ఆటో నగర్ స్థలాల కేటాయింపు రద్దు
Published Sun, Nov 27 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
ఏలూరు రూరల్ : ఏలూరు నగర శివారున గల ఆటోనగర్‌లో ఆటోమొబైల్ మెకానిక్స్ యూనియ¯ŒS సభ్యులకు స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ ఇండస్ట్రియల్ ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేష¯ŒS (ఏపీఐఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. స్థలాలు ఇచ్చిన రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయాలనే నిబంధనను ది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేష¯ŒS పాటించనందున వారికి కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ కాకినాడ జోనల్ మేనేజర్ పి.నాగేశ్వరరావు ఉత్తర్వులిచ్చారు. దీనికితోడు స్థలాలు కేటాయించినప్పటికీ 170 మెకానిక్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నేటికీ ఏలూరు నగరంలోనే కొనసాగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసోసియేష¯ŒS పనితీరుపై అందిన ఫిర్యాదులను పరిశీలించగా అనర్హులకు స్థలాలు కేటాƇయించినట్టు తేటతెల్లమైందని అందులో స్పష్టం చేశారు. ఆటోనగర్‌లో భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పరిశీలించగా, ప్రభుత్వంతో చేసుకున్న స్థలాల ఒప్పందంలోని నిబంధనలను అసోసియేష¯ŒS అమలు చేయలేదని తేలిం దన్నారు. ఈ ఆదేశాల ప్రతులను ఏపీఐఐసీ అధికారులు ఏలూరు తహసీల్దార్ ద్వారా అసోసియేష¯ŒS కార్యాలయ గోడపై అతికించారు. దీంతో ఆటోమొబైల్ వర్గాల్లో గుబులు పుట్టింది. అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం శనివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు అధ్యక్షుడి వ్యవహార శైలిపై గళమెత్తారు. కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.
అక్రమాలను
బట్టబయలు చేసిన ‘సాక్షి’
ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో.. అక్కడి అక్రమాలపై ’పెద్దలే గద్దలు’ శీర్షికన నవంబర్ 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ తరువాత 175 మంది బాధితులు ముందుకొచ్చి కలెక్టర్ కాటంనేని భాస్కర్, అప్పటి ఎస్పీ రఘురామ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు నాగభూషణం ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా రాజకీయం నడిపారు.
అర్హుల ఆందోళన
54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆటోనగర్‌లో ఇప్పటికే కొందరు అర్హులు షెడ్లు వేసుకున్నారు. వారికి కేటాయించిన స్థలాలు రద్దుకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థలాలు దక్కని అర్హులు మాత్రం ఏపీఐఐసీ ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిబంధనల మేరకు అర్హులందరికీ స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు.
అక్రమాల పుట్ట
అసోసియేష¯ŒS కార్యకలాపాలు ఇష్టారాజ్యంగా సాగాయి. అర్హుల స్థలాలను డివిజ¯ŒS చేసి అనర్హులకు కట్టబెట్టారు. దీనిపై నిలదీసినందుకే మాకు స్థలాలు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ స్థలాలను కేటాయించాలి. – జి.రాజు, అసోసియేషన్ సభ్యుడు
ఏపీఐఐసీకి అధికారం లేదు
ఆటో నగర్‌లోని స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం ఏపీఐఐసీకి లేదు. రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడింది. మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 173 మంది షెడ్లు వేసుకున్నారు. – మాగంటి నాగభూషణం, అధ్యక్షుడు, మెకానిక్స్ అసోసియేష¯ŒS
Advertisement
Advertisement