నీలి కిరోసిన్ ధర పెంచి పేదల బతుకు ల్లో ప్రభుత్వం నీలి నీడలు నింపుతోంది. చౌక దుకాణాల్లో ఇచ్చే కిరోసిన్ ధర ఒక్కసారిగా రూ. 4 పెంచడంపై నిరుపేదలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుు. గుడిసెల్లో బుడ్డి దీపాలు వెలగకుండా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కరువుతో పనులు లేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఇది అదనపు భారమవుతుందని ప్రభుత్వ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కందుకూరు అర్బన్ : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ప్రతి నెలా సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్ ధరలు మంగళవారం నుంచి పెంచనుంది. ఒక్క లీటర్ కిరోసిన్‌పై రూ. 4 పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి పేదలపై భారాన్ని మోపుతోంది. రేషన్‌షాపు దుకాణాల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన కార్డుదారుడుకి రెండు లీటర్లు, గ్యాస్ కనక్షన్ ఉన్నవారి ఒక లీటరు చొప్పును పంపిణీ చేస్తున్నారు.
ఈ ప్రకారం జిల్లా మొత్తం సుమారు 2016 రేషన్ షాపులకు గాను 8,65,933 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం లీటరు కిరోసిన్ రూ. 15లకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా సబ్సిడీపై ఇస్తున్న నీలికిరోసిన్‌పై రూ. 4లు పెంచి జిల్లాలోని పేద ప్రజలపై సుమారు నెలకు 35 లక్షల రూపాయల భారాన్ని మోపడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు లేక సాగుచేసిన పంటలకు నీరు లేక ఎండుముఖపట్టి పేదలు అల్లాడుతున్నారు. కూలీలకు కూలిదొరకక వసలబాట పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదుకోకపోగా ధరలు పెంచి పేదప్రజల నడ్డివిరుస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు కూలిపని చేసుకొని జీవనం సాగించే పేదలపై కిరోసిన్ ధరలు పెంచడం దారుణమంటున్నారు.
కిరోసిన్ ధర పెంపుపై ప్రజల మండిపాటు
రెక్కాడితేగాని డొక్కాడని అనేక కుటుంబాలు గ్యాస్ కనక్షన్ ఉన్నప్పటికీ గ్యాస్ అయిపోతే కొనడానికి డబ్బులు లేక కిరోసిన్‌పై ఆధారపడి వంట చేసుకుంటున్నారని, కరెంటు పోయినపుడు బుడ్డిదీపాలు కూడా వెలిగించుకోకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. నేటికి మారుమూల ప్రాంతాల్లో కరెంటు వసతులు లేని గ్రామాలు ఉన్నాయని, వారి గుడిసెల్లో వెలుతురు నింపే నీలి కిరోసిన్ ఆధారం కూడా లేకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఉన్న ఫళంగా కిరోసిన్‌పై ధరపెంచి పేదలపై భారం మోపడం మోసం చేయడమే అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పెంచిన కిరోసిన్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పేదల కిరోసిన్‌పై ప్రభుత్వ భారం
Published Tue, Nov 1 2016 4:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
Advertisement