ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంతో ఇరు దేశాలు భారీగా నష్టపోతున్నాయి. అయినా పట్టు సాధించేందుకు దాడుల్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడే ఇదే అంశం ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థపై తీవ‍్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా ఉక్రెయిన్- రష్యా సంక్షోభంతో అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. మార్చి10న పెట్రోల్ ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరాయి. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ అత్యధికంగా
4.31 డాలర్లకు (అంటే రూ.329కి) చేరింది.
2008 జూలై 17న ఓ గ్యాలన్ పెట్రోలు ధర 4.11 డాలర్లు ఉండేది. ఆ రికార్డు తాజాగా చెరిగిపోయింది. అమెరికాలో ఓ గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. కాబట్టి ఓ లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.86.97కు చేరింది. డీజిల్ గ్యాలన్ ధర సైతం రికార్డ్ స్థాయిలో 5.05శాతం డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికన్‌లు ప్రెసిడెంట్ జోబైడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి నడపాలంటే భయమేస్తుందని, సామాన్యుల్ని కాపాడాలని వరుస ట్వీట్‌లు చేస్తున్నారు.
యూఎస్‌లో ఇంధన ధర
యూఎస్‌లో పెట్రోల్, డీజిల్‌ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో రూపంలో అమ్ముతారు. అంటే యూఎస్‌లో గ్యాలన్ అంటే 3.78లీటర్లకు సమానం. కాబట్టి యుఎస్‌లో లీటర్ పెట్రోల్,యుఎస్ గ్యాలన్‌ను లీటర్‌గా, డాలర్లను రూపాయిలుగా మార్చినప్పుడు రూ.86.97 గా ఉంది. అంటే ఇది మనదేశంలో నెలరోజులుగా అమ్ముతున్న పెట్రోల్ ధరల కంటే తక్కువగా ఉంది.
శ్రీలకంలో ఏకంగా
ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పాటు శ్రీలంకలో సైతం పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ఇటీవల శ్రీలంకకు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఎల్ఐఓసీ) ఒకే నెలలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచగా.. తాజాగా తాజాగా ఎల్ఐఓసీ ఒకేరోజు డీజిల్ పై రూ.75, పెట్రోల్ పై రూ.50 భారీగా పెంచింది.
చదవండి: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment