నోట్లో ‘కుకీసు’కుందాం | New Year Special Dishes For Cakes And Biscuits | Sakshi
Sakshi News home page

నోట్లో ‘కుకీసు’కుందాం

Published Sat, Dec 28 2019 12:08 AM | Last Updated on Mon, Dec 30 2019 4:42 PM

New Year Special Dishes For Cakes And Biscuits - Sakshi

న్యూ ఇయర్‌ వస్తోందంటే ఇళ్లన్నీ కేకులు, కుకీస్, బిస్కెట్లతో నిండిపోతాయి. ఒకరికి ఒకరు బహుమతిగా ఇవ్వడానికి బేకరీలకు ఆర్డర్‌ చేస్తుంటారు. మరి మనకు కావలసినవారికోసం స్వయంగా మనమే తయారు చేస్తే! న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పడానికి మీ స్నేహితుల ఇంటికి వెళ్లి, ఈ కుకీస్‌తో వారి నోటిని తీపి చేసి, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చెప్పండి.

క్రంచీ పీనట్‌ బటర్‌ కుకీస్‌
కావలసినవి: బ్రౌన్‌ సుగర్‌ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పీనట్‌ బటర్‌ – ఒక కప్పు; (కప్పుడు పల్లీలకు ముప్పా వు కప్పు బటర్‌ జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేస్తే హోమ్‌ మేడ్‌ పీనట్‌ బటర్‌ సిద్ధమైనట్లే)
కోడి గుడ్లు – 2 (పెద్దవి); వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను; బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూను; వేడి నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; బటర్‌/నెయ్యి – కొద్దిగా

తయారీ:
►ముందుగా అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌ చేయాలి
►ఒక పెద్ద పాత్రలో బ్రౌన్‌ సుగర్, పంచదార, పీనట్‌ బటర్, కోడి గుడ్లు వేసి బాగా గిలకొట్టాలి (ఎలక్ట్రిక్‌ మిక్సర్‌ ఉంటే, అందులో వేసి బాగా మెత్తగా అయ్యేవరకు బ్లెండ్‌ చేయాలి)
►వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు, బేకింగ్‌ సోడా, వేడి నీళ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి
►మైదా పిండి జత చేసి అన్నీ కలిసేవర కు మరోమారు గిలకొట్టాలి
►కుకీస్‌ షీట్‌ లేదా అల్యూమినియం ఫాయిల్‌ తీసుకుని, దాని మీద బటర్‌ పూయాలి
►కుకీస్‌ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్‌లో సుమారు అర గంటసేపు ఫ్రీజ్‌ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌లా చేతితో తయారుచేసి కుకీస్‌ షీట్‌ మీద ఉంచి, ప్రీ హీట్‌ చేసిన అవెన్‌లో ఉంచాలి ►సుమారు పావు గంట తరవాత బయటకు తీసి, చల్లారాక వాటిని గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

క్రిస్పీ చాకొలేట్‌ చిప్‌ కుకీస్‌
కావలసినవి: మైదా పిండి – రెండు కప్పులు (నిండుగా); బేకింగ్‌ సోడా – అర టీ స్పూను; బటర్‌ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; ప్యాక్డ్‌ బ్రౌన్‌ సుగర్‌ – ఒక కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (పెద్దది); మిల్క్‌ చాకొలేట్‌ చిప్స్‌ – ఒక కప్పు; డార్క్‌ చాకొలేట్‌ – అర కప్పు (సన్నగా ముక్కలు చేయాలి)

తయారీ
►అవెన్‌ను 375 ఫారెన్‌ హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌ చేయాలి
►చిన్న పాత్రలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
►వేరొక పాత్రలో బ్రౌన్‌ సుగర్, పంచదార, బటర్‌ వేసి బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి
►పావుకప్పు నీళ్లు, వెనిలా, కోడిగుడ్డు జత చేసి మరి కాసేపు గిలకొట్టాలి
►మైదా పిండి మిశ్రమం జత చేసి బాగా గిలకొట్టాలి
►చాకొలేట్‌ చిప్స్‌ జత చేసి, సుమారు అరగంటసేపు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి ఫ్రీజ్‌ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి
►కుకీస్‌ షీట్‌ లేదా అల్యూమినియం ఫాయిల్‌ మీద బటర్‌ పూసి, ఆ పైన కుకీస్‌ను ఉంచి, ఆ షీట్‌ను అవెన్‌లో ఉంచి సుమారు పావు గంట సేపు బేక్‌ చేసి బయటకు తీయాలి
►బాగా చల్లారాక వీటిని గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

