ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి కృషి
విజయవాడ(ఆటోనగర్) : జవహర్ ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ కోరారు. స్థానిక ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఐలా సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహానాడు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. దీనిపై మెకానిక్స్ అసోసియేషన్ నాయకుడు కమ్మిలి సత్యనారాయణ ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్న వారిపై చర్య తీసుకోవాలన్నారు. సమావేశంలో పీఎస్సీ బోసు రోడ్డులో ఉన్న 15 పాకలను తొలగించడంపై చర్చించారు. సమావేశంలో ఐలా ఇన్‌చార్జి సెక్రటరీ బాయన బాబ్జి, కోశాధికారి అన్నే శివనాగేశ్వరరావు, మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమ్మిలి సత్యనారాయణ, చిన్న పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, ఏపీఐఐసీ స్టోర్స్ చైర్మన్ యార్లగడ్డ సుబ్బారావు, డిస్పోజల్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ముజాహిద్, మహబూబ్ ఖాన్ పాల్గొన్నారు.