
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది.
అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది.
నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది.
సిలిండర్ మీద సబ్సిడీ
ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్‌పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్‌పీజీ సిలిండర్‌ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది.
పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్‌పీజీ సిలిండర్‌లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది.
చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?