Tips To Keep Biscuits And Cookies Crispy In Rainy Season - Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..

Published Wed, Aug 2 2023 1:27 PM | Last Updated on Wed, Aug 2 2023 2:36 PM

Tips To Keep Biscuits And Cookies Crispy In Rainy Season - Sakshi

వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి...

  • ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి.
  • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. 
  • జిప్‌లాక్‌ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. 
  • గాలిచొరబడని డబ్బాలు, జిప్‌లాక్‌ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్‌లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. 
  • అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్‌ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement