Domestic gas cylinders
-
షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది. నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. సిలిండర్ మీద సబ్సిడీ ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్పీజీ సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్పీజీ సిలిండర్లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది. చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా? -
మరో షాక్, భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. అయితే ఈసారి గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకు ఈ పెంపు నుంచి మినహాయింపును ఇచ్చింది. కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచింది. రూ. 43 పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 43.50 రూపాయలను కేంద్రం పెంచింది. అంతకు ముందు సెప్టెంబురు 1న ఇవే సిలిండర్ల గ్యాస్ ధరను రూ .75 పెంచింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ. 123 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1952, విజయవాడలో 1916, విశాఖలో 1825, ఢిల్లీలో రూ.1736 గా ఉండగా.. కోల్ కతాలో రూ.1805.5గా ఉంది. స్ట్రీట్ వెండర్లకు కష్టమే పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న, మధ్య తరగతి హోటళ్లకు భారంగా మారనుంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫుడ్, చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ముప్పై రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు రెండు సార్లు పెగడం వారికి ఇబ్బందిగా మారింది. కొద్దోగొప్పో వస్తున్న ఆదాయం కాస్తా పెరిగిన గ్యాస్ ధరలకే సరిపోతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Petroleum companies increase price of commercial LPG cylinders by Rs 43. Price of a 19 kg commercial cylinder in Delhi now Rs 1736.50. On Sept 1st, price of commercial LPG cylinder was increased by Rs 75. New rates effective from today. No change in domestic LPG cylinder rates. — ANI (@ANI) October 1, 2021 చదవండి: మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు -
మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు
CNG Gas Price Increased : పెట్రోలు, డీజిల్, ఎల్పీజీల ధరలు పెంచుకుంటూ పోయిన కేంద్రం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సీఎన్జీ గ్యాస్ ధరలను ఒకే సారి 62 శాతం పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూనిట్‌కి 2.90 డాలర్ల పెంపు దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. దీంతో అక్టోబర్ 1 నుంచీ ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 2.90 డాలర్ల వరకు ధర పెరగనుంది. 10 శాతం వరకు దీనివల్ల సీఎన్సీ, పీఎన్జీ ధరలు ప్రత్యేకించి ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో 10 నుంచి 11 శాతం పెరగవచ్చన్నది పరిశ్రమ అంచనా. అలాగే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్, ఎరువుల రంగాలపై కూడా ధరల భారం పడనుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఆరు నెలలు ఈ ధర అమల్లో ఉంటుంది. గత రెండేళ్లలో ఈ ధర పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన భారం కేంద్రం నిర్ణయం వల్ల సీఎన్జీ (ఆటోమొబైల్‌లో వినియోగించే), పీఎన్జీ (పైప్ ద్వారా వంట గ్యాస్) ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలుష్య రహిత వాహనాలుగా పేరొందిన సీఎన్జీ వాహనాలకు తాజా నిర్ణయం షాక్ ఇస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరల తరహాలోనే సీఎన్జీ ధరలు పెడగంతో ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్జీ వినియోగదారులపై అధిక భారం పడనుంది. వారికే లాభం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ వంటి ఉత్పత్తిదారులకు ఆదాయాలను పెంచనుండడం గమనార్హం. కాగా డీప్సీ వంటి క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన ధరను ఎంఎంబీటీయూకు ప్రస్తుత 3.62 డాలర్ల నుంచి 6.13 డాలర్లకు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ సిలిండర్లు
ఆటోనగర్, న్యూస్‌లైన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చర్లపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్లాల్సిన 279 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీ హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో డంప్ చేసేందుకు వెళ్లింది. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని లారీడ్రైవర్ గట్టయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, కరీంనగర్‌లోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీని వాస్ ఇంజాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి వీటిని అప్పగించాలని చెప్పాడని వారికి చెప్పాడు. ఈ సిలిండర్లను ఇక్కడి నుంచి సింగరేణికాలనీలో ఉన్న స్వామినాయక్ ఇతర ప్రాంతాలకు రీఫిలింగ్ చేస్తూ పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అల వాటు పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. పో లీసులు లారీతో పాటు ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీడ్రైవర్ గట్టయ్య, ఆటోడ్రైవర్ వాసు, స్వామినాయక్‌లను అదుపులోకి తీసుకోగా, సంజీవరెడ్డి, కరీంనగర్ గ్యాస్ డీలర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.