న్యూ ఇయర్‌కి ఈసారి వెరైటీగా రాగి పిండితో ఆరోగ్యకరమైన కేక్ తయారు చేసుకోండి!
కావలసినవి:
►రాగి పిండి– 100 గ్రాములు
►గోధుమ పిండి – వంద గ్రాములు
►కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్‌లు
►చక్కెర – 100 గ్రాములు (చక్కెరకు బదులు బెల్లం పొడి లేదా తాటి బెల్లం పొడి కూడా వాడవచ్చు)
►పెరుగు – 100 ఎమ్‌ఎల్ (చిలకాలి)
►వెన్న – 150 గ్రాములు
►పాలు – 200 ఎమ్‌ఎల్
►యాపిల్ సిడర్ వినెగర్– అర టేబుల్ స్పూన్
►వెనిలా ఎసెన్స్ – టేబుల్ స్పూన్
►బేకింగ్ పౌడర్ – టీ స్పూన్
►బేకింగ్ సోడా – అర టీ స్పూన్
తయారీ:
►రాగి పిండి, గోధుమ పిండి కలిపి జల్లించాలి.
►జల్లించిన పిండిలో కోకోపౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మరో రెండుసార్లు జల్లించాలి.
►ఇలా చేయడం వల్ల అన్నీ సమంగా కలుస్తాయి. ఇందులో చక్కెర వేసి కలపాలి.
►మరొక పాత్రలో పాలు, వెనిలా ఎసెన్స్, వినెగర్, చిలికిన పెరుగు, వెన్న వేసి కలపాలి.
►ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
►ఇప్పుడు ఒవెన్‌ను 170 డిగ్రీల దగ్గర వేడి చేయాలి.
►కేక్ మౌల్డ్ లేదా వెడల్పు పాత్రకు కొద్దిగా వెన్న రాసి కేక్ మిశ్రమం అంతటినీ పాత్రలో పోసి ఒవెన్‌లో పెట్టాలి.
►అరగంటకు కేక్ చక్కగా బేక్ అవుతుంది.
►ఒవెన్‌లో నుంచి తీసిన తర్వాత చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.
►ఇష్టమైతే కేక్ మీద కోకో, చాకొలెట్‌లతో గార్నిష్ చేయవచ్చు.
ఇవి కూడా ట్రై చేయండి: కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా!
మైదా ఎందుకు? సజ్జపిండితో ఆరోగ్యకరమైన కేక్ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment