మృతి చెందిన హుస్సేన్‌బాష (6)
సాక్షి, ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం బిస్కెట్లు తిని ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాబు వద్ద ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్‌బాష (6), జమాల్‌బీ, హుస్సేన్‌బీ డబ్బులు తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారు. అవి తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పితో విలవిల్లాడారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆళ్లగడ్డలోని వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్‌బాష మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారులు కొన్న బిస్కెట్ల ప్యాకెట్‌పై ‘రోజ్ మ్యాంగో’ అనే పేరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment