![Vodafone Idea Ceo Akshaya Moondra Urges Govt To On Telecom Tax In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/4/vodafone.jpg.webp?itok=8xdKqMDt)
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్‌లో టెలికం కంపెనీలపై పన్నుల మోత ఉంటోందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ్ ముంద్రా వ్యాఖ్యానించారు. పెట్టుబడులు భారీగా అవసరమయ్యే టెలికం పరిశ్రమపై ఇది మరింత భారం మోపుతోందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించి, దాన్ని టెలికం నెట్‌వర్క్‌లపై తిరిగి ఇన్వెస్ట్ చేసే విధంగా పరిశ్రమపై ప్రభుత్వం పన్నుల భారం తగ్గించాలని పేర్కొన్నారు.
టెలికం పరిశ్రమ 18 శాతం జీఎస్‌టీ, ఇతరత్రా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలతో పాటు స్పెక్ట్రం కొనుగోలు కోసం వెచ్చించినదంతా పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 58 శాతం పన్నులు కట్టినట్లవుతుందని ముంద్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment