cites
-
‘పల్లె’విస్తున్న పట్టణం
గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడం...అదే క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం...వ్యాపార అవకాశాలు విస్తృతంగా మారడంతో పల్లె జనం పట్టణాలకు చేరుతున్నారు. రెండు దశాబ్దాల్లో జిల్లాలోని పలు పట్టణాల్లో జనాభా పెరుగుదలే ఇందుకు నిదర్శనం. కొందరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఉపాధి అవకాశాల కోసం సిటీ బాట పడుతున్నారు. దీంతో చిన్నచిన్న పట్టణాలు అనతి కాలంలోనే వేగంగా విస్తరిస్తున్నాయి. కడప కార్పొరేషన్: పట్టణ జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది...పల్లెలు విడిచి జనం పట్టణాలకు వలస వస్తున్నారు. పిల్లల చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సిటీబాట పడుతున్నారు. దీంతో గత 20 ఏళ్లలో పట్టణ జనాభా మూడింతలు పెరిగింది. ఇదే క్రమంలో పట్టణ సమీపాల్లో ఉన్న పల్లెలు పట్టణాల్లో విలీనమవుతున్నాయి. క్రమేణా పల్లె వాతావరణం మాయమై పట్టణీకరణ ఛాయలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం కడపతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. దాదాపు 22 ఏళ్లక్రితం ఈ పట్టణాల మొత్తం జనాభా 5,66,000 ఉండగా, 2011 సంవత్సరానికి 7,17,259కి చేరింది. 2021 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉండగా, కరోనా వల్ల సాధ్యం కాలేదు. అయితే 2001 జనాభాతో పోల్చితే 2021 సంవత్సరానికి దాదాపు రెట్టింపు అయినట్లు గణాంక అధికారులు చెబుతున్నారు. పదో తరగతి తర్వాత కళాశాలల్లో పిల్లలను చదివించేందుకు పలువురు పట్టణాలకు వస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు కనుమరుగు కావడంతో ఉపాధి కోసం పల్లెలను వీడుతున్న వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇదే కోవలో పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు రోజూ గ్రామాల నుంచి రాకపోకలు సాగించలేక పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. దీనివల్ల పట్టణాల జనాభా పెరిగిపోతోంది. జనాభా పెరుగుదల వల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో కాలనీలు వెలుస్తున్నాయి. పట్టణాలను అనుకొని ఉన్న పల్లెలు వాటిలో కలిసిపోతున్నాయి. దీంతో మేజర్ గ్రామ పంచాయితీలు సైతం చిన్న పట్టణాలుగా, చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలుగా మార్పు చెందుతున్నాయి. చెన్నూరు, సీకేదిన్నె, వల్లూరు మండలాలు, పెండ్లిమర్రి మండలంలోని వైవీయూ ఇప్పటికే కడపలో దాదాపు కలిసిపోయాయి. ప్రొద్దుటూరులో పోట్లదుర్తి, రాజుపాళెంలు కలిసిపోయినట్లు ఉంటాయి. మైదుకూరులో చాపాడు, దువ్వూరు, ఖాజీపేట చాలా దగ్గరగా ఉంటాయి. బద్వేల్‌కు సమీపంలో ఉన్న గోపవరం మండలం దాదాపు బద్వేల్లో కలిసిపోయింది. ఇలా చిన్న చిన్న గ్రామాలు మేజర్ పంచాయితీలలో, మేజర్ పంచాయితీలు నగర పంచాయితీల్లో కలిసిపోయి పట్టణాలుగా రూపొందుతున్నాయి. అర్బన్ మండలం ఏర్పడినా.... పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాలనా సౌలభ్యం కోసం కడప అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు సిబ్బందిని కూడా నియమించారు. అయితే అర్బన్ మండలంలోని అధికారులతో భూసేకరణ పనులు అప్పగించి, పరిపాలన పరమైన వ్యవహారాలన్నీ కడప మండలం నుంచే జరుపుతున్నారు. దీంతో కడప అర్బన్మండలం ఏర్పడినా ఫలితం లేకుండా పోయింది. మౌళిక సదుపాయాలపై దృష్టి పట్టణాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రధానంగా విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు,పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటువుతున్నాయి. వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుపడుతున్నాయి. పట్టణాలకు చేరుతున్న జనాభాకు అనుగుణంగా సమీప గ్రామాలు పట్టణాల్లో కలుస్తుండటంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల చదువుల కోసం రావాల్సి వచ్చింది మా స్వగ్రామం సిద్దవటం మండలంలోని వెంకటాయపల్లె. నాకు పట్టణ,జనాభా ,చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,గ్రామంలో కొంత పొలం ఉంది. పిల్లలను చదివించుకోవడానికి ఎనిమిదేళ్లక్రితం కడపకు వచ్చాను. మా గ్రామం నుంచి కడపకు వచ్చి పోవడానికి కొంత ఇబ్బందిగా ఉండటంతో కడపలోనే ఇల్లు బాడుగకు తీసుకొని, క్లినిక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నా. పల్లెలో ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చా. – జె. ఉమామహేశ్వరరావు, ఫిజియోథెరపిస్ట్. ఉపాధి అవకాశాల కోసం... కమలాపురం మండలంలోని అప్పాయపల్లె మా స్వగ్రామం. నేను ఫోర్ వీలర్స్‌ను బాడుగకు ఇస్తుండేవాణ్ణి. ఈక్రమంలో ఉపాధి అవకాశాల కోసం మెల్లగా కడపకు వచ్చాం. పిల్లలను కూడా ఇక్కడే చదివిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడే ఇల్లు బాడుగకు తీసుకొని, స్థిర వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాను. ఆ వ్యాపారం వల్ల జీవనం సాగిస్తున్నాను. పండుగలు, పబ్బాలకు మాత్రమే ఊరు వెళుతుంటాను. – మోషె, కో ఆపరేటివ్ కాలనీ. -
చిదంబరానికి ఎయిర్ సెల్ షాక్!
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీచిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈడీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు)ఎఫ్ఐపీబీ నిబంధనల ఉల్లంఘనలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ నివిదేకను సుప్రీంకు అందించింది. దీంతో దీనిపై తదుపరి విచారణను కోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారిస్తున్నట్టు కోర్టుకు వివరించింది. మరోవైపు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో విచారణ జరపించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నివేదిక అందించించాల్సిందిగా స్వామిని కోరింది. 2016 నాటి ఈ కేసుకు కీలక సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మాక్సిస్ అనుబంధం సంస్థ గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది.. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్‌ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు మంజూరు చేశారు. అయితే నిబంధనలను విరుద్ధంగా ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందం జరిగిందని బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి వాదిస్తున్నారు. 100 శాతం వాటా అనుమతిద్వారా మలేషియా సంస్థ మాక్సిస్ నుంచి కార్తీ చిదంబరానికి భారీ ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపించారు. ప్రధానంగా 74శాతం సీలింగ్ ఉండగా ఎక్కువ పెట్టుబడులకు అనమతించారని, గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. కాగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆటో నగర్ స్థలాల కేటాయింపు రద్దు
ఏలూరు రూరల్ : ఏలూరు నగర శివారున గల ఆటోనగర్‌లో ఆటోమొబైల్ మెకానిక్స్ యూనియ¯ŒS సభ్యులకు స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ ఇండస్ట్రియల్ ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేష¯ŒS (ఏపీఐఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. స్థలాలు ఇచ్చిన రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయాలనే నిబంధనను ది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేష¯ŒS పాటించనందున వారికి కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ కాకినాడ జోనల్ మేనేజర్ పి.నాగేశ్వరరావు ఉత్తర్వులిచ్చారు. దీనికితోడు స్థలాలు కేటాయించినప్పటికీ 170 మెకానిక్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నేటికీ ఏలూరు నగరంలోనే కొనసాగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసోసియేష¯ŒS పనితీరుపై అందిన ఫిర్యాదులను పరిశీలించగా అనర్హులకు స్థలాలు కేటాƇయించినట్టు తేటతెల్లమైందని అందులో స్పష్టం చేశారు. ఆటోనగర్‌లో భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పరిశీలించగా, ప్రభుత్వంతో చేసుకున్న స్థలాల ఒప్పందంలోని నిబంధనలను అసోసియేష¯ŒS అమలు చేయలేదని తేలిం దన్నారు. ఈ ఆదేశాల ప్రతులను ఏపీఐఐసీ అధికారులు ఏలూరు తహసీల్దార్ ద్వారా అసోసియేష¯ŒS కార్యాలయ గోడపై అతికించారు. దీంతో ఆటోమొబైల్ వర్గాల్లో గుబులు పుట్టింది. అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం శనివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు అధ్యక్షుడి వ్యవహార శైలిపై గళమెత్తారు. కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అక్రమాలను బట్టబయలు చేసిన ‘సాక్షి’ ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో.. అక్కడి అక్రమాలపై ’పెద్దలే గద్దలు’ శీర్షికన నవంబర్ 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ తరువాత 175 మంది బాధితులు ముందుకొచ్చి కలెక్టర్ కాటంనేని భాస్కర్, అప్పటి ఎస్పీ రఘురామ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు నాగభూషణం ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా రాజకీయం నడిపారు. అర్హుల ఆందోళన 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆటోనగర్‌లో ఇప్పటికే కొందరు అర్హులు షెడ్లు వేసుకున్నారు. వారికి కేటాయించిన స్థలాలు రద్దుకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థలాలు దక్కని అర్హులు మాత్రం ఏపీఐఐసీ ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిబంధనల మేరకు అర్హులందరికీ స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. అక్రమాల పుట్ట అసోసియేష¯ŒS కార్యకలాపాలు ఇష్టారాజ్యంగా సాగాయి. అర్హుల స్థలాలను డివిజ¯ŒS చేసి అనర్హులకు కట్టబెట్టారు. దీనిపై నిలదీసినందుకే మాకు స్థలాలు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ స్థలాలను కేటాయించాలి. – జి.రాజు, అసోసియేషన్ సభ్యుడు ఏపీఐఐసీకి అధికారం లేదు ఆటో నగర్‌లోని స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం ఏపీఐఐసీకి లేదు. రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడింది. మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 173 మంది షెడ్లు వేసుకున్నారు. – మాగంటి నాగభూషణం, అధ్యక్షుడు, మెకానిక్స్ అసోసియేష¯ŒS