దేశ ప‍్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్ సోయా బిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు క్రూడ్ పామాయిల్‌పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను, పాయిల్‌పై 10శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి.
వంటనూనెలేనా ఇంకా
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెలతో పాటు ఫుడ్ ఐటమ్స్, కాస్మోటిక్స్ ధరలు అదుపులోకి రానున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) సంస్థలు తయారు చేసేందుకు ముడి పదార్ధాలైన సన్ ఫ్లవర్ ఆయిల్, పాయిల్‌ను వినియోగిస్తుంటాయి. నూనె ధరలు తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రా మెటీరియల్‌పై పెట్టే ఖర్చును తగ్గించడంతో అటోమెటిగ్గా.. తయారు చేసే ప్రొడక్ట్‌ల ధరలు తగ్గుతాయి.
వచ్చే మూడునెలల్లో
మనదేశంలో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తక్కువ.అందుకే భారత్ సంవత్సరానికి 55 శాతం 60శాతం వరకు వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నూనెలపై ట్యాక్స్ తగ్గింపుతో రాబోయే 3నెలలో సామాన్యులు విరివిరిగా వినియోగించే వస్తువుల ధరలు భారీ తగ్గనున్నాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ పార్ట్‌నర్ సుమన్ జగ్దేవ్ తెలిపారు.
నూనెల తగ్గింపుతో
త్వరలో తగ్గనున్న వంట నూనెల ధర ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడనుంది. నూనెతో తయారు చేసే బిస్కెట్‌లాంటి ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెయ్యి, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడనున్నాయని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం అధినేత వినీత్ బోలిజ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండేళ్ల నుంచి ధరలు పైపైకి
కరోనా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సప్లయ్ చైన్ సమస్య, పెరిగిన ఇన్ పుట్ కాస్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల దేశీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థలైన నెస్లే ఇండియా, మారికో, హిందుస్తాన్ యూనిలివర్, రుచి సోయా, బ్రిటానియా, డాబర్,కోల్గెట్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థలు గత రెండేళ్లలో పలు ప్రొడక్ట్‌లను భారీగా పెంచాయి. తాజా, కేంద్ర నిర్ణయంతో పై సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment