పేలిన దీపం
► తొమ్మిది పూరిళ్లు దగ్ధం
► నిరాశ్రయులైన బాధితులు
► మిన్నంటిన రోదనలు
కాయ కష్టం చేసుకుని దాచుకున్నదంతా కళ్ల ముందే రెప్పపాటులో అగ్నికి బూడిదైంది. దీపం పథకం వచ్చిందన్న సంతోషంతో తొలిసారిగా ప్రారంభించేందుకు లబ్ధిదారు సిద్ధమవ్వగా అది కాస్త ప్రమాదంగా మారి తొమ్మిదిళ్లు దగ్ధం కావడానికి దారి తీసింది. కళ్ల ముందే ఇళ్లు కాలిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బాధితులు భోరున విలపించారు. కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వివరాల్లోకి వెళ్తే...
టెక్కలి/టెక్కలి రూరల్ : టెక్కలిలోని గొడగల వీధిలో జీరు లక్ష్మికి కొత్తగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరైంది. దీన్ని ప్రారంభించేందుకు లక్ష్మి బుధవారం సిద్ధమైంది. సంతోషంతో ఇరుగుపొరుగు వారిని కూడా పిలిచింది. ప్రారంభించేందుకు సిలెండర్ ఆన్ చేసి పొరుు్య వెలిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు చెలరేగారుు. దీంతో లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సిలిండర్ నుంచి వచ్చిన మంటలు మరింత వ్యాపించి భారీ శబ్ధంతో పేలిపోరుుంది. దీంతో కళ్లెదుటే మంటలు వ్యాపించి తొమ్మిది పూరిళ్లు కాలి బూడిదయ్యారుు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ప్రమాదంలో లక్ష్మి చేతికి చిన్నపాటి గాయాలయ్యారుు. రేరుుంబవళ్లు కష్టపడి దాచుకున్నదంతా ఒక్కసారిగా కళ్ల ముందే కాలి బూడిదవడంతో బాధిత కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ భవానీప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వైస్ ఎంపీపీ హెచ్ రామకృష్ణ, ఎంపీటీసీ రాము, నాయకులు చాపర గణపతి, బెహరా కాళీ, నారాయణరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు శరత్‌చంద్ర, రాము సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నష్టం అంచనా వేస్తున్నట్టు తహసీల్దార్ అప్పలరాజు తెలిపారు. బాధితులకు భోజన వసతితో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి ఎనిమిది వేల రూపారుులు అందజేసినట్టు చెప్పారు. బాధితులకు ఐఏవై ఇళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని తహసీల్దార్ తెలిపారు.