ఆటోనగర్, న్యూస్‌లైన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చర్లపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్లాల్సిన 279 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీ హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో డంప్ చేసేందుకు వెళ్లింది. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని లారీడ్రైవర్ గట్టయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, కరీంనగర్‌లోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీని వాస్ ఇంజాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి వీటిని అప్పగించాలని చెప్పాడని వారికి చెప్పాడు.
ఈ సిలిండర్లను ఇక్కడి నుంచి సింగరేణికాలనీలో ఉన్న స్వామినాయక్ ఇతర ప్రాంతాలకు రీఫిలింగ్ చేస్తూ పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అల వాటు పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. పో లీసులు లారీతో పాటు ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీడ్రైవర్ గట్టయ్య, ఆటోడ్రైవర్ వాసు, స్వామినాయక్‌లను అదుపులోకి తీసుకోగా, సంజీవరెడ్డి, కరీంనగర్ గ్యాస్ డీలర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ సిలిండర్లు
Published Wed, May 14 2014 1:13 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement