న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్‌ను గృహావసరాల కోసం ఇప్పటి వరకు సబ్సిడీపై అందిస్తున్న కేంద్రం ఇకపై ఆ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఇది అమలవుతుండగా గురువారం(జనవరి 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారులు మార్కెట్ ధర ఎంతుంటే, అంత చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాలి ఉంటుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం 568 రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది. సిలిండర్ ధర (ఢిల్లీ మార్కెట్) రూ.752గా ఉంది.
నేటి నుంచి గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాకే
Published Thu, Jan 1 2015 7:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement