డీలర్ మాయాజాలం
► కిరోసిన్ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు
► 1323 లీటర్ల స్వాహాకు యత్నం
హిందూపురం టౌన్ : రేషన్ షాపుల్లో జరుగుతున్న మోసా లను అరికట్టడానికి ప్రభుత్వం ఈపాస్‌విధానంతో రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈపాస్ విధానంలోనే మోసం చేయడానికి పూను కున్నాడో డీలర్. అధికారులు గమనించడంతో డీలర్ మోసం బయటపడింది. వివరాలు.. హిందూపురం పట్ట ణంలోని రహమత్‌పురం ఉన్న 9వ ఎఫ్‌పీ షాపు డీలర్ షఫీ రేషన్‌కార్డు దారులకు కిరోసిన్ పంపిణీలో చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులకు కిరోసిన్ పంపిణీ చేయకుం డానే పంపీణీ చేసినట్లు ఈ పాస్‌లో నమోదు చేయించి ఏకంగా 1,323 లీటర్ల కిరోసిన్‌ను స్వాహా చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో పాటు 1,550 కిలోల మిగిలిన బియ్యం కూడా లేదని అధికారుల తనిఖీలో తేలింది.
మోసం బయట పడింది ఇలా..
ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ లోపు కార్డు లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేసే సమయంలో ఆరోజే కిరోసిన్‌ను సైతం పంపిణీ చేసినట్లు లబ్ధిదారులతో ఈ పాస్‌లో నమోదు చేయించాడు. అయితే శనివారం సదరు షాపు వద్దకు కిరోసిన్ కోటా వేయడానికి అధికారులు ట్రక్కును తీసుకెళ్లారు. ఈపాస్‌లో బఫర్ స్టాక్‌ను పరి శీలించగా అప్పటికే కిరోసిన్ కోటాను పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదైంది. దీంతో అధికారులు అవాక్క య్యారు. ఆరా తీస్తే కిరోసిన్‌ను లబ్ధిదారులకు అందజేయనప్పటికీ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు చేసి మోసానికి పాల్పడ్డాడని గ్రహించారు. అక్కడికి చేరుకున్న తహశీల్దార్ విశ్వనాథ్, డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్, సీఎస్‌డీటీ రాజా పరిశీలించి డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఆ షాపు నిర్వహణను మరో డీలర్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.