Video Streaming
-
యూజర్లకు షాక్.. మరింత కాస్ట్లీగా యూట్యూబ్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఆదాయమార్గాల్ని అన్వేషిస్తున్న యూట్యూబ్ పలు దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం ధరల్ని మరింత పెంచింది. పెంచిన ధరలతో యూట్యూబ్ కొన్ని దేశాల్లో మరింత కాస్ట్లీగా మారింది. వాటిల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఎక్కువ యాడ్స్ ఉంటే యూట్యూబ్‌కి ఆదాయం పెరుగుతుంది. అయితే, యూజర్లు యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు. దీంతో ఆదాయం తగ్గడంతో యాడ్ బ్లాకర్స్‌ని వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్ చేసేలా కొత్త మెకానిజంను తయారు చేసింది. ఈ టెక్నాలజీ రాకతో ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లను వినియోగించే వారికి ‘యాడ్ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని మెసేజ్‌లు పంపిస్తుంది. నవంబర్ 1 నుంచే అమలు తాజాగా, 9 టూ 5 గూగుల్ నివేదిక ప్రకారం.. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చీలీ,జర్మనీ, పోలాండ్, టర్కీ ఈ 7 దేశాలకు చెందిన యూజర్లకు యూట్యూబ్ మెయిల్స్ పంపింది. య్యూట్యూబ్‌లో ప్రీమియం ధరల్నిపెంచుతున్నట్లు ఆమెయిల్స్లో పేర్కొంది. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ సేవల్ని వినియోగిస్తున్న యూజర్లు మరో మూడు నెలల వరకు పాత సబ్స్క్రిప్షన్ ఛార్జీలను చెల్లించే అవకాశం కల్పిస్తూనే.. కొత్తగా వచ్చి చేరే పెయిడ్ యూజర్లు మాత్రం పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పింది. అయితే, పెంచిన ధరలు ఎంతనేది తెలియాల్సి ఉంది. భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ధరలు భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం ధరలు స్థిరంగానే ఉన్నాయి. సంస్థ ప్రస్తుతం చందాదారుల నుండి నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర రూ. 139, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ధర రూ. 399, ఏడాది సభ్యత్వానికి ధర రూ. 1,290ని వసూలు చేస్తుంది. తద్వారా యూజర్లు యూట్యూబ్‌లో వీడియోల్ని వీక్షించే సమయంలో ఎలాంటి యాడ్స్ డిస్ప్లే అవ్వవు. చదవండి👉 ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో లేదంటే వచ్చే ఏడాది సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచుతుందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరల పెంపుపై వచ్చిన నివేదికల్ని ఊటంకిస్తూ అవి నిజమేనంటూ తన తాజా కథనంలో హైలెట్ చేసింది. సబ్‌స్కిప్షన్ మార్పులపై స్పష్టత లేనప్పటికి ముందుగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో ముందుగా ‘ధరల పెంపు’ ఉంటుందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం భారత్‌కు వర్తిస్తుందా? లేదా? అని తెలియాల్సి ఉండగా.. గ్లోబుల్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ధరల పెంపు ఉంటుందనేది పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గత ఏడాది సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మరుసారి ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం పట్ల యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఓటీటీ నెట్‌వర్క్‌లను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పాస్వర్డ్ షేరింగ్ అంటూ స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ పేరుతో యూజర్ల నుంచి అదనపు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఆ విధానానికి కొద్ది రోజులు స్వస్తి చెప్పినట్లే చెప్పి.. మళ్లీ యూజర్లకు పాస్వర్డ్ షేరింగ్ పేరుతో నోటిఫికేషన్లు పంపింది. పెరిగిన యూజర్లు పాస్వర్డ్ షేరింగ్‌కు స్వస్తి పలకడంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ ఏడాది క్యూ2లో యూజర్లు దాదాపు 6 మిలియన్ వచ్చి చేరారు. ఇది దాదాపు 8 శాతం పెరుగుదలను చూపించింది. చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్ -
అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ధేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో అప్పటికే క్రియేటర్లు షేర్ చేసిన స్టోరీస్‌లోని పోస్ట్‌లు కనుమరుగు కానున్నాయి. 2017లో యూట్యూబ్ 10వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్న యూజర్లకు స్టోరీస్ అనే ఫీచర్‌ను అందించడం ప్రారంభించింది. ఆ ఫీచర్ సాయంతో యూట్యూబ్ క్రియేటర్లు వారి కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మరింత సులువగా ఉండేది. కానీ యూట్యూబ్ ఊహించిన స్థాయిలో క్రియేటర్లు స్టోరీస్‌ని వినియోగించేందుకు మక్కువ చూపలేదు. ముఖ్యంగా, వినియోగంలో పరిమితి ఉండడంతో పట్టించుకోలేదు. అందుకే ఈ యూట్యూబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్ ఉన్నాయిగా యూట్యూబ్ నిర్వాహకులు అప్లోడ్ చేస్తున్న కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు స్టోరీస్‌కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్లు వినియోగిస్తున్నారు. యూజర్లను కంటెంట్‌తో ఎంగేజ్ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్లలో టెక్ట్స్‌తో పాటు, పోల్లు, క్విజ్లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో స్టోరీస్ ఫీచర్‌ను పట్టించుకోలేదు. చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా.. -
క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ ‘మూబి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూత పడడంతో ‘వీడియో స్ట్రీమింగ్ సర్వీస్’లు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నాయి. థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమాలను ఈ సర్వీసులు నేరుగా వినియోగదారుల ఇంట్లోకి, గదుల్లోకి తీసుకొచ్చాయి. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, టేబుల్ టాప్స్, ఆఖరికి సెల్ఫోన్ల ద్వారా కూడా వినియోగదారులు కోరుకున్న సినిమాలను చూసే భాగ్యాన్ని ఈ సర్వీలు అందుబాటులోకి తెచ్చాయి. భారత్‌లో ప్రధానంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, హాట్‌స్టార్, జీ5, సోనిఎల్ఐవీ, ఎంఎక్స్ ప్లేయర్లు ‘వీడియో స్ట్రీమింగ్ సర్వీస్’ ద్వారా సినిమాలను, వెబ్ సిరీస్‌ను, సీరియళ్లను ప్రసారం చేస్తున్నాయి. ఈ కోవలోకి సరికొత్తగా ‘మూబి (ఎంయూబీఐ)’ వచ్చి చేరింది. వాస్తవానికి ఈ ‘మూబి’ని 2007లోనే ‘ఎఫే కరాకెల్’ సంస్థ ప్రారంభించి తన సేవలను ప్రపంచంలోని 190 దేశాలకు విస్తరించింది. భారత్‌లోకి 2019, నవంబర్‌లోకి అడుగుపెట్టింది. (‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి చెందాడు’) ఇది బాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్లకు పరిమితం కాకుండా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న, అందుకుంటున్న ‘మరో సినిమా’ చిత్రాలకు ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పాతతరం మెచ్చిన, మెచ్చుకునే చిత్రాలను అన్ని తరాలకు అందుబాటులోకి తెచ్చింది. అనార్కలీ, ప్యాసా, దో బిఘా జమీన్, మధుమతి, బూట్ పాలిష్, బేజూ బావ్రా, నీచే నగర్ లాంటి చిత్రాలతోపాటు, ఆవారా, శ్రీ420 లాంటి రాజ్ కపూర్ చిత్రాలు, హృషికేశ్ ముఖర్జీ నిర్మించిన ‘గోల్మాల్’, సత్యజిత్ రాయ్ నిర్మించిన ‘పథేర్ పాంచాలి’ లాంటి చిత్రాలతోపాటు మృణాల్ సేన్ చిత్రాలను కూడా ఈ మూబి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. విమర్శకులకు కూడా అంతగా పరిచయంలేని అమిత్ దత్తా డాక్యుమెంటరీలను కూడా ఇది అందుబాటులోకి తెస్తోంది. కుల వివక్షపై అరుణ్ కౌల్ తీసిన దిక్షా (1991), అర్బన్ డ్రామాపై గిరీశ్ కాసర్వల్లీ తీసిన ‘ఏక్ ఘర్ (1991), వలస కార్మికుల గుర్తింపు పత్రాలకు సంబంధించిన ఇతివృత్తంతో కమల్ కేఎం తీసిన ఐడీ (2013) చిత్రాలతోపాటు మలయాళంలో వేణు తీసిన పరిణామం (2003), సీపీ పద్మకుమార్ తీసిన సమ్మోహనం (1994) చిత్రాలను ‘మూబి’ సెప్టెంబర్ నెలలో ప్రసారం చేస్తోంది. పీకే నాయర్‌పై శివేంద్ర సింగ్ దుంగార్పూర్ తీసిన ‘సెల్యులాయిడ్ మేన్ (2012)’ డాక్యుమెంటరీని, పరీక్షల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటోన్న విద్యార్థులపై అభయ్ కుమార్ తీసిన ‘ప్లేస్‌బో (2014) డాక్యుమెంటరీని ఈ సెప్టెంబర్‌లోనే ప్రసారం చేస్తోంది. బాలీవుడ్లో ‘మరో సినిమా’ కేటగిరీ కిందకు వచ్చే ఈ పాత సినిమాల్లో అనేకం మనకు ‘యూట్యూబ్’లో కనిపిస్తాయి. అయితే అవి ఒరిజల్స్ కాకపోవడం వల్ల నాణ్యతతో లేవు. పైగా మూబిలో ప్రాసