కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ, యూఎస్ వీసా, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
జనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.
ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)
ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)
కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)
చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)
14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.
కార్ల ధరలు
మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.
రేషన్ కార్డులకు ఈ-కేవైసీ
రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
పెన్షన్ ఉపసంహరణ నిబంధనలు
పెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అనుమతించింది.
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
సులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..
యూపీఐ పరిమితి పెంపు
యూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
యూఎస్ వీసా రూల్స్
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment