేను’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వినూత్న ఉజ్వల పథకమని మోదీ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా ముచ్చటగా మురిసిపోయారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే పేదలకు సబ్సిడీ ఎల్పీజీ స్కీమ్‌ను అమలు చేశారు. తమిళనాడులో 2007లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లను, గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా అందజేసింది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పేద మహిళలకు సబ్సిడీలపై ఎల్పీజీ కనెక్షన్లను అందజేసింది. ఈ స్కీమ్లకే మన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల’గా పేరు మార్చి అమలు చేశారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఇప్పటికే సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు అటకెక్కగా, కొన్ని చోట్ల సిలిండర్లు పక్కింటికి, స్టవ్‌లు అంగడికి వెళ్లాయి. ఉచితంగా దొరికే వంట చెరకు బదులుగా నెలకు ఐదారు వందల రూపాయలను గ్యాస్ సిలిండర్‌కు ఎందుకు ఖర్చు చేయాలన్న ఆలోచనే అందుకు కారణం. నరేంద్ర మోదీ మాత్రం తాను ‘ఈద్గా’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఉజ్వల పథకాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరైనా హమీద్‌కు తన నానమ్మ అమీనా పట్ల ఉన్న అంతులేని అభిమానాన్ని అనుభూతి పొందుతాము. నరేంద్ర మోదీ ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడిన సంభాషణ వింటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. పైగా అర్థరహితంగా కనిపిస్తుంది. ఒడిశాలోని మయూర్భంజ్ నుంచి సుశ్మిత... ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడుతూ ‘ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పడల్లా పొయ్యిలోకి నీళ్లు వచ్చేటివి. పొయ్యి వెలిగేది కాదు. పిల్లలు పస్తులుండేది. ఇక ఆ బాధ ఉండదని అనుకుంటా!’ అని వ్యాఖ్యానించారు. ‘కొత్త స్టవ్ వచ్చిన సందర్భంగా పిల్లలకు నీవు కొత్త వంటకాలు ఏమైనా చేసి పెడుతున్నావా? లేక అదే కట్టెల పొయ్యి మీద చేసినట్లుగా లావు, లావు రొట్టెలు చేసి పెడుతున్నావా?’ అని మోదీ ప్రశ్నించారు. మయూర్భంజ్ ప్రాంతంలో ఎక్కువగా అన్నమే తింటారని, రొట్టెలు చేసుకోరన్న విషయం మన ప్రియతమ ప్రధానికి తెలియదు పాపం! ‘నీవు ఏం బాగా చేస్తావు? నీ పిల్లలకు ఏది ఎక్కువ ఇష్టం? వారికి ఏది చేసి పెడతావు?’ అని కూడా సుశ్మితాను మోదీ ప్రశ్నించారు. అందుకు ఆమె ‘మ్యాగీ’ అంటూ సమాధానమిచ్చారు. నిజంగా మ్యాగి చేస్తారా? అంటూ మోదీ ఆశ్చర్యపోతూ మనల్నీ ఆశ్చర్యంలో పడేశారు. మోదీ మరో లబ్ధిదారు మీనాతో మాట్లాడుతూ ‘ మీ ఇరుగుపొరుగున ధనవంతులున్నారు. వారికి అందమైన ఇళ్లు ఉన్నాయి. కార్లు ఉన్నాయి. స్కూటర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయి. మీకు ఇంతకాలం గ్యాస్ స్టవ్ లేదు.....మాకే గ్యాస్ స్టవ్ ఉందంటూ ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగాంగానీ ఇప్పుడు ఈ మోదీ వచ్చి ఓ పేదకు గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూసి ఔరా! అనే వారే ఉండరని వారంటారుగదా!’ అన్న వ్యాఖ్యల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు! -
‘దీపం’ వెలిగేనా..
అశ్వాపురం: గ్రామీణ ప్రాంత మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి కట్టెల పొయ్యి కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. వారి కష్టాలు తప్పడం లేదు. మహిళలు పొగ బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తోంది. ఆహారభద్రత కార్డు ఉండి, గ్యాస్ లేని వారికి కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పేదలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చేందుకు చర్యలుతీసుకుంటోంది. జిల్లాలో 2,75, 536 ఆహారభద్రత కార్డులు ఉండగా 1,76, 938 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 98, 598 కుటుంబాలు కట్టెల పొయ్యితోనే కాలం వెల్లదీస్తున్నాయి. తహసీల్దార్లచే ఎంపిక.. దీపం పథకంలో అర్హుల ఎంపిక బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో ఎంపీడీఓలు చూసేవారు. అయితే అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తహసీల్దార్లకు అప్పగించారు. ఆహారభద్రత కార్డుల జారీచేసేది వారే కాబట్టి అర్హుల ఎంపిక ప్రక్రియ వేగవంతమవుతుందనే ఉద్దేశంతో మార్పులు చేశారు. అర్హులైన వారు తమ ఆధార్, ఆహారభద్రత కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేస్తారు. గ్రామసభ ఆమోదంతో తుది జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ అనుమతితో కనెకషన్లు మంజూరు చేస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన.. పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్రం ఈనెల 14న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారికి ఉచితంగానే గ్యాస్ అందించనుంది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం లేకుండా కనెక్షన్ల మంజూరు బాధ్యతను ప్రైవేటు కంపెనీల డీలర్లకు అప్పగించింది. వారు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 20 నుంచి ప్రత్యేక మేళాలు నిర్వహించి కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాల శాఖకు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉజ్వల పథకం రావడంతో ప్రస్తుతం అమలవుతున్న దీపం పథకం ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అన్ని మండలాలలో అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ రెండింటికీ సంబంధం లేదని, దీపం పథకం యథావిధిగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. కరకగూడేనికి చెందిన ఈమె పేరు షేక్ ఫాతి మా. గ్యాస్ కనెక్షన్ కోసం ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసింది. ఏళ్లు గడుస్తున్నా నేటికీ మంజూరు కాలేదు. కట్టెల పొయ్యి కింద వంట చేస్తూ పొగ బారి న పడుతోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి గ్యా స్ ఇప్పిం చాలని వేడుకుం టోంది. -
గ్యాస్ కోసం అగచాట్లు
కోటవురట్ల(పాయకరావుపేట): మండలవాసులకు గ్యాస్ కష్టాలు తీరలేదు. గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. పండగైనా, సెలవైనా పడిగాపులు కాయాల్సిందే. మండలంలో సుమారు 8 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్క గ్యాస్ ఏజన్సీ కూడా స్థానికంగా లేదు. హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ నర్సీపట్నం, భారత్ గ్యాస్ అడ్డురోడ్డు నుండి సరఫరా చేస్తున్నారు. వారానికోమారు వచ్చే గ్యాస్ వ్యాన్ కోసం మండలంలోని మెయిన్‌రోడ్డు వెంబడే కాకుండా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వినియోగదారులు గ్యాస్ కోసం వేచి ఉంటారు. సమయపాలన పాటించకపోవడంతో ఎపుడు వస్తుందో తెలియని వ్యాన్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాస్తారు. గ్యాస్ బండలను క్యూలో పెట్టి ఎదురు చూస్తుంటారు. ఇది ఇరవై ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే. అప్పటికీ ఇప్పటికీ మార్పులేదు. వినియోగదారులు పెరిగారు తప్ప సరఫరా మాత్రం యథాతథం. గురువారం సెలవు రోజైనా సరే గ్యాస్ కోసం పలువురు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పడిగాపులు కాసారు. మరికొందరు గ్యాస్ బండను సెక్యూరిటీగా తమ తలదగ్గర పెట్టుకుని కునుకుతీశారు. ఇదీ మండలంలోని గ్యాస్ వినియోగదారులు వ్యధ. -
దీపం వెలిగేనా?
►పొగలేని పొయ్యిలే లక్ష్యం ►ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు ►సమస్యల మధ్య చేతులెత్తేస్తున్న డీలర్లు ►నెల రోజుల్లో 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ ►మరో వారం రోజుల్లో 94 వేల కనెక్షన్లు ఎలా ఇస్తారో? ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందిస్తాం.. పొగరహిత జిల్లాగా తీర్చి దిద్దుతాం.. అధికారులకు సహకరించండి.. గ్యాస్ కనెక్షన్ పట్టుకెళ్లండి’ అంటూ ఊదరగొడుతున్న పాలకుల మాటలకు.. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుకు పొంతన లేకుండా పోతోంది. నెల రోజుల్లో 1.86 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటివరకు అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. మిగిలింది వారం రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఎలా మంజూరు చేస్తారో.. సీఎం ఇలాకాను పొగరహిత జిల్లాగా ఎలా తీర్చిదిద్దుతారో ఆ చంద్రన్నకే తెలియాలి? చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. అనేక సమస్యల మధ్య డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాల్సిందేనని పాలకులు హుకుం జారీ చేయడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. భారీ లక్ష్యం జిల్లాలో తెలుపు రేషన్ కార్డులు కలిగివున్న కుటుంబాలు 10.84 లక్షలు. ఇందులో గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలు 7.93 లక్షల వరకు ఉన్నాయి. మరో 2.85 లక్షల తెలుపు రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేవ ని ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలింది. ఇందులో 1.86 లక్షల కుటుంబాలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించా యి. ఆ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీలోపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి జిల్లాను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పాలకులు హుకుం జారీ చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసింది 92 వేల గ్యాస్ కనెక్షన్లే దీపం పథకం కింద ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నెల రోజుల నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులకు, గ్యాస్ ఎజెన్సీల డీలర్లకు, సేల్స్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులకుగాను జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. లక్ష్యానికి మరో వారం రోజుల్లో 94 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు నిత్యం సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీచేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సమస్యలు అనేకం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి గ్యాస్ కనెక్షన్ లేనివారు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తేవాల్సి వస్తోంది. కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకే కుటుంబంలో రెండు రేషన్ కార్డులు ఉన్న వారు దీపం కనెక్షన్లకు ముందుకు రావడం లేదు. వేలాదిగా గ్యాస్ కనెక్షన్లు అందించేందు అవసరమైన మేరకు ఆయా గ్యాస్ కంపెనీల నుంచి స్టాక్ రావడం లేదు. దీపం పథకం ద్వారా అందించే అదనపు సిలిండర్ల నిల్వకు తగ్గట్టుగా గోడౌన్లు లేవు. -
రూ.1000కే దీపం గ్యాస్ కనెక్షన్
- ఒక కనెక్షన్ ఇప్పిస్తే రూ.25 ఇన్సెంటివ్ కర్నూలు(అగ్రికల్చర్): దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పంపిణీని వేగవంతం చేసేందుకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త పథకానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉండి ఇంత వరకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం జూన్ నెల నుంచి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ నెల చివరి లోపు కనెక్షన్ల పంపిణీని పూర్తి చేయాలని గ్యాస్ డీలర్లను ఆదేశించారు. రూ.1000కే గ్యాస్ సిలెండర్, రెగ్యులేటర్, గ్యాస్ పైపు, పాస్‌బుక్ ఇస్తారన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. లబ్ధిదారులు ఐఎస్ఐ మార్క్ కలిగిన స్టవ్‌ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇందుకు రూ.990 చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, డీలర్లు, గ్రామ డిజిటల్ అసిస్టెంట్లు రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలను గుర్తించి గ్యాస్ డీలరు దగ్గరకు తీసుకెళ్లి కనెక్షన్ ఇప్పిస్తే అక్కడికక్కడే రూ.25 ఇన్సెంటివ్ డీలరు చెల్లిస్తారని తెలిపారు. హెచ్పీసీ, ఐఓసీ కంపెనీలు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తాయన్నారు. గ్యాస్ సిలెండర్లు డోర్ డెలివరీ చేసే బాయ్‌లు బిల్లు ధర కంటే రూ.25 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని.. అడ్డుకట్ట వేయాలని డీలర్లకు ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ సుబ్రమణ్యం, మెప్మా పీడీ రామాంజనేయులు, ఏఎస్ఓలు రాజా రఘువీర్, వంశీకృష్ణారెడ్డి, ఐఓసీ, హెచ్పీసీ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు హరికృష్ణ, మురళీ, సీఎస్డీటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
జూన్ నాటికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్: సీఎం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గృహాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపన, ప్రారంభో త్సవాలు చేశారు. అనంతరం ఏలూరులో నీరు–ప్రగతిపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ప్రసంగించారు.టీడీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8 నాటికి మూ డేళ్లు పూర్తవుతున్న దృష్ట్యా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యాన్ని పూర్తిచేయ నున్నట్టు చెప్పారు. తెల్లరేషన్ కార్డు దారులకు రేషన్ బియ్యం ఇస్తున్నామని, భవిష్యత్‌లో వారు బియ్యం వద్దనుకుంటే.. డబ్బు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని పలువురు సీఎందృష్టికి తీసుకెళ్లారు. నల్లజర్ల మండలం పోతవరం సభలో బాబుకు ఈ పరిస్థితి ఎదురైంది. స్థానికురాలు అబ్బూరి లక్ష్మి తనకు పాస్‌బుక్ మంజూరు చేసి, ఆ పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు రెవెన్యూ అధికారులు రూ.30 వేలు లంచం అడుగుతున్నారని వాపోయారు. దీంతో సీఎం ఆ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, గ్రామ వీఆర్వోపై 24 గంటల్లో విచారణ చేయాలని ఆదేశించారు. మరో వృద్ధురాలు శ్యామల తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్
అనంతపురం అర్బన్ : మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, కుటుంబం ఆరోగ్యంగా ఉంటాయని, వారి ఆరోగ్యరీత్యా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలని, అదే విధంగా వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని జేసీ లక్ష్మీకాంతం అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక అంబేడ్కర్ నగర్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టెలు, కిరోసిన్ పొయ్యిపై వంట చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు. అదే విధంగా బహిరంగ మలవిసర్జన కారణంగా అనారోగ్యం పాలవుతారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ పొందాలని, మరుగుదొడ్డి కట్టించుకోవాలని సూచించారు. స్వచ్ఛంధ సంస్థలు, సామాజిక సేవాసంస్థలు ముందుకొచ్చి నిరుపేదలకు గ్యాస్ డిపాజిట్ చెల్లించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీలతో తమ పరి«ధిలోని ఎస్సీ కాలనీల్లో గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయించామన్నారు. అనంతరం 40 మందికి గ్యాస్ కనెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరోజమ్మ, పౌర సరఫరాల సంస్థ డీఎం డి.శివశంకర్‌రెడ్డి, ఏఎస్ఓలు ప్రేమ్‌కుమార్, సౌభాగ్యలక్ష్మీ, ఐఓసీ ఏజెన్సీ ప్రతినిధి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
పేలిన దీపం
► తొమ్మిది పూరిళ్లు దగ్ధం ► నిరాశ్రయులైన బాధితులు ► మిన్నంటిన రోదనలు కాయ కష్టం చేసుకుని దాచుకున్నదంతా కళ్ల ముందే రెప్పపాటులో అగ్నికి బూడిదైంది. దీపం పథకం వచ్చిందన్న సంతోషంతో తొలిసారిగా ప్రారంభించేందుకు లబ్ధిదారు సిద్ధమవ్వగా అది కాస్త ప్రమాదంగా మారి తొమ్మిదిళ్లు దగ్ధం కావడానికి దారి తీసింది. కళ్ల ముందే ఇళ్లు కాలిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బాధితులు భోరున విలపించారు. కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వివరాల్లోకి వెళ్తే... టెక్కలి/టెక్కలి రూరల్ : టెక్కలిలోని గొడగల వీధిలో జీరు లక్ష్మికి కొత్తగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరైంది. దీన్ని ప్రారంభించేందుకు లక్ష్మి బుధవారం సిద్ధమైంది. సంతోషంతో ఇరుగుపొరుగు వారిని కూడా పిలిచింది. ప్రారంభించేందుకు సిలెండర్ ఆన్ చేసి పొరుు్య వెలిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు చెలరేగారుు. దీంతో లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సిలిండర్ నుంచి వచ్చిన మంటలు మరింత వ్యాపించి భారీ శబ్ధంతో పేలిపోరుుంది. దీంతో కళ్లెదుటే మంటలు వ్యాపించి తొమ్మిది పూరిళ్లు కాలి బూడిదయ్యారుు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో లక్ష్మి చేతికి చిన్నపాటి గాయాలయ్యారుు. రేరుుంబవళ్లు కష్టపడి దాచుకున్నదంతా ఒక్కసారిగా కళ్ల ముందే కాలి బూడిదవడంతో బాధిత కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ భవానీప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వైస్ ఎంపీపీ హెచ్ రామకృష్ణ, ఎంపీటీసీ రాము, నాయకులు చాపర గణపతి, బెహరా కాళీ, నారాయణరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు శరత్చంద్ర, రాము సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నష్టం అంచనా వేస్తున్నట్టు తహసీల్దార్ అప్పలరాజు తెలిపారు. బాధితులకు భోజన వసతితో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి ఎనిమిది వేల రూపారుులు అందజేసినట్టు చెప్పారు. బాధితులకు ఐఏవై ఇళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని తహసీల్దార్ తెలిపారు. -
పేదల కిరోసిన్‌పై ప్రభుత్వ భారం
నీలి కిరోసిన్ ధర పెంచి పేదల బతుకు ల్లో ప్రభుత్వం నీలి నీడలు నింపుతోంది. చౌక దుకాణాల్లో ఇచ్చే కిరోసిన్ ధర ఒక్కసారిగా రూ. 4 పెంచడంపై నిరుపేదలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుు. గుడిసెల్లో బుడ్డి దీపాలు వెలగకుండా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కరువుతో పనులు లేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఇది అదనపు భారమవుతుందని ప్రభుత్వ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు అర్బన్ : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ప్రతి నెలా సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్ ధరలు మంగళవారం నుంచి పెంచనుంది. ఒక్క లీటర్ కిరోసిన్‌పై రూ. 4 పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి పేదలపై భారాన్ని మోపుతోంది. రేషన్‌షాపు దుకాణాల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన కార్డుదారుడుకి రెండు లీటర్లు, గ్యాస్ కనక్షన్ ఉన్నవారి ఒక లీటరు చొప్పును పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లా మొత్తం సుమారు 2016 రేషన్ షాపులకు గాను 8,65,933 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం లీటరు కిరోసిన్ రూ. 15లకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా సబ్సిడీపై ఇస్తున్న నీలికిరోసిన్పై రూ. 4లు పెంచి జిల్లాలోని పేద ప్రజలపై సుమారు నెలకు 35 లక్షల రూపాయల భారాన్ని మోపడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు లేక సాగుచేసిన పంటలకు నీరు లేక ఎండుముఖపట్టి పేదలు అల్లాడుతున్నారు. కూలీలకు కూలిదొరకక వసలబాట పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదుకోకపోగా ధరలు పెంచి పేదప్రజల నడ్డివిరుస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు కూలిపని చేసుకొని జీవనం సాగించే పేదలపై కిరోసిన్ ధరలు పెంచడం దారుణమంటున్నారు. కిరోసిన్ ధర పెంపుపై ప్రజల మండిపాటు రెక్కాడితేగాని డొక్కాడని అనేక కుటుంబాలు గ్యాస్ కనక్షన్ ఉన్నప్పటికీ గ్యాస్ అయిపోతే కొనడానికి డబ్బులు లేక కిరోసిన్‌పై ఆధారపడి వంట చేసుకుంటున్నారని, కరెంటు పోయినపుడు బుడ్డిదీపాలు కూడా వెలిగించుకోకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. నేటికి మారుమూల ప్రాంతాల్లో కరెంటు వసతులు లేని గ్రామాలు ఉన్నాయని, వారి గుడిసెల్లో వెలుతురు నింపే నీలి కిరోసిన్ ఆధారం కూడా లేకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉన్న ఫళంగా కిరోసిన్‌పై ధరపెంచి పేదలపై భారం మోపడం మోసం చేయడమే అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పెంచిన కిరోసిన్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గ్యాస్ కనెక్షన్ ఉంటేనే రేషన్ కార్డు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ఆహార భద్రత(రేషన్) కార్డు దారులకు గ్యాస్ కనెక్షన్ తప్పని సరిగా మారింది. పౌరసరఫరాల శాఖ కొత్త కార్డుల మంజూరుకు వంట గ్యాస్ కనెక్షన్ మెలిక పెట్టింది. వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులకు సైతం గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి చేయాలని అధికారులను సూచించారు. విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహిత మార్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే నగరంలో కిరోసిన్ వినియోగం నివారణ కోసం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు తక్షణమే వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల వారీగా గ్యాస్ వినియోగం లేని కుటుంబాలను గుర్తించి వారికి కనెక్షన్లు ఇప్పించే బాధ్యతలను డీలర్లకు అప్పగించింది. వంటగ్యాస్ లేని కుటుంబాలపై దృష్టి గ్రేటర్ హైదరాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్లు లేని ఆహార భద్రత కార్డుదారులపై పౌరసరఫరా శాఖ దృష్టి సారించింది. మొత్తం 11.71 లక్షల ఆహార భద్రత (రేషన్) కార్డుదారులుండగా అందులో వంట గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు 2.37 లక్షలపైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్లు, సింగిల్ ఎల్పీజీ సిలిండర్ గల కార్డుదారులకు ఒక లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా సుమారు 18.77లక్షల లీటర్ల వరకు కిరోసిన్ కోటాను కేటాయిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో తెల్ల కిరోసిన్ లీటరు ధర రూ.49లు ఉండగా, చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం లీటరు కిరోసిన్ రూ.15ల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. మిగితా రూ.34లను సబ్సిడీగా కేంద్రం భరించి చమురు సంస్థలకు చెల్లిస్తోంది. అయితే ఇందులో 60 శాతం పైగా కిరోసిన్ పక్కదారి పడి వంటింట్లోకి బదులు వాహనాల్లో ఇంధనం గా మారుతోంది. ఫలితంగా వాహనాలు కాలుష్యం చిమ్ముతూ నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. -
చంద్రబాబుది రెండు భాగాల శరీరం
- తెలంగాణలో ప్రాజెక్టులకు ఆయన అనుమతి అవసరం లేదు: మంత్రి హరీశ్‌రావు - వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ములుగు: ఏపీ సీఎం చంద్రబాబుది ఇన్ని రోజులు రెండు కళ్ల సిద్ధాంతమే అనుకున్నానని.. కానీ, ఆంధ్రా బాబుకు రెండు నాల్కలు, రెండు తలకాయలు, రెండు నోళ్లతో... శరీరమే రెండు భాగాలతో కూడుకున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. చంద్రబాబు తెలంగాణకు సీఎమ్మా, లేక ఏపీకా అనేది అర్థం కావడం లేదని, మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ప్రాజెక్టు పనులను సైతం ఎవరిని అడిగి చేస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. హరీశ్‌రావు మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. నగరంలోని పండ్ల మార్కెట్, మోడల్ కూరగాయ ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు నియోజకవర్గంలోని రామప్ప, లక్నవరం చెరువులను పరిశీలించారు. రాత్రి మంగపేటలో జరిగిన సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదన్నారు. సమైక్యాంధ్ర పాలనలోనే అనుమతి వచ్చిన కాళేశ్వరం, పాలమూరు, డిండి ప్రాజెక్ట్‌లకు అనుమతి రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడా లేదా సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు పెట్టడం ఆయన మనపై చేస్తున్న కుట్రలకు నిదర్శనమన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పర్యాటక మంత్రి చందూలాల్, ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. -
వెలగని ‘దీపం’!
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అందిస్తామని పాలకులు వాగ్దానం చేశారు. మూడు ఆయిల్ కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీలపరిధిలో 1.58 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ఈపథకం కింద నెలవారీ లక్ష్యాలను విధించారు. ఈ ఏడాది మార్చినాటికి 12.58 లక్షల కనెక్షన్లు పంపిణీ పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలను కోరింది. ఒక్కో కనెక్షన్‌కు రూ.1600 వంతున ప్రభుత్వం డిపాజిట్ చెల్లించింది. దీపం కనెక్షన్ కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి..ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేయించారు. సుమారు రెండు లక్షల 17 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హత ఉన్న వారు 1.77 లక్షలుగా నిర్ణయించారు. వారిలో 1.58 లక్షల మందికి ఈ ఏడాది కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. లక్ష్యం చేరుకునేందుకు 1.29 లక్షలు వెరిఫికేషన్ పూర్తి చేసి నప్పటికీ అందులో కేవలం 62,715 మందికి మాత్రమే కనెక్షన్లు జారీ అయ్యాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లక్ష్యంగా 36,912 మంజూరు చేస్తే అందులో 32,599 కనెక్షన్లు పంపిణీ పూర్తి చేశారు. 4,313 కనెక్షన్లు పంపిణీ కాకుండా వెనక్కి మళ్లిపోయాయి. అలాగే అత్యధికంగా ఏజెన్సీలున్న హిందుస్తాన్ పెట్రోలియం సంస్థకు 75,438 లక్ష్యం కాగా 18,639 కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేశారు. మార్చి నెలాఖారుకు 56,799 కనెక్షన్లు పంపిణీ చేయక పోవడంతో ఇవి రద్దయ్యాయి. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ పరిధిలో 45,478 లక్ష్యంగా నిర్ణయిస్తే వారు కేవలం 11,477 మాత్రమే పంపిణీ చేశారు. వారు 34,401 కనెక్షన్లు పంపిణీ చేయక పోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. దరఖాస్తుదారులు గ్యాస్ కనెక్షన్ల కోసం పడిగాపులు కాస్తుంటే కంపెనీలు, ఏజెన్సీలు, జన్మభూమి కమిటీల మధ్య సమన్వయం కుదరక 95,513 కనెక్షన్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీనివల్ల దీపం లబ్థిదారులు నష్టపోయారు. కొత్తగా ఈ ఏడాది దీపం కనెక్షన్లు మంజూరు ఇంతవరకు మొదలు కాలేదు. గత ఏడాది మంజూరు చేసిన కనెక్షన్లు క్షేత్ర స్థాయికి చేర కుండానే వెనక్కి మళ్లి పోయాయి. డీఎస్వో సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే.. జిల్లాలో అర్హత ఉన్న దీపం లబ్ధిదారులు ఉన్నప్పటికీ సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల నష్టం వాటిల్లింది.. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు పర్యవేక్షణ సమయంలో దరఖాస్తుల పరిశీలన బాధ్యత వారికి అప్పగించాం. అక్కడ వారి అనుమతించిన తర్వాత దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు మొదలు పెట్టాం. ఇంతలో ఆయిల్ కంపెనీల నుంచి మరి కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకునే వీలు లేక ఈఏడాది 95 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయలేక పోయాయి. ఆ దరఖాస్తు దారులకు ఈ ఏడాది మంజూరు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తే చర్యలు మొదలు పెడతాం. -
ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్
20 లక్షల మందికి సర్కారు కానుక అక్టోబర్ 1 నుంచి ఆహార భద్రతా చట్టం అమలు: ఈటల సాక్షి, హైదరాబాద్: కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం జాయింట్ కలెక్టర్లు, డీఎస్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రారంభించామని.. త్వరలో మిగతా జిల్లాల్లోనూ ప్రారంభించి, నాలుగు నెలల్లోగా అందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ 20 లక్షల గ్యాస్ కనెక్షన్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్పీ) కింద కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కనెక్షన్లు అందజేయనుందని... మిగతా 10 లక్షల కనెక్షన్లకు అయ్యే రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కుటుంబాలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలు, అంగన్వాడీ కేం ద్రాలకు కూడా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామన్నారు. 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. ఆయా కుటుంబాలకు ఇచ్చే రేషన్‌కార్డు ధరను రూ.5గా నిర్ణయించామన్నారు. అలాగే రాష్ట్రంలో ఆహార భద్రత చట్టాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల స్థాయిలో అక్రమాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని.. అవకతవకలను అరికట్టడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. -
ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
విజయనగరం కంటోన్మెంట్: పేద కుటుంబాలకు శుభవార్త. ఇక గ్యాస్ కనెక్షన్ కోసం వేలాది రూపాయలు ఖర్చుచేయనక్కరలేదు. కేవలం రూ.10లు చెల్లిస్తే చాలు. కనెక్షన్ మంజూరు చేస్తారు. జిల్లాకు 21 వేల ఉచిత కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిని పొందడానికి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె నిర్మలాబాయి తెలిపారు. జిల్లాలో ఇంతవరకూ గ్యాస్ కనెక్షన్ కానీ, దీపం పథకం కింద పొందిన కనెక్షన్ పొందని వారికి మాత్రమే ఈ ఉచిత కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి కనెక్షన్లు ఇచ్చేందుకు ఆ యిల్ కంపెనీలు కూడా అంగీకరించాయని, తెల్లకార్డు కలిగిన పేదలకు వీటిని అందజేస్తామని చెప్పారు. దరఖాస్తుదారుల వివరాలను అప్లోడ్ చేసేందుకు ఫ్రక్స్ సొల్యూషన్స్ సంస్థ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోందని, మరో నాలుగు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ నెల 21 నుంచి అర్హులైన దరఖాస్తుదారులు రూ.10 చెల్లించి మీసేవల్లో దరఖాస్తు చేసుకోవాలని డీఎస్ఓ తెలిపారు. కనెక్షన్ మంజూరైన వారు రెగ్యులేటర్, సిలిండర్లకు ఎటువం టి డిపాజిట్ చెల్లించక్కరలేదని ఆయన స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీల వద్ద స్టవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదని, వారికి నచ్చిన చోట నాణ్యమైన స్టవ్‌ను కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించామన్నారు -
నగదు బదిలీ ‘కాక ’
కలెక్టరేట్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఆధార్ నంబర్ ఇస్తున్నా నగదు బదిలీ కాని పరిస్థితి అవస్థలు పడుతున్న వినియోగదారులు విజయనగరం కంటోన్మెంట్: కొత్త వలసకు చెందిన కంది సత్యనారాయణకు గ్యాస్ కనెక్షన్ ఉంది. దానికి ఆధార్ నంబర్ సీడింగ్‌తో పాటు ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ నంబర్‌ను కూడా అందజేశారు. ఈయనకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేశారు అయితే ఈయన దగ్గర గ్యాస్ సిలిండర్ కోసం పూర్తిస్థాయి నగదు తీసుకున్నప్పటికీ సబ్సిడీ డబ్బులు మాత్రం అకౌంట్లో జమ కాలేదు. దీంతో ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అమలు చేయలేని ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలోని వినియోగదారుల ఖా తాలకు కాకుండా ఇతర ఖాతాలకు జమ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నా యి. దీంతో ఈ పథకం వల్ల వినియోగదారులకు సౌకర్యాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎనిమిది వందల రూపాయలకు పైగా డబ్బు గ్యాస్ సిలిండర్‌కు చెల్లిస్తున్నప్పటికీ సిలిండర్‌కు రూ.440 మినహాయిస్తే మిగతా సొమ్ము సబ్సిడీగా రావాల్సి ఉందని, దీనిని చెల్లించడం లేదని అడుగుతున్న వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు కూడా సక్రమంగా సమాధానాలు చెప్పడం లేదని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నగదు బదిలీని అమలుచేస్తామని గతంలో పలుమార్లు చెప్పిన అధికారులు ఆధార్ సీడింగ్ పూర్తిగా జరగకపోవడంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇప్పుడు దాదాపు 95 శాతం మందికి ఆధార్ నమోదు చేయ డంతో నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ నగదు మాత్రం బదిలీ కావడం లేదు. జిల్లాలో 5 కొత్త ఏజెన్సీలతో కలిపి మొత్తం 24 ఏజెన్సీలలో 3,28,658 గ్యాస్ కనెక్షన్లున్నాయి.ఈ కనెక్షన్లలో లక్షా 25వేలు దీపం పథకానికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్లున్నాయి. మొత్తం కనెక్షన్లలో దాదాపు 2.80లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేశారు. కానీ నగదు బదిలీ మాత్రం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనిపై ఏజెన్సీ సిబ్బంది మాట్లాడుతూ ఎక్కువ మంది వస్తుండడంతో తాము సమాధానం చెప్పడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చినా.. జనవరి నెల నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పినప్పటికీ అన్ని వివరాలూ సమర్పించేందుకు మార్చి నెల వరకూ అవకాశం ఇచ్చారు. అయితే జిల్లాలో మాత్రం మార్చి నెల వరకూ చూడకుండా ఏకంగా జనవరి నెల నుంచే గ్యాస్ కనెక్షన్లు నిలిపివేశారు. బుక్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారికి కూడా మీ కనెక్షను సక్రమంగా లేదని సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. అదేవిధంగా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్లు సమర్పించిన వారికి కూడా మీ ఆధార్ నంబర్ సమర్పించలేదని సమాధానాలు వస్తున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు. -
గ్యాస్ రాయితీ రద్దు
- ఆధార్‌తో అనుసంధానమైతేనే సబ్సిడీ - 15 నుంచే అమలు - డీబీటీఎల్కు జంటజిల్లాల్లో - ఏడు లక్షల మంది దూరం - మార్కెట్ ధరపైన సిలిండర్ సరఫరా సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్‌తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్‌పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు ఏడు లక్షల మంది వినియోగదారులు అదనపు భారాన్ని మోయనున్నారు. ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహా వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన 22.24 లక్షల వినియోగదారులకు మార్కెట్ ధరపై సిలిండర్ సరఫరా జరుగుతోంది. సిలిండర్ సబ్సిడీ నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. అనుసంధానికి దూరంగా 6.76 లక్షల వినియోగదారులకు మాత్రం వెసులుబాటు కారణంగా ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతూ వచ్చింది. ఇప్పటి వరకూ వారు అనుసంధానం చేసుకోక పోవడంతో మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలుచేసుకోవాలి. ప్రస్తుతం డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.675.50పైసలు. ఆధార్‌తో అనుసంధానం అయిన వారికి సబ్సిడీ రూ.219లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సబ్సిడీ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఎల్పీజీని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవల్సిందే.. మరో మూడు నెలల గడువు.. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ఎల్పీజీ (డీబీటీఎల్) పథకం గడువు ఫిబ్రవరి 14తో ముగిసింది. మే 15వ తేదీలోగా అనుసంధానం చేసుకుంటే మూడు నెలల్లో ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో వాటికి ఒకేసారి సబ్సిడీ జమ అయ్యే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఎటువంటి రాయితీ పొందే అవకాశం ఉండదు. -
12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్‌సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం 2012లో పిలుపునివ్వగా మోదీ సర్కారు కూడా అలాంటి ప్రకటనే చేసింది. దేశవ్యాప్తంగా గ్యాస్‌కు నగదు బదిలీ వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగదారులు అందరూ సిలిండర్లను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలివిడతగా వివిధ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో నవంబర్ 15 నుంచి వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుండగా... ఈ ప్రక్రియను కేంద్రం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. www.myLPG.in వెబ్‌సైట్‌ను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావాలని మంత్రి ప్రధాన్ ఆదేశించారు. కాగా, బ్యాంకు ఖాతాలతో 10 కోట్ల ఆధార్ నంబర్లు అనుసంధానమయ్యాయని విశిష్ట గుర్తింపు సంస్థ తెలిపింది. గంగాజలాల తీవ్రస్థాయి కాలుష్యానికి కారణమైన 764 పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండల గుర్తించిందని, వాటిలో 687 యూపీలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
అర్ధాకలే
చప్పిడి చారు.. పలచని పప్పు.. సుద్ద అన్నం.. వెరసి పొగచూరిన వంటలు.. వారానికి రెండు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజుకే పరిమితం.. ఇదీ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు. మరోపక్క ఏజెన్సీ నిర్వాహకులకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం. దీంతో వారు అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. మెనూ మమ అనిపిస్తుండటంతో చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్న దుస్థితి. సోమవారం జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన ‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలివి. ►మధ్యాహ్న భోజన పథకంలో అమలు కాని మెనూ ► బిల్లులు విడుదల కాక ►కింగ్ ఏజెన్సీల అవస్థలు ► అప్పుల ఊబిలో నిర్వాహకులు ►5 నెలలుగా గౌరవవేతనం లేదు ►నిధులు విడుదలైనా మంజూరు చేయని ఎంఈవోలు ►‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలు మచిలీపట్నం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. మెనూ అమలు కాక.. కూరల్లో నాణ్యత లేక అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు సకాలంలో రాక అప్పులు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. సోమ, గురువారాల్లో విద్యార్థులకు కోడిగుడ్డు అందించాల్సి ఉండగా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. గుడ్డు ధర మార్కెట్లో రూ.4.25కు పెరగడంతో విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు గుడ్డుకే సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా 2,56,584 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కుకింగ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీల నిర్వాహకులకు గత రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఉన్నత పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు ఉంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అప్పు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన కిరాణా షాపు యజమానుల నుంచి వేధింపులు అధికం కావడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వారికి చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నారు. 35 పైసలు పెంచారు... ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఏడాది జూన్ నుంచి కుకింగ్ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్‌ను నామమాత్రంగా పెంచింది. గతంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 చెల్లించేవారు. దానిని రూ.4.35కు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు చెల్లించే రూ.6ను రూ.6.35కు పెంచారు. ప్రస్తుత మార్కెట్లో పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలకు, పెంచిన చార్జీలకు పొంతన లేకపోవడం గమనార్హం. ఈ ఖర్చులోనే వారానికి రెండుసార్లు గుడ్డు, వంటకు ఉపయోగించే కట్టెలు సమకూర్చాల్సి ఉంది. దీంతో కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు అత్తెసరు మెనూ అమలు చేస్తూ మమ అనిపిస్తున్నారు. సోమవారం పలు ఏజెన్సీలు సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే వడ్డించాయి. సాంబారులో వివిధ రకాల కూరగాయలు, కందిపప్పు వేయాల్సి ఉండగా నాలుగు బెండకాయ ముక్కలు వేసి సరిపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే ఈరోజు కోడి గుడ్డు ధర రూ.4.25లు ఉందని, ప్రభుత్వం విద్యార్థికి వంట చేసిపెట్టినందుకు ఇచ్చేది రూ.4.35 అని, కోడిగుడ్డు కొనుగోలుకు ఈ నగదు ఖర్చయితే పది పైసలు మిగులుతోందని దీంతో నూనె, కందిపప్పు, కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా గౌరవవేతనం లేదు... ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీల నిర్వాహకురాలికి సహాయకులుగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేక ఇద్దరు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి గౌరవవేతనంగా నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా గౌరవవేతనం చెల్లించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 1600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 140 మంది విద్యార్థులు చదివే ఉన్నత పాఠశాలలో కుకింగ్ ఏజెన్సీకి నెలకు కనీసంగా రూ.25 వేలు బిల్లుగా వస్తోంది. గత రెండు నెలలుగా ఈ బిల్లులు ఇవ్వకపోవటంతో బందరు మండలంలోని చిట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు రూ.50 వేలు అప్పు చేసి వంట చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మూడో నెల పూర్తయ్యే దశలో ఉంది. ఈ మూడు నెలలు కలుపుకుంటే రూ.70 వేల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సరకులు, కూరగాయలు తీసుకున్న షాపు యజమానులు అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారని నిర్వాహకురాలు వాపోయింది. అప్పుల పాలవుతున్నాం... గన్నవరంలోని ఓ ఉన్నత పాఠశాలలో నెలకు రూ.70 వేల వరకు బిల్లు రావాల్సి ఉంది. రెండు నెలలుగా బిల్లులు అందకపోవటంతో రూ.1.50 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకురాలు అప్పుల పాలైంది. ఈ బిల్లులు ఎప్పటికి వస్తాయో, ఎప్పటికి అప్పులు తీర్చాలోనని ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించి మొదటి క్వార్టర్‌గా రూ.3.69 కోట్లు, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.10.41 కోట్ల నగదును ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవోల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 9, 10 తరగతులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులను మొదటి క్వార్టర్‌గా రూ.51.39 లక్షలు, 2వ క్వార్టర్‌గా రూ.67.18 లక్షలు, 3వ క్వార్టర్‌గా రూ.94.62 లక్షలు ఎంఈవోల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. సకాలంలో బిల్లులు రాకపోవటంతో ఇంట్లోని బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కుకింగ్ ఏజెన్సీలు నడుపుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యి పైనే వంట... జిల్లాలోని 90 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యి పైనే వంట చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందజేసినా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. దీంతో గ్యాస్ పొయ్యిలు మూలనపడి పాడైపోయే స్థితికి చేరుకున్నాయి. పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే సంబంధిత పాఠశాల హెచ్ఎం లేదా కుకింగ్ ఏజెన్సీ పేరున తీసుకోవాల్సి ఉంది. పాఠశాల హెచ్ఎం బదిలీపై వెళ్లినా, కుకింగ్ ఏజెన్సీని రద్దు చేసి వేరొకరికి అప్పగించినా గ్యాస్ కనెక్షన్ ద్వారా సిలిండర్ తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతుందనే కారణంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెలకు ఒక సిలిండర్ మాత్రమే వాడాలనే నిబంధన విధించటంతో ఒక సిలిండర్ ఎటూ చాలక కట్టెల పొయ్యి పైనే ఆధార పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం వచ్చే బియ్యం నాణ్యత తక్కువగా ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తగా వండినా అన్నం సుద్దగా మారుతోందని, ఇలా అయితే విద్యార్థులు భోజనం చేయని పరిస్థితి నెలకొంటోందని ఉపాధ్యాయులతో పాటు కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. -
గ్యాస్‌కు ‘ఆధార్’ అనుసంధానించాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలోని గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానించేందుకు గ్యాస్ డీలర్లు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో డీఎస్వో గౌరీశంకర్‌తో కలిసి గ్యాస్ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 5,20,000 ఎల్పీజి కనెక్షన్లు ఉన్నాయన్నారు. వీటిలో 3,29,000 కనెక్షన్లకు (63.3 శాతం) ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. ఇందులో 2,25,000 కనెక్షన్లకు (43.7 శాతం) బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం ఉందన్నారు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేప్పుడు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసేప్పుడు వినియోగదారుల నుంచి ఆధార్ నంబర్ తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ నంబర్‌ను గ్యాస్ వినియోగదారులు సంబంధిత డీలర్లకు ఇవ్వకపోతే సదరు కనెక్షన్‌ను బోగస్‌గా పరిగణించనున్నట్టు చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారుల జాబితాను అక్టోబర్ 1వ తేదీన ఇవ్వాలని గ్యాస్ డీలర్లను ఆదేశించారు. ఆధార్ కార్డు లేని వారు తమ మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాల్లోగల శాశ్వత ఆధార్ సెంటర్లో నమోదు చేయించుకుని, అక్కడ ఇచ్చే ఈఐడీ నంబర్‌ను ఆధార్ సీడింగ్‌లో నమోదు చేయించుకోవాలని చెప్పారు. 5వ తేదీలోగా సర్వే డేటాతో ‘ఆధార్’ను అనుసంధానించాలి సమగ్ర కుటుంబ సర్వే డేటాతో ఆధార్ నంబర్‌ను ఈ నెల 5వ తేదీలోగా అనుసంధానించాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులను జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరుకుల సక్రమ పంపిణీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 24,65,731 రేషన్ కార్డుదారుల కుటుంబాల యూనిట్లు ఉన్నాయన్నారు. వీటిలో 2,57,499 యూనిట్లకు ఇంకా ఆధార్ అనుసంధానించాల్సుందన్నారు. సమగ్ర సర్వే డేటా ఈ నెల 5 తేదీలోగా పూర్తవుతుందన్నారు. ప్రసుత్తం అందుబాటులోగల ఆధార్ నంబర్లను సర్వే డేటాతో అనుసంధానించాలని ఆదేశించారు. రేషన్ కార్డుదారులందరికీ ఆధార్ అనుసంధానించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఇక నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు చేర్చాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన డీటీలు, డీలర్లు, వీఆర్వోలకు నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి చార్జ మెమో ఇస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎం సాంబశివరావు, డీఈవో రవీంధ్రనాథ్‌రెడ్డి, సివిల్ సప్లై డీడీలు పాల్గొన్నారు. -
కనెక్షన్.. కలెక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కాకినాడకు చెందిన పూర్ణచంద్రరావు, రమాదేవి దంపతులు కొద్దిరోజుల క్రితం కర్నూలులోని అశోక్‌నగర్‌లో కొత్త కాపురం పెట్టారు. భర్త కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొత్తగా కాపురం పెట్టటంతో నిత్యావసరాలతో పాటు గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. పూర్ణచంద్రరావు గ్యాస్ కనెక్షన్ కోసం నగరంలోని ఓ ఏజెన్సీ వద్దకెళ్లారు. గ్యాస్ కనెక్షన్ కావాలి? ఎంత? అని అడిగారు. ఏజెన్సీ యజమాని అప్లికేషన్‌ను పూర్తి చేయించారు. సింగిల్ సిలిండర్ కావాలంటే రూ.5 వేలు, డబుల్ సిలిండర్ అయితే రూ.9 వేలు చెల్లించమని డిమాండ్ చేశాడు. ‘అదేంటి సార్. అంత లేదు కదా?’ అంటే.. ‘మీకు అవసరమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి. వెంటనే కావాలంటే అంతే. మీరు చెప్పిన ధరకు కావాలంటే నెలో.. రెండు నెలలో పడుతుంది. సీరియల్ ప్రకారం సమాచారం ఇస్తాం. అప్పుడు రండి. వెళ్లండి’ అని చెప్పటంతో చేసేది లేక అవసరం కోసం ఏజెన్సీ వారు అడిగినంత ఇచ్చి సిలిండర్లును తీసుకెళ్లారు. ఇలా జిల్లాలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. దోపిడీ ఇలా... జిల్లాలో 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రోజు కొత్త కనెక్షన్ కోసం ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కోసం వచ్చే వారి అవసరాలను గుర్తించి ఏజెన్సీ యజమానులు భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సింగిల్ సిలిండర్ కనెక్షన్ కావాలంటే రూ.2450 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో డిపాజిట్ రూ.1450, గ్యాస్ సిలిండర్ రూ.450, గ్యాస్ పైప్ రూ.150, రెగ్యులేటర్ రూ.250, లైటర్ రూ.50, సర్వీస్ చార్జ్ రూ.100 ఉంటాయి అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఏకంగా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అదే డబుల్ సిలిండర్ కావాలంటే రూ.7 వేల నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే డబుల్ సిలిండర్ కావాల్సి వస్తే అదనంగా రూ.450 చెల్లిస్తే రెండు సిలిండర్లు ఇవ్వాలి. ఏజెన్సీలు అందుకు వ్యతిరేకంగా దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నాయి. మామూళ్ల మత్తులో... కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వెచ్చించి లెసైన్స్ దక్కించుకుంటున్నారు. భారీ మొత్తంలో చెల్లించటంతో ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఏజెన్సీలు నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూళ్లు చేసి దండుకుంటున్నాయి. ఈ దోపిడీపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువవుతోంది. ఏజెన్సీ యజమానులు సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అశోక్‌నగర్‌కు చెందిన రమాదేవి, శరీర్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు ఏజెన్సీ దోపిడీ గురించి వేరువేరుగా ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని వెంటనే సంబంధిత ఏజెన్సీ వారికి ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారని వారు వెల్లడించారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
వాస్తవాలు చెప్పండి..
వర్ని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న సామాజిక కుటుంబ సర్వేపై ఎలాంటి భయాందోళనలు వద్దని, ఎన్యూమరేటర్లకు వాస్తవాలు తెలియజేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ సూచించారు. గురువారం మండలంలోని అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్వేపై నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలుత స్థానికులకు సర్వేపై ఎంత వరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు.అంశాల వారీగా చెప్పాల్సిన వివరాలు, ఎన్యూమరేటర్లకు చూపించాల్సి న ధ్రువపత్రాల గురించి వివరించారు. వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారం తమ వద్ద ఉందని, తప్పుగా చెబితే విచారణలో వెల్లడవుతుందన్నారు. ఆధార్ కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతా నంబర్ల ద్వారా లబ్ధిదారులు నేరుగా ప్రభుత్వ సబ్సిడీని, విద్యార్థులు స్కాలర్షిప్ను పొందవచ్చని సూచిం చారు. దళారుల సమస్య ఉండదన్నారు. గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఏజెన్సీలు పూర్తిజాబితాను అందచేశాయన్నారు. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్లు, రైతులు వ్యవసాయభూమి వివరాలు, ఏ సర్వే నంబరు ఎం త భూమి ఉందో పూర్తిగా చెప్పాల న్నారు. ఎన్యూమరేటర్లకు ధ్రువపత్రాలు ఇస్తే, వారు సంబంధించిన నంబర్ న మోదు చేసుకుని తిరిగి ఇచ్చేస్తారన్నారు. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌లు ఇవ్వాలనే ప్రచారం జరుగుతోందని పలువురు అ డుగగా, కలెక్టర్ పైవిధంగా చెప్పారు. 19న అందరూ ఇంట్లో ఉండాలి ఈ నెల 19న అందరు ఇంట్లో ఉండాలని, దూర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థుల గుర్తింపు పత్రాలు లేదా హాస్టల్ ఫీజు చెల్లింపు రశీదు తెచ్చుకోవాలని సూచించారు. వీ ఆర్ఏలు అందుబాటులో ఉండి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ఇళ్ల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేపై గ్రామస్తుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో గ్రామసర్పంచ్ రామాగౌడ్, ఉపసర్పంచ్ శంకర్, సింగిల్ విండో చైర్మన్ పత్తి రాము, బోధన్ ఆర్డీవో శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు. -
స్టడీ..రెడీ
సర్వేకు సిద్ధం కండి చెక్‌లిస్ట్ రూపొందించిన జీహెచ్ఎంసీ స్టిక్కర్ విడుదలజేసిన కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోవాల్సిన వివరాల జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించారు. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు ముద్రించి దినపత్రికలతో పాటు ఇంటింటికీ పంపిణీ చే యనున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్టర్‌ను అంటిస్తారు. దానిపై స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చినట్లు నమోదు చేసే బాక్స్‌లున్నాయి. ఎన్యూమరేటర్ ఫోన్ నంబరుకూడా ఉంటుంది. సందేహాలుంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పలిరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. దాదాపు 60 వేల నుంచి 70 వేలమంది ఎన్యుమరేటర్లు విధుల్లో పాల్గొంటున్నారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవా రు కుటుంబ వివరాలు తప్పనిసరి గా అందజేయాలి. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లాకనెక్షన్లకు సంబంధిం చిన బిల్లు రసీదులు, కుల, వికలాం గ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి. సిక్టర్ ఆవిష్కణ సర్వే సందర్భంగా జీహెచ్ఎంసీ తయారుచేసిన స్టిక్కర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ప్రజల కు ఎలాంటి సందేహాలు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలందించేందుకు ప్రజలు ఇళ్లవద్ద ఉండాలని కోరారు. అన్ని ఇళ్ల వివరాల డేటాబేస్ రూపకల్పనకు ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని చెప్పారు. -
కొడిగడుతున్న ‘దీపం’
మంజూరైనా పంపిణీలో నిర్లక్ష్యం అధికారుల నిర్వాకంతో నెరవేరని లక్ష్యం పేదలకు అందని గ్యాస్ కనెక్షన్ సాక్షి, సిటీబ్యూరో: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీపం’ పథకం అమలు నగరంలో ఘోరంగా ఉంది. గ్యాస్ కనెక్షన్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఏటా వేలాది కనెక్షన్లు కేటాయిస్తున్నా ప్రజాప్రతినిధుల అలసత్వం, సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారుల ఎంపిక నుంచి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ వర కు అడుగడుగునా జాప్యంతో ఈ పరిస్థితి దాపురించింది. నాలుగేళ్లుగా గ్యాస్ కనెక్షన్ కోసం వేలమంది అర్హులు నిత్యం సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అస్తవ్యస్త విధానం.. పథకం అమలు బాధ్యతను జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం చూస్తోంది. చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో) కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపికకే పరిమితమైంది. నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. దళారులకు పండగ దీపం పథకంలో అధికారుల నిర్లక్ష్యం చోటామోటా రాజకీయ నేతలు, దళారులకు వరంగా మారింది. వీరు ప్రజలకు కనెక్షన్ ఇప్పిస్తామంటూ వసూళ్లకు ప్పాలడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో అధికారులను కలిసి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. గ్యాస్ ఏజెన్సీల వద్ద సింగిల్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలంటే రూ.5,418 అవుతుంది. ఇందులో డిపాజిట్ రూ.1,600, మిగతా సిలిండర్, రెగ్యులేటర్, డాక్యుమెంట్ తదితర చార్జీలు ఉంటాయి. ‘దీపం’ లబ్ధిదారులు చెల్లించాల్సిన డిపాజిట్ రూ.1,250 సర్కారే చెల్లిస్తుంది. రెగ్యులేటర్, పాస్‌బుక్ ఫీజు కింద కేవలం రూ.150తో పాటు గ్యాస్ ధర కింద మరో రూ. 402 చెల్లిస్తే లబ్ధిదారులకు గ్యాస్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. అయితే, అధికారులు ప్రైవేటు ఏజెన్సీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే జాప్యం చేస్తున్నారని విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన చాలా మంది ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించి వారి వద్ద కనెక్షన్లు తీసుకుంటున్నారు. -
అన్నింటికీ ఆధారే
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సంక్షేమ పథకాలకు ఆధార్‌ను వర్తింపజేయడాన్ని గతంలో వ్యతిరేకించిన టీడీపీ.. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్‌తో ముడిపెడుతోంది. గతంలో ఆధార్ ఆధారంగా గ్యాస్‌కు ‘నగదు బదిలీ’ వర్తింప చేయడంతో చాలా మందికి సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమకాక ఇబ్బంది పడ్డారు. తిరిగి ఇప్పుడు సంక్షేమ పథకాలన్నింటికీ అదే ‘ఆధార’ం కానుంది. లేదు లేదంటూనే ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్, ఉపాధి కూలి, పక్కా గృహం బిల్లు మంజూరవుతాయని అధికారులు అంటున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు, పింఛన్‌దారులకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు, జననీ సురక్ష యోజన (జేఎస్వై) లబ్ధిదారులకు, కొత్త గ్యాస్ కనెక్షన్‌కు, చివరకు రైతు రుణ ఖాతాలకూ ఆధార్ నంబర్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తొలుత ఉపకార వేతనాలు పొందే విద్యార్థులకు ఇప్పటికే ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి వర్తింప చేస్తున్నారు. ‘జిల్లాలో 42 లక్షల మంది ఆధార్ తీయించుకున్నారు. 39.05 లక్షల మందికి ఆధార్ జనరేట్ అయింది. 2.95 లక్షల మంది ఆధార్ తీయించుకోవాల’ని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది వాస్తవం కాదని, చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదని తెలుస్తోంది. ఆధార్ నంబర్ ఉంటేనే రేషన్.. చౌక దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా రేషన్ పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 38 లక్షల మంది పేదలు ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. వీరిలో ఇప్పటికి 28.67 లక్షల మంది నుంచి ఆధార్ నంబర్ సేకరించి అనుసంధానం పూర్తి చేశారు. ఆగస్టు నుంచి ఆధార్ నంబర్ ప్రాతిపదికనే రేషన్ అందజేయనున్నారు. గ్యాస్ కనెక్షన్ కావాలంటే.. కొత్తగా గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ తప్పనిసరి అని నిబంధన పెట్టా రు. గతంలో కనెక్షన్ తీసుకున్న వారి నుంచి కూ డా ఆధార్ సేకరించారు. గ్యాస్ కనెక్షన్ ఒరిజినల్ అని నిరూపించుకోవాలంటే ఆధార్ నంబర్ చూపించాల్సిందే. జిల్లాలో 5.20 లక్షల గ్యాస్ వినియోగదారుల నుంచి ఆధార్ సేకరించారు. ‘ఇందిరమ్మ’ కూ.. ఇందిరమ్మ పథకం కింద ప్రస్తుతం కొత్తగా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోనే వారితో పాటు, గతంలో ఇల్లు మంజూరై పూర్తి చేసుకున్న వారి నుంచి కూడా అధికారులు ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. ఉపాధి కూలికి సైతం ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 7.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. వీరందరికీ ఆధార్ నంబర్ ప్రాతిపదికనే చెల్లింపులు చేపడుతున్నారు. అలాగే 4.08 లక్షల మందికి కూడా ఆధార్ నంబర్ ఆధారంగానే పింఛన్ అందజేసే ప్రయత్నాలు చేపడుతున్నారు. స్కాలర్షిప్ అందాలన్నా.. జిల్లాలో వివిధ స్థాయిలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందాలన్నా ఆధార్ నంబర్ ప్రాతిపదికనే అందజేస్తున్నారు. గత ఏడాది నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 95 వేల మంది విద్యార్థులకు దీన్ని అమలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలి సంక్షేమ పథకాలకు తిరిగి ఆధార్ నంబర్ ప్రతిపాదనను తీసుకురావడం సరికాదు. ఆధార్ కార్డులు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు చెప్పినా మళ్లీ దాన్ని ప్రభుత్వ పథకాలకు ముడిపెట్టాలని యత్నించడం అన్యాయం. గత ప్రభుత్వాలు చేసిన తప్పే ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నాయి. - ఆదినారాయణ, వ్యాపారి, అనంతపురం తిరిగి కష్టాలు తప్పవు.. రేషన్, గ్యాస్, ఇంటి మంజూరు తదితర వాటికి ఆధార్ నంబర్‌తో ముడిపెట్టడం వల్ల మహిళలకు కష్టాలు తప్పవు. సబ్సిడీలు సరిగా అందక వాటి కోసం పనులన్నీ మానుకొని తిరగాల్సివస్తుంది. ఆధార్ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలి. - హేమావతి, గృహిణి, అనంతపురం ఆధార్ నంబర్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ నంబర్ తప్పనిసరి కావడంతో ఆధార్ నంబర్లు అందనివారికివెంటనే అందజేసేలా చర్యలు చేపట్టాం. 55 మీసేవా కేంద్రాల ద్వారా, 12 ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఆధార్ తీయించుకునే వెసులుబాటు కల్పించాం. 2012 డిసెంబర్‌లోపు ఆధార్ తీయించుకుని కార్డులు ఇంకా అందకుండా ఉన్నట్లయితే అలాంటి వారు మళ్లీ తీయించుకోవాలి. - ఉమామహేశ్వర్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) -
రేషన్‌లో కోత!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు వచ్చే నెల నుంచి రేషన్ కట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆధార్ వివరాలతో సరిపోని, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలినవారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ కోత విధించనున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు వచ్చే నెల రేషన్‌లో దాదాపు 800 టన్నులకు పైగా బియ్యం, 2.70 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. ఈ సమాచారాన్ని మండలాలకు పంపి, మరోసారి పరిశీలన జరిపి బియ్యం, కిరోసిన్ కోటాలో కోత పెట్టనున్నారు. వాస్తవానికి జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. బోగస్ కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చిచూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2 లక్షల బోగస్ యూనిట్లు ఉన్నట్టు తేలింది. అంటే... ఒకే వ్యక్తి పేరు.. రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం... కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉన్నాయని తేలింది. జిల్లాలో 7,80,100 రేషన్‌కార్డులు ఉండగా... వీటిలో 6.5 లక్షలు తెల్లరేషన్‌కార్డులున్నాయి. ఇప్పటివరకు అధికారులు సేకరించిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఐదు శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 2 లక్షల యూనిట్లు బోగస్ ఉన్నట్లు తేలింది. (రేషన్‌కార్డులో ఉన్న ఒక వ్యక్తి ఒక యూనిట్ కింద లెక్క) అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలుపుదల చేయనున్నారు. జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 8 లక్షల కిలోల బియ్యం(800 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.1.3 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున 1.3 కోట్ల మేరకు ఆదా కానుంది. గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు.. తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాలని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాలవారీగా గ్యాస్ క నెక్షన్ల వివరాలను జాయింట్ కలెక్టర్ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపనున్నారు. తహశీల్దార్లు గ్రామాల వారీగా గ్యాస్ కనెక్షన్ వివరాలను పరిశీలించి ఏ కార్డుదారునికి ఎంత కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్లు జిల్లా అధికారులకు ఈ నెల 16వ తేదీలోపు అన్ని వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 2 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే రూ.15 భారం తగ్గనుంది. అంటే మరో రూ.40 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుందన్న మాట. -
నిలిచిన గ్యాస్!
మిర్యాలగూడ/భువనగిరి/హుజూర్నగర్, న్యూస్‌లైన్: వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ కష్టాలు తప్పడం లేదు. ఆధార్ అనుసంధానంపై పూటకో తీరుగా మారుతున్న ప్రభుత్వ విధానాలతో మూడు రోజులుగా జిల్లాలో వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఆధార్ కార్డుంటేనే గ్యాస్ బుక్ చేసుకోవాలని ఆయా కంపెనీల నుంచి ఆదేశాలున్నందున ఏజెన్సీల వారు అదే తీరును అనుసరిస్తున్నారు. దీనికి తోడు గ్యాస్ సక్రమంగా దిగుమతి కాకపోవడంతో వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేయడం లేదు. దీంతో గ్యాస్ కోసం మూడు రోజులుగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ నెల 30వ తేదీన నగదు బదిలీ పథకం నుంచి వంట గ్యాస్‌ను మినహాయిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో కొంత ఊరట కలిగిందని వినియోగదారులు భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాధికారులకు గానీ, గ్యాస్ కంపెనీలకు గానీ ఆధార్ లింకు అక్కరలేదన్న జీఓలు రాలేదు. దీంతో అసలు సబ్సిడీ వంట గ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధాన ప్రకియ ఉన్నట్టా? లేనట్టా? అనే విషయం స్పష్టం కాక గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, అధికారులు అయోమయంతో తలలు పట్టుకున్నారు. కాగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు ఎంత బిల్లు వసూలు చేయాలో తెలియక ఈ నెల 1వ తేదీ నుంచి గ్యాస్ సరఫరా నిలిపేశారు. 3.29లక్షలమంది ఆధార్ అనుసంధానం పూర్తి నగదు బదిలీ పథకం అమలు చేయకున్నా కేవలం ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.23 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇప్పటి వరకు 3.29 లక్షల మంది గ్యాస్ వినయోగదారులు గ్యాస్ కంపెనీలలో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోగా.. 1.87లక్షల మంది ఆయా బ్యాంకుల్లో అనుసంధానం చేసుకున్నారు. మిగతా వారిని కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆయా కంపెనీల ఏజెన్సీల వారు వినియోగదారులను కోరుతున్నారు. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు ఇప్పటి వరకు ఒక్క కనెక్షన్ ఉన్న గ్యాస్ వినియోగదారుడికి సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవారు. కాగా ఇటీవల ప్రభుత్వం ఆ సంఖ్యను 12కు పెంచింది. 12 సిలిండర్లు ఇచ్చే వ్యవహారంలో ఆయా గ్యాస్ కంపెనీలు సంసిద్దతతోనే ఉన్నాయి. కానీ ఆధార్ అనుసంధానం విషయంలో మాత్రం మినహాయింపులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేవు. గతంలో మాదిరిగానే ఆధార్ గ్యాస్ అనుసంధానం చేసుకున్న వారికి రూ. 1327 బిల్లు, అనుసంధానం చేసుకోని వారికి రూ. 445 బిల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే ఆధార్ అనుసంధానం చేసుకుంటే బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ, అనుసంధానం లేని వారికి నేరుగా సబ్సిడీ అందే అవకాశాలు ఉన్నాయి. ఆదేశాలు రాలేదు - వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ, నల్లగొండ ఆధార్ కార్డుల అనుసంధానంపై కొత్తగా ఎలాంటి ఆదేశాలూ రాలేదు. పాత పద్ధతిలోనే ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తున్నాము. కంపెనీల వారితో మాట్లాడినా వారికి కూడా జీఓలు అందలేదని చెప్పారు. గ్యాస్ ఇవ్వడం లేదు గ్యాస్ గతంలో బుక్ చేశాను. కానీ అది క్యాన్సిల్ అయ్యిందని, తిరిగి బుక్చేసుకోవాలని చెబుతున్నారు. మూడు రోజులుగా మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు. ఆధార్‌కార్డు లింకు ఉంటేనే బుక్ చేసుకుంటామని చెబుతున్నారు. - పుష్ప, మిర్యాలగూడ -
‘కస్తూర్బా’లో బోలెడు సమస్యలు
అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: బడి మానేసిన బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను స్థాపించింది. అయితే కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. అల్లాదుర్గం లోని కస్తూర్బా విద్యాలయంలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. గదుల కొరత కారణంగా విద్యార్థులు తరగతి గదుల్లోనే భోజనం చేయాల్సి వస్తోంది. ఇక్కడే సేద తీరుతున్నారు. ఈ విద్యాలయంలో బాలికలకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన అదనపు గదులు నిరుపయోగంగా ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. పొగ కారణంగా విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన జ్యోతీర్మయిని కొన్ని కారణాల వల్ల అధికారులు తొలగించారు. ప్రస్తుతం జ్యోతి అనధికారికంగా ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల జ్యోతి విధులు సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు. ఈ కారణాల వల్ల సిబ్బందికి వేతనాలు అందడం లేదు. సొంత డబ్బుతో విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు వివరించినట్లు జ్యోతి తెలిపారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 160 మంది బాలికలు చదువుకుంటున్నారు. శనివారం సగం మంది విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యాలయంలో లక్షలు వెచ్చించి నిర్మించిన 6 అదనపు గదులు వృథాగా ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించ పోవడంతో ఆ గదులను అధికారులకు అప్పగించలేదు. ప్రస్తుతం తరగతి గదుల్లోనే విద్యార్థులు పెట్టెలు, దుప్పట్లు, బక్కెట్లు ఉంచుకుంటున్నారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ జోగిపేటలో నివాసం ఉంటున్నారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వసతులు లేకపోవడం వల్ల సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. కస్తూర్బా విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సంబంధిత సన్నిహిత అధికారిగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ గపార్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా, బ్యాంకు ఖాతా తెరవాలని మూడు రోజుల క్రితం ప్రిన్సిపాల్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఖాతా తెరచిన తరువాత ప్రభుత్వం అందులో డబ్బు జమ చేస్తుందని, తరువాత సిబ్బంది జీతాలు, ఇతర అవసరాలు తీరుతాయని వివరించారు. -
ముంచుకొస్తోంది..!
=ఆధార్‌తో గ్యాస్ అనుసంధానానికినేటితో గడువు పూర్తి =ఇప్పటి వరకు 25 శాతమే నమోదు =నమోదు చేయించుకోని వారు 6.18 లక్షల మంది =పరిస్థితుల దృష్ట్యా గడువు పెంచే అవకాశం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవడానికి గడువు మంగళవారంతో ముగుస్తోంది. కానీ ఇప్పటి వరకు కేవలం 2.05 లక్షల మంది మాత్రమే నమోదు చేయించుకున్నారు. 6.18 లక్షల మంది ఇంకా నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఇంకా నమోదు చేయించుకోని వారు గడువు ముగిశాక అంటే జనవరి 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే జిల్లాలో 6.18 లక్షల మంది నాన్‌సబ్సిడీ ధర రూ.1077 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అధిక శాతం మంది అనుసంధానం చేయించుకోకపోవడంతో గడువు పెంచాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. దీన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. గ్యాస్ సబ్సిడీ డబ్బును వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువునిచ్చింది. అలా అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలిండర్లు లభిస్తాయని ప్రకటించింది. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 25 శాతం మంది అంటే 2.05 లక్షల మంది మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు. అన్నింటిపై గందరగోళం నగదు బదిలీకి ఆధార్‌తో కూడా అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆధార్ లేని వారికి నగదు బదిలీ కోసం వివరాలను సేకరించాలో? లేదో? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేకపోయింది. -
గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింకుంది!
కదిరి, న్యూస్‌లైన్: గ్యాస్ బండ కావాలంటే ఇకపై కచ్చితంగా మీకు సెల్‌ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే మీ సెల్ ఫోన్ ద్వారా బుక్ చేస్తేనే మీకు గ్యాస్ బండ కావాలన్న విషయం ఆన్లైన్లో నమోదవుతుంది. మీ మిత్రులు, ఇరుగు పొరుగు వారు, బంధువుల సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేద్దామన్నా ఆన్లైన్ అంగీకరించదు. గ్యాస్ ఏజెన్సీల్లో ‘ఇంటర్ వాయిస్ రికార్డింగ్ సర్వీస్(ఐవీఆర్ఎస్) విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో గ్యాస్ వినియోగదారులు సతమతమవుతుంటే మళ్లీ ఇంకొకటొచ్చి పడింది. చమురు సంస్థలు తీసుకున్న ఈ కొత్త విధానంతో నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు, సొంతంగా సెల్‌ఫోన్ లేనివారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 1.30 లక్షలు దీపం కనెక్షన్లున్నాయి. భారత్, హెచ్‌పీ గ్యాస్ గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా గ్యాస్ నమోదు చేసుకుంటున్నారు. ఈ విధానంపై అవగాహన ఉన్నవారేమో మంచిదంటుంటే అందరికీ ఆన్‌లైన్‌పై అవ గాహన ఉండాలి కదా? అని మెజార్టీ ప్రజలు అంటున్నారు. అందుకే ఇలాంటి వారంతా నేరుగా గ్యాస్ ఏజెన్సీల చెంతకెళ్లి గ్యాస్ బండ కావాలని నమోదు చేయించుకుంటున్నారు. ఇకపై అలా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. సెల్‌ఫోన్ లేనివారు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారితో పాటు తరచుగా సెల్ నెంబర్లు మార్చేవారికి కూడా ఐవీఆర్ఎస్ విధానంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఎందుకంటే కొత్త సెల్ నెంబర్ తీసుకున్న విషయం గ్యాస్ ఏజెన్సీ వారికి తెలియజేస్తూ తమ కస్టమర్ వివరాల్లో మార్పు చేయించాలి. ఒక సెల్ నెంబర్‌తో ఒకే కనెక్షన్‌కు మాత్రమే అనుసంధానం చేస్తారు. జనవరి ఒకటో తేదీ నుండి అందరూ ఆన్లైన్ ద్వారానే అదీ మీ సెల్ నెంబర్ ద్వారానే గ్యాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇకపై గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింక్ ఉందన్నమాట. ఐవీఆర్ఎస్ విధానంతో గ్యాస్ అక్రమాలను అరికట్టవచ్చని సివిల్ సప్లయస్ అధికారులంటున్నారు. -
అర్హులకు దీపం కనెక్షన్లు ఇవ్వాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అర్హులైన నిరుపేదలకు దీపం పథకం కింద మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీ పథకం అమలుపై జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహాలకు 2,943 కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలోని పిల్లలకు భోజనం అందించేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. 890 అంగన్వాడీలు, 1951 పాఠశాలలు, 102 సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్టౌలు త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు నగదు బదిలీ పథకం 84.73 శాతం సీడింగ్ పూర్తయిందని, కొన్ని బ్యాంకులు ఈ విషయంలో శ్రద్ధ వహించడం లేదని పేర్కొన్నారు. సీడింగ్ చేయాల్సిన కేసులు జిల్లాలో 13 వేలు తిరస్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, అరుణశ్రీ, డీఎస్వో వసంత్‌రావు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బ్యాంకర్లు, గ్యాస్ డీలర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పాల్గొన్నారు. -
ఆధార్ తప్పనిసరి చేయటం కుదరదు: సుప్రీం
-
ఆధార్ తప్పనిసరి చేయటం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఆధార్ కార్డులు లేనివారికి సుప్రీంకోర్టు తీర్పు ఊరట కలిగించింది. పథకాలకు ఆధార్ కార్డులను లింక్ చేయటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్యాస్ కనెక్షన్ సహా ఇతర సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయటం ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా అక్రమంగా వలసలు వచ్చిన వారికి ఆధార్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కాగా దేశవ్యాప్తంగా పౌరులకు ఆధార్ కార్డులను అందజేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను మరో ఐదు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇంగ్లిష్, హిందీలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందించిన ఆధార్ (www.uidai.gov.in) వెబ్సైట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.