ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారత్ భారీ షాకివ్వనున్నట్లు సమాచారం. ఆ సంస్థ అర్జించే ఆదాయంపై ట్యాక్స్ వసూలు చేయనుందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
ట్యాక్స్ అధికారుల సమాచారం మేరకు 2021-2022 సంవత్సరానికి నెట్‌ఫ్లిక్స్ పర్మినెంట్ ఎస్టాబ‍్లిష్‌మెంట్ ప్రాతిపదికన సుమారు 6.73 మిలియన్లు ఆదాయాన్ని గడించినట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ భారత్ రెండవ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని, ఆ సంస్థలకు ఉద్యోగులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కలిగి ఉందని ఆదాయపు పన్ను అదికారులు చెబుతున్నారు. కాబట్టే నెట్‌ఫ్లిక్స్ గడించే ఆదాయంలో పన్ను వసూలు చేయాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment