హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు లాయల్టీ ప్రోగ్రామ్ సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ అప్‌డేట్‌తో ప్రభావితమైన కస్టమర్‌లకు బ్యాంక్ ఈమెయిల్ పంపింది.
అక్టోబర్ 1 నుండి స్మార్ట్‌బై ప్లాట్‌ఫామ్‌లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిమితం చేసింది. అలాగే తనిష్క్ వోచర్‌లపై రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను కూడా ఒక క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్‌లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా , ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.
ఇదీ చదవండి: వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే అందిస్తారు. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ కార్డు జాయినింగ్/రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు రూ. 12,500. దీనికి పన్నులు అదనం. ఫీజు రియలైజేషన్, కార్డ్ యాక్టివేషన్ తర్వాత వెల్‌కమ్, రెన్యూవల్ బెనిఫిట కింద 12,500 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి వచ్చే ఏడాది రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment