auto nagar
-
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
లారీ బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే..
సాక్షి, కృష్ణాడెస్క్: వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ లారీల బాడీ బిల్డింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లారీలకు బాడీలు తయారు చేసే నిపుణులు ఇక్కడే ఉన్నారు. కొత్తగా లారీ కొనుగోలు చేస్తే దానికి బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో లారీలను ఆటోనగర్ తీసుకొస్తారు. ఒకప్పుడు యజమానులు ఆరు టైర్ల లారీలకే పరిమితమయ్యేవారు. కానీ నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో 16 టైర్ల లారీలపై మక్కువ కనబరుస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేసినా బాడీలు కట్టించడానికి మాత్రం విజయవాడ తేవాల్సిందే. కరోనా విలయతాండవం తర్వాత కొన్ని రంగాల్లో పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. విజయవాడలోని జవహర్ ఆటోనగర్ కార్మికులు చేతి నిండా పనులతో ఉపాధి పొందుతున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌లో ప్రస్తుతం లారీల బాడీ బిల్డింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఆరుటైర్లు ఉంటే ఎంతో గొప్పగా భావించే లారీల యజమానులు ఇప్పుడు 16 టైర్ల లారీలను కొనుగోలు చేసి వాటికి బాడీలు కట్టిస్తున్నారు. వీటికి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా 35 టన్నుల వరకు లోడు వేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆరు టైర్ల వాహనాలకు ప్రతి 18 వేల కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. 16 టైర్ల వాహనాలకు (లారీ) ఇంజిన్ ఆయిల్ 80 వేల కిలోమీటర్లకు మారిస్తే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. దీంతో ఈ లారీలనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నామని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం లారీలన్నీ కర్నూలు జిల్లా బేతంచర్ల, నెల్లూరు, వైజాగ్, గుంటూరు, పొన్నూరు, తదితర ప్రాంతాల నుంచి ఆటోనగర్‌కు వస్తున్నాయి. 10 నుంచి 15 రోజుల్లో లారీ బాడీ బిల్డింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో బాడీలు కడుతున్నారు. ఎంతో మంది వృత్తి నిపుణులు... ఒక్కో లారీ బాడీ బిల్డింగ్ చేయడానికి 11 రకాల వృత్తి నైపుణ్యాలు కలిగిన కారి్మకులు అవసరం. కార్పెంటరీ, టింకరింగ్, కమ్మరం, పౌండ్రి, పెయింటర్, ఎల్రక్టీíÙయన్, అద్దాలు, సట్లు, స్టిక్కరింగ్, టైర్లు తదితర పనుల్లో స్కిల్ వర్కర్లు అందుబాటులో ఉంటారు. సుమారు రెండు వారాల పాటు వీరంతా శ్రమిస్తే గానీ 16 టైర్ల లారీలకు బాడీ బిల్డింగ్ పూర్తి కాదు. ఆటోనగర్‌లో సుమారు వెయ్యి మందికిపైగానే కారి్మకులు ఉన్నారు. వీరంతా లారీల బాడీల తయారీ పనుల్లో పాలుపంచుకుంటారు. ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్లు ►కరోనాకి ముందు: 200 ►కరోనా తర్వాత : 100 ►ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నవి : 50 ►16 టైర్ల లారీకి బాడీ బిల్డింగ్ పూర్తి చేయడానికి పట్టే సమయం: 10 నుంచి 15 రోజులు ►ఒక్క లారీ బాడీ బిల్డింగ్‌కి అయ్యే ఖర్చు రూ.4.80 లక్షలు ►ఒక్కో కార్మికుడికి రోజు కూలీ: రూ.1,000 నుంచి రూ.1,200 ►ఆటోనగర్ నుంచి పని పూర్తి చేసి బయటకు పంపే లారీల సంఖ్య రోజుకు: 50 ►వర్క్ బిజీగా ఉండే మాసాలు (సీజన్) : జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ (సీజన్లో ఈ ప్రాంతంలో లాడ్జిలు, హోటళ్లు బిజీ బిజీగా ఉంటాయి) చదవండి: పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు.. ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం 16 టైర్ల బాడీ బిల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఎక్కడా లోటు లేకుండా పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసి యజమానులకు అప్పగిస్తాం. గత మూడు నెలల నుంచి ఆటోనగర్‌కు 16 టైర్ల లారీలు వస్తున్నాయి. ఈ లారీలో 35 టన్నుల లోడింగ్ చేసుకునే అవకాశం ఉంది. బాడుగ కూడా ఎక్కువ వస్తుంది. ఆయా కంపెనీలకు చెందిన వారు 16 టైర్ల లారీలకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసి బాడీ బిల్డింగ్ కోసం బెజవాడ వస్తున్నారు. కరోనా తర్వాత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. –సంపర మల్లేశ్వరరావు, షెడ్ యజమాని -
ఆటో నగర్ పై సాక్షి గ్రౌండ్ రిపోర్టు
-
‘ఐలా’ లీలలు!
సాక్షి, అమరావతి: విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆటోనగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. గత నాలుగేళ్లుగా టెండర్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేపట్టిన టీడీపీ వర్గీయులే మళ్లీ టెండర్లు దక్కించుకునేలా ఐలా అధికారులు నిబంధనల్లో మార్పులు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐలాకు చెందిన ఓ జోనల్‌స్థాయి అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తోంది. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియ గాడితప్పింది. తమకు అనుకూలురైన వారికే టెండర్లు కట్టబెట్టాలన్న దురుద్దేశంతో విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు లేని నిబంధనలు సృష్టించినట్లు తెలుస్తోంది. తద్వారా గతంలో పనులు చేపట్టిన వారికే తిరిగి పనులు కట్ట్టబెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడా లేని నిబంధనలు.. ఆటోనగర్‌లో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు ఈ నెల 2వ తేదీన టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎక్కడా లేనివిధంగా టెండర్‌లోని నిబంధనలు ఉండటం.. కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వాటిని రూపొందించడం జరిగింది. టెండర్లు ఎవరికి దక్కుతాయో తెలియకుండానే కాంట్రాక్టర్లు వర్కర్ల గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు జతపరచాలని షరతు విధించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన 19 ఏళ్ల ఆడిట్ రిపోర్టు అడిగారు. అలాగే ఆయా సంఘాలకు సంబంధించి జీఎస్టీ సర్టిఫికెట్ జతపర్చమన్నారు. అలాగే ఐలాపై కోర్టుకు వెళ్లిన వారు అనర్హులు అనే నిబంధన కూడా పెట్టారు. వీటిపై గతంలో ఐలా పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు ఏపీఐఐసీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆ నిబంధనలను సడలిస్తున్నామంటూనే.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా రూ. 34 లక్షల పారిశుద్ధ్య పనులు చేసినట్లుగా సర్టిఫికెట్‌ను జతపర్చాలని కొత్త మెలిక పెట్టారు. చివరకు తమకు అనుకూలంగా ఉన్నవారికే పనులు దక్కేలా చక్రం తిప్పారు. మొత్తం పనుల విలువ రూ. 33.65 లక్షలు.. ఆటోనగర్‌లోని పారిశుద్ధ్య పనుల కోసం ఐలా అధికారులు ‘బ్లాక్–ఏ’.. ‘బ్లాక్–బీ’ పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టెండర్ విలువ రూ. 16,82,595గా నిర్థారించారు. టెండర్ నిబంధనల మేరకు కాంట్రాక్ట్ దక్కించుకున్నవారు ఆటోనగర్ 3వ క్రాస్ నుంచి 5వ క్రాస్ వరకు, ఫేస్–2, ఫేస్–3లో గల ప్రాంతంలోని 165 ఎకరాల స్థలంలో సుమారు 12 కిలో మీటర్ల పొడవుగల అన్ని రహదారులు, పేవ్మెంట్స్, ఫుట్‌పాత్‌లను శుభ్రపరచడంతోపాటు చెత్త, మట్టి, బూడిద, ఇసుక, రాళ్లు, సిల్టు, పిచ్చిమొక్కలు, చిన్నచిన్న జంతు కళేబరాలు.. ఇలా మొత్తం రోజూ ఉత్పత్తి అయ్యే 15 టన్నుల చెత్తను 24 మంది వర్కర్లతో తొలగించి దానిని మూడు టిప్పర్ల ద్వారా పాతపాడు, సింగ్‌నగర్ డంపింగ్ యార్డులకు తరలించాలి. మూడు నెలల కాల వ్యవధి ఉన్న ఈ పనుల మొత్తం విలువ రూ. 33.65 లక్షలు. మూడే దరఖాస్తులు.. అందులో ఒకటి డమ్మీ..! టెండర్ల ప్రక్రియలో ఐలాకు చెందిన జోనల్ అధికారి ఒకరు చక్రం తిప్పినట్లు సమాచారం. ఈ పనులకు గట్టి పోటీ ఉంటుందని తెలిసి.. గతంలో పనిచేసిన వారికే మళ్లీ పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాల పరిమితితో 2015లో ఐలా నిర్వహించిన టెండర్లలో గోగినేని ఉమా అనే మహిళ లారీలకు సంబంధించిన చెత్తను తరలించే పనులు దక్కించుకోగా.. కానూరి మణితా అనే మరో మహిళ పారిశుద్ధ్య పనులను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి నేటి వరకు నాలుగేళ్లపాటు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే వారిద్దరికి ఆయా పనులను అప్పగించారు. అప్పటి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతోపాటు, ఐలా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుంకర దుర్గాప్రసాద్‌కు వారు సన్నిహితులనే ప్రచారం ఉంది. అందువల్లే వారికి టెండర్ల లేకుండానే పనులు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో గోగినేని ఉమా, కానూరి మణితాతోపాటు వై.దేవదాస్ అనే వ్యక్తి మాత్రమే దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. అయితే వారిద్దరికే మళ్లీ టెండర్లు దక్కితే ఐలాపై విమర్శలు వెల్లువెత్తుతాయన్న కారణంతో చైర్మన్ సూచనల మేరకు వై.దేవదాస్ అనే వ్యక్తితో డమ్మీ దరఖాస్తు దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. రెండు పనుల్లోనూ దేవదాస్ దాఖలు చేసిన టెండర్ అనర్హత సాధించడమే ఇందుకు నిదర్శనమని ఐలా అధికారవర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. -
ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
సాక్షి, విజయవాడ : నగరంలోని ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత టైర్ల గిడ్డంగిలో షార్ట్ షర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పాతటైర్లకు మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఎగసిపడుతున్న మంటల్ని అదుపు చేయటానికి దాదాపు అరగంట సమయం పట్టింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు రోజు కావటంతో ప్రాణనష్టం తప్పింది. -
ఆటో నగర్
-
ఆటో నగర్ స్థలాల కేటాయింపు రద్దు
ఏలూరు రూరల్ : ఏలూరు నగర శివారున గల ఆటోనగర్‌లో ఆటోమొబైల్ మెకానిక్స్ యూనియ¯ŒS సభ్యులకు స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ ఇండస్ట్రియల్ ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేష¯ŒS (ఏపీఐఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. స్థలాలు ఇచ్చిన రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయాలనే నిబంధనను ది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేష¯ŒS పాటించనందున వారికి కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ కాకినాడ జోనల్ మేనేజర్ పి.నాగేశ్వరరావు ఉత్తర్వులిచ్చారు. దీనికితోడు స్థలాలు కేటాయించినప్పటికీ 170 మెకానిక్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నేటికీ ఏలూరు నగరంలోనే కొనసాగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసోసియేష¯ŒS పనితీరుపై అందిన ఫిర్యాదులను పరిశీలించగా అనర్హులకు స్థలాలు కేటాƇయించినట్టు తేటతెల్లమైందని అందులో స్పష్టం చేశారు. ఆటోనగర్‌లో భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పరిశీలించగా, ప్రభుత్వంతో చేసుకున్న స్థలాల ఒప్పందంలోని నిబంధనలను అసోసియేష¯ŒS అమలు చేయలేదని తేలిం దన్నారు. ఈ ఆదేశాల ప్రతులను ఏపీఐఐసీ అధికారులు ఏలూరు తహసీల్దార్ ద్వారా అసోసియేష¯ŒS కార్యాలయ గోడపై అతికించారు. దీంతో ఆటోమొబైల్ వర్గాల్లో గుబులు పుట్టింది. అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం శనివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు అధ్యక్షుడి వ్యవహార శైలిపై గళమెత్తారు. కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అక్రమాలను బట్టబయలు చేసిన ‘సాక్షి’ ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో.. అక్కడి అక్రమాలపై ’పెద్దలే గద్దలు’ శీర్షికన నవంబర్ 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ తరువాత 175 మంది బాధితులు ముందుకొచ్చి కలెక్టర్ కాటంనేని భాస్కర్, అప్పటి ఎస్పీ రఘురామ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు నాగభూషణం ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా రాజకీయం నడిపారు. అర్హుల ఆందోళన 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆటోనగర్‌లో ఇప్పటికే కొందరు అర్హులు షెడ్లు వేసుకున్నారు. వారికి కేటాయించిన స్థలాలు రద్దుకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థలాలు దక్కని అర్హులు మాత్రం ఏపీఐఐసీ ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిబంధనల మేరకు అర్హులందరికీ స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. అక్రమాల పుట్ట అసోసియేష¯ŒS కార్యకలాపాలు ఇష్టారాజ్యంగా సాగాయి. అర్హుల స్థలాలను డివిజ¯ŒS చేసి అనర్హులకు కట్టబెట్టారు. దీనిపై నిలదీసినందుకే మాకు స్థలాలు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ స్థలాలను కేటాయించాలి. – జి.రాజు, అసోసియేషన్ సభ్యుడు ఏపీఐఐసీకి అధికారం లేదు ఆటో నగర్‌లోని స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం ఏపీఐఐసీకి లేదు. రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడింది. మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 173 మంది షెడ్లు వేసుకున్నారు. – మాగంటి నాగభూషణం, అధ్యక్షుడు, మెకానిక్స్ అసోసియేష¯ŒS -
ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి కృషి
విజయవాడ(ఆటోనగర్) : జవహర్ ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ కోరారు. స్థానిక ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఐలా సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహానాడు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. దీనిపై మెకానిక్స్ అసోసియేషన్ నాయకుడు కమ్మిలి సత్యనారాయణ ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్న వారిపై చర్య తీసుకోవాలన్నారు. సమావేశంలో పీఎస్సీ బోసు రోడ్డులో ఉన్న 15 పాకలను తొలగించడంపై చర్చించారు. సమావేశంలో ఐలా ఇన్చార్జి సెక్రటరీ బాయన బాబ్జి, కోశాధికారి అన్నే శివనాగేశ్వరరావు, మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమ్మిలి సత్యనారాయణ, చిన్న పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, ఏపీఐఐసీ స్టోర్స్ చైర్మన్ యార్లగడ్డ సుబ్బారావు, డిస్పోజల్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ముజాహిద్, మహబూబ్ ఖాన్ పాల్గొన్నారు. -
రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న ఓ హోటల్లో డీఆర్ఐ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 50 కిలోల ఎపిడ్రిన్ అనే మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను చెన్నై తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటోనగర్ వ్యవహారంపై విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఆటోనగర్‌లోని స్థలాల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ‘పెద్దలే గద్దలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. బుధవారం కలెక్టరేట్లో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆటోనగర్ స్థలాలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు ఉంటే రద్దు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోనూ విచారణ ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ సిద్థార్థజైన్ ఆటోనగర్ అసోసియేషన్ అక్రమాలపై ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, జిల్లా రిజిస్ట్రార్, కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా సహకార శాఖ అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంతోపాటు సభ్యులను విచారించి అసోసియేషన్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. సభ్యులందరికీ న్యాయం జరగాలంటే ఏం చేయాలనే దానిపై మార్గదర్శకాలు రూపొందించింది. సిద్ధార్థజైన్ ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో మాగంటి నాగభూషణం హడావుడిగా స్థలాల రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. తాజాగా కలెక్టర్ కె.భాస్కర్ చేపట్టే సమగ్ర విచారణతో ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి. ఎస్పీ సీరియస్ ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంపై ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదు చేస్తామని ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. ‘పెద్దలే గద్దలు’ కథనంపై ఆయ న స్పందిస్తూ.. ఆటోనగర్ స్థలాలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న మాగంటి నాగభూషణంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. విచారణ క్రమంలో ఏపీఐఐసీ అధికారులకు సమాచారమిచ్చామని, ఇంతవరకు సమాధానం రాలేదని తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలోని వివరాలు, తమకు అందిన ఫిర్యాదుల్లోని తీవ్రత ఆధారంగా మాగంటిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు -
'ఆటోనగర్ సూర్య'కు మళ్లీ బ్రేకులు!
-
'ఆటో నగర్ సూర్య' మొత్తానికిలా వచ్చేస్తున్నాడు!
-
ఏటీఎం కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా
లబోదిబోమంటున్న బాధితులు మెదక్ మున్సిపాలిటీ : ఏటీఎం నుంచి డబ్బులు తీసిస్తామంటూ దొంగలు కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా చేసుకున్న సంఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన రైతు సురేష్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో మెదక్ పట్టణం ఆటోనగర్‌లో గల ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీగార్డు డ్రెస్‌లో ఉన్న వ్యక్తి డబ్బులు తీసిస్తానంటూ సురేష్ ఏటీఎం కార్డు తీసుకున్నాడు. కొంత డబ్బును సురేష్‌కు తీసిచ్చాడు. ఆ వెంటనే సురేష్ కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును అతనికిచ్చాడు. విషయం గమనించని సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శని, ఆదివారాల్లో అర్ధరాత్రి సమయంలో తన ఏటీఎం కార్డు నుంచి రూ.80 వేలు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో సురేష్ ఆందోళన చెందాడు. దీంతో ఏటీఎం కార్డును చూసుకోగా కార్డు మారిన విషయాన్ని గుర్తించాడు. దీంతో చేసేది లే సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో సంఘటనలో...రూ.50వేలు మండలంలోని బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎండీ పాషా శనివారం పట్టణంలోని డబ్బులు తీసుకునేందుకు మెదక్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ఏదో రిసిప్ట్ వస్తోందని, ఒకసారి ఏటీఎం కార్డు ఇవ్వాలని అడగ్గా పాషా తన కార్డును ఇచ్చాడు. కొంత సేపటి తరువాత సెక్యూరిటీ గార్డు మరో కార్డును పాషా చేతికి ఇచ్చాడు. అయితే ఆదివారం తన కార్డు ద్వారా రూ.50 వేలు డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన పాషా సోమవారం పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ అంజయ్య తెలిపారు. -
బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ సిలిండర్లు
ఆటోనగర్, న్యూస్‌లైన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చర్లపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్లాల్సిన 279 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీ హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో డంప్ చేసేందుకు వెళ్లింది. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని లారీడ్రైవర్ గట్టయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, కరీంనగర్‌లోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీని వాస్ ఇంజాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి వీటిని అప్పగించాలని చెప్పాడని వారికి చెప్పాడు. ఈ సిలిండర్లను ఇక్కడి నుంచి సింగరేణికాలనీలో ఉన్న స్వామినాయక్ ఇతర ప్రాంతాలకు రీఫిలింగ్ చేస్తూ పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అల వాటు పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. పో లీసులు లారీతో పాటు ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీడ్రైవర్ గట్టయ్య, ఆటోడ్రైవర్ వాసు, స్వామినాయక్‌లను అదుపులోకి తీసుకోగా, సంజీవరెడ్డి, కరీంనగర్ గ్యాస్ డీలర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎన్టీపీసీలో యువకుడి దారుణహత్య
గోదావరిఖని, న్యూస్‌లైన్: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ వీక్లీ మార్కెట్ సమీపంలో ఇప్ప చక్రధర్ (22) దారుణహత్యకు గురయ్యాడు. అతిగా మద్యం తాగించి చున్నీతో ఉరిబిగించి... అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆటోనగర్‌కు చెందిన ఇప్ప పెంటయ్య, కనకమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు... కుమారుడు చక్రధర్ ఉన్నారు. పెంటయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. అతడి ఉద్యోగం చక్రధర్‌కు రెండేళ్ల క్రితం వచ్చింది. అప్పటినుంచి బెల్లంపల్లిలోని శాంతిగనిలో బదిలీఫిల్లర్ కార్మికుడిగా పనిచేస్తూ.. మందమర్రిలో క్వార్టర్లో ఉన్నాడు. నెలరోజులుగా సొంతింటి నుంచే రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన చక్రధర్ పొద్దుపోయినా చేరలేదు. దీంతో తల్లి, సోదరి తెలిసిన చోటల్లా వాకబు చేశారు. గురువారం వేకువజామున వీక్లీ మార్కెట్ కోసం నిర్మించిన ప్రహరీ అవతల దారుణహత్యకు గురై కనిపించాడు. గొంతుభాగం, చాతీ ఎడమవైపు, నుదురుభాగంలో కత్తిపోట్లు ఉన్నాయి. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. డీఎస్సీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రామగుండం సీఐ నారాయణ హత్య జరిగిన తీరును పరిశీలించారు. కరీంనగర్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తి సమీపంలోని కాలువలో లభ్యమైంది. ‘ఒక్కగానొక్క కొడుకు పోయిండు.. ఇగ మాకు దిక్కెవ్వరు..’ అంటూ తల్లి కనకమ్మ రోధనలు మిన్నంటాయి. ప్రేమ వ్యవహారమే కారణమా..? చక్రధర్‌కు గోదావరిఖనిలోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటామంటూ ఏడాది క్రితం ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆమె మైనర్ కావడంతో ఆమె తండ్రి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు కింద చక్రధర్ కొద్ది రోజులు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తరచూ బాలిక నుంచి ఫోన్లు వచ్చేవని మృతుడి తల్లి కనుకమ్మ పేర్కొంది. మందమర్రి నుంచి ఇంటికొచ్చాక చాలాసార్లు ఫోన్లు చేసేదని పోలీసులకు వివరించింది. అమ్మాయి తరఫు వారే తన కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని రోధించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో లగడపాటిపై దాడికి యత్నం
విజయవాడ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మరోసారి సమైక్య సెగ తగిలింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత 33 రోజులుగా బెజవాడ ఆటోనగర్‌లో ఆటోమొబైల్ టెక్నికల్ సిబ్బంది చేస్తున్న సమైక్య దీక్ష శిబిరాన్ని సందర్శించిన సమయంలో ఉద్యమకారులు ఎంపీని నిలదీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ సందర్భంగా కార్మికులను అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. దాంతో ఆగ్రహించిన కార్మికులు లగడపాటిపైకి దూసుకు పోయేందుకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దాంతో లగడపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా లగడపాటి అక్కడ నుంచి కదలలేదు. అయినా ఆయన మాట్లాడేందుకు అవకాశం రాకపోవటంతో గంటపాటు కూర్చుని పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు.