ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో లేదంటే వచ్చే ఏడాది సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచుతుందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపుపై వచ్చిన నివేదికల్ని ఊటంకిస్తూ అవి నిజమేనంటూ తన తాజా కథనంలో హైలెట్ చేసింది.
సబ్‌స్కిప్షన్ మార్పులపై స్పష్టత లేనప్పటికి ముందుగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో ముందుగా ‘ధరల పెంపు’ ఉంటుందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం భారత్‌కు వర్తిస్తుందా? లేదా? అని తెలియాల్సి ఉండగా.. గ్లోబుల్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ ధరల పెంపు ఉంటుందనేది పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, గత ఏడాది సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మరుసారి ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం పట్ల యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఓటీటీ నెట్‌వర్క్‌లను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు.
పాస్‌వర్డ్ షేరింగ్ అంటూ
స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్ పేరుతో యూజర్ల నుంచి అదనపు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులకు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఆ విధానానికి కొద్ది రోజులు స్వస్తి చెప్పినట్లే చెప్పి.. మళ్లీ యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్ పేరుతో నోటిఫికేషన్లు పంపింది.
పెరిగిన యూజర్లు
పాస్‌వర్డ్ షేరింగ్‌కు స్వస్తి పలకడంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ ఏడాది క్యూ2లో యూజర్లు దాదాపు 6 మిలియన్ వచ్చి చేరారు. ఇది దాదాపు 8 శాతం పెరుగుదలను చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment