
ఆధార్ తప్పనిసరి చేయటం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఆధార్ కార్డులు లేనివారికి సుప్రీంకోర్టు తీర్పు ఊరట కలిగించింది. పథకాలకు ఆధార్ కార్డులను లింక్ చేయటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్యాస్ కనెక్షన్ సహా ఇతర సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయటం ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా అక్రమంగా వలసలు వచ్చిన వారికి ఆధార్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది.
కాగా దేశవ్యాప్తంగా పౌరులకు ఆధార్ కార్డులను అందజేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను మరో ఐదు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇంగ్లిష్, హిందీలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందించిన ఆధార్ (www.uidai.gov.in) వెబ్‌సైట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.