న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీచిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈడీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు)ఎఫ్‌ఐపీబీ నిబంధనల ఉల్లంఘనలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ నివిదేకను సుప్రీంకు అందించింది. దీంతో దీనిపై తదుపరి విచారణను కోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారిస్తున్నట్టు కోర్టుకు వివరించింది.
మరోవైపు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో విచారణ జరపించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నివేదిక అందించించాల్సిందిగా స్వామిని కోరింది. 2016 నాటి ఈ కేసుకు కీలక సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
మాక్సిస్ అనుబంధం సంస్థ గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది.. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్‌ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు మంజూరు చేశారు. అయితే నిబంధనలను విరుద్ధంగా ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందం జరిగిందని బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి వాదిస్తున్నారు. 100 శాతం వాటా అనుమతిద్వారా మలేషియా సంస్థ మాక్సిస్ నుంచి కార్తీ చిదంబరానికి భారీ ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపించారు.
ప్రధానంగా 74శాతం సీలింగ్ ఉండగా ఎక్కువ పెట్టుబడులకు అనమతించారని, గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు.
కాగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం వాదిస్తున్న సంగతి తెలిసిందే.