హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్నవారికే వంటగ్యాస్ సబ్సిడీ లభిస్తుందని పేర్కొంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ అబ్దుల్ గఫార్ దీన్ని గురువారం దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఐ) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్లను పాత పద్ధతిలోనే పంపిణీ చేపట్టేలా సంబంధిత సంస్థలను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.
పాత పద్ధతిలోనే గ్యాస్ ఇచ్చేలా ఆదేశించండి
Published Fri, Oct 11 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement