జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్
క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.
రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్‌సైట్‌లు లేదా వారి పీఓఎస్ మెషీన్‌ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment