
సాక్షి, విజయవాడ : నగరంలోని ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత టైర్ల గిడ్డంగిలో షార్ట్ షర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పాతటైర్లకు మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఎగసిపడుతున్న మంటల్ని అదుపు చేయటానికి దాదాపు అరగంట సమయం పట్టింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు రోజు కావటంతో ప్రాణనష్టం తప్పింది.