ఆదాయం..ఆవ గింజలా ఉంటే.. ఖర్చు కొండలా మారింది. దీంతో తోడు పెరిగిపోతున్న నిత్యవసర ధరలతో పాటు..సరుకు రవాణాకు లింకై ఉండడంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాన్యులు ఒక్కోరూపాయి లెక్కలేసుకొని మరి ఖర్చు చేస్తున్నారు.
దీంతో గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. అలాగే మహమ్మారి సమయంలో గ్యాస్ వినియోగం వృద్ధి పెరిగింది. అయినప్పటికీ తాజాగా గ్యాస్ డిమాండ్ తగ్గింది. వంట గ్యాస్ ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల వినియోగంలో నెలవారీగా 1.7శాతం క్షీణించింది.పెరుగుతున్న ధరలతో ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1శాతం అధికంగా ఉంది. అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6శాతం అయితే, మార్చి 2022 మొదటి 15 రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7శాతం తగ్గింది.
ఇంకా, దేశంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్ ఏప్రిల్ మొదటి 15రోజుల వరకు 7.4 అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8% ఎక్కువ. అయితే ఈ ఇంధన వినియోగం మార్చి 1 నుంచి 15 రోజుల మధ్య 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment