- తెల్లకార్డుదారులకు పంపిణీ నిలిపివేసే యోచన
- పీడీఎస్ భారం తగ్గించుకోవాలనుకుంటున్న ప్రభుత్వం
కిరోసిన్‌కు మంగళం
Published Mon, Dec 26 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
కాకినాడ సిటీ :
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రచా రం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న నిత్యావసర సరుకుల్లో కోత పెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకొనేం దుకు త్వరలో కిరోసి¯ŒS పంపిణీ లేకుండా పూర్తిగా తొలగిం చేందుకు సిద్ధమౌతోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి సబ్సిడీ ధరలలో పంపిణీ చేసేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, పంచదార, కిరోసి¯ŒS మినహా మిగిలిన వాటికి మంగళం పాడింది. ఇటీవలనే కిరోసి¯ŒS ధరను పెంచి రేష¯ŒS కార్డుదారులపై భారం వేసింది. ఇచ్చే ఒకటి, రెండు లీటర్లను కూడా ఎత్తివేసే ఆలోచన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిధిలో 15, 26, 674 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెలుపు కార్డుదారులు ఉన్నా రు. వీరందరికీ ప్రతినెల 2,066 కిలోలీటర్ల కిరోసి¯ŒSను సరఫరా చేస్తున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బ¯ŒS ప్రాం తాల్లో నాలుగు లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో రెండు లీటర్లు పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అ న్ని ప్రాంతాల్లో ఒక లీ టరు కిరోసి¯ŒS ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో గ్యాస్‌లేని వారు 2,31,178 మంది, గ్యాస్ ఉన్నవారు 12,95, 496 మంది ఉన్నా రు. ప్రభుత్వం అందరి కీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయ ని ప్రకటించి కిరోసి¯ŒS పంపిణీ నిలిపివేయాలని ప్రయత్నిస్తోంది. అయితే కిరోసి¯ŒS అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. అటువంటి కిరోసి¯ŒSని ఎత్తివేస్తే దీపం ఏ విధంగా దీపాలు వెలిగించుకుంటామని వినియోగదారు లు ప్రశ్నిస్తున్నారు. వంటగ్యాస్‌కు కిరోసి¯ŒSకు లింకు పెట్ట డం సమంజసం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమంజసం కాదు
పేదలకు ఉపయోగపడే కిరోసి¯ŒS పంపిణీ ఎత్తివేసే ఆలోచన చేయడం సమంజసం కాదు. గ్రామాల్లో గ్యాస్ ఉన్న కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసి¯ŒSపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేని సమయంలో పేదలకు కిరోసి¯ŒS దీపాలే ఆధారం.
– పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
Advertisement
Advertisement