జింజర్‌ బ్రెడ్‌ కుకీస్‌
కావలసినవి: బటర్‌ – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్‌ సుగర్‌ (బ్రౌన్‌ సుగర్‌ బదులు పంచదార కూడా వాడచ్చు) – ముప్పావు కప్పు; మొలాసెస్‌ లేదా బెల్లం పాకం – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ
కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీ స్పూను; మైదా పిండి – మూడున్నర కప్పులు బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టేబుల్‌ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; లవంగాల పొడి – అర టీ స్పూను

తయారీ
►అవెన్‌ను 350 ఫారెన్‌ హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసుకోవాలి
►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు, అల్లం పేస్ట్, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్‌ సుగర్, పంచదార వేసి బాగా గిలకొట్టాలి
►బెల్లం పాకం లేదా మొలాసెస్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి
►కోడిగుడ్డు, వెనిలా జత చేసి బాగా కలియబెట్టాలి
►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో బాగా గిలకొట్టాక ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా ఫ్రిజ్‌లో ఉంచి ఫ్రీజ్‌ చేసి,  బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌ చేయాలి ►బటర్‌ పూసిన అల్యూమినియం ఫాయిల్‌ లేదా కుకీస్‌ షీట్‌ మీద ఈ బాల్స్‌ ఉంచి, షీట్‌ను అవెన్‌లో పది నిమిషాల పాటు బేక్‌ చేసి బయటకు తీసి, చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

సుగర్‌ కుకీస్‌
కావలసినవి: మైదా పిండి – మూడు కప్పులకు కొద్దిగా తక్కువ బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూను; బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; బటర్‌ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు + 2 టేబుల్‌ స్పూన్లు; బ్రౌన్‌ సుగర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 2 టీ స్పూన్లు; పంచదార – పావు కప్పు

తయారీ
►ముందుగా అవెన్‌ను 350 ఫారెన్‌ హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసుకోవాలి
►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్‌ సుగర్, పంచదార వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి
►కోడిగుడ్డు, వెనిలా జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి
►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిజ్‌లో ఫ్రీజ్‌ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి
►వీటి మీద మనకు నచ్చిన చిప్స్‌ను చల్లుకోవాలి
►అల్యూమినియం ఫాయిల్‌ లేదా కుకీస్‌ షీట్‌కు బటర్‌ పూసి, ఆ పైన ఈ కుకీస్‌ను ఉంచి, అవెన్‌లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్‌ చేసి బయటకు తీసేయాలి
►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

 వైట్‌ చాకొలేట్‌ బ్లూ బెర్రీ ఓట్‌మీల్‌ కుకీస్‌
కావలసినవి: బటర్‌ – అర కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్‌ సుగర్‌ – అర కప్పు; కోడి గుడ్డు – 1 (పెద్దది); వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 2 టీ స్పూన్లు; మైదా పిండి – ఒక కప్పు + 2 టేబుల్‌ స్పూన్లు; కార్న్‌ స్టార్చ్‌ – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూను; బేకింగ్‌ సోడా – అర టీ స్పూను; బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను; ఓట్స్‌ – ఒక కప్పు; వైట్‌ చాకొలేట్‌ చిప్స్‌ – అర కప్పు; తాజా బ్లూబెర్రీలు – ఒక కప్పు

తయారీ
►ముందుగా అవెన్‌ను 350 ఫారెన్‌ హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసుకోవాలి
►ఒక పాత్రలో మైదాపిండి, కార్న్‌ స్టార్చ్, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్‌ సుగర్, పంచదార వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి
►కోడిగుడ్డు జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి
►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో గిలకొట్టాక, ఓట్స్, వైట్‌ చాకొలేట్‌ చిప్స్‌ జత చేసి, గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టాలి
►చివరగా తాజా బ్లూబెర్రీలు జత చేయాలి
►చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి
►అల్యూమినియం ఫాయిల్‌ లేదా కుకీస్‌ షీట్‌కు బటర్‌ పూసి, ఆ పైన ఈ కుకీస్‌ను ఉంచి, అవెన్‌లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్‌ చేసి బయటకు తీసేయాలి
►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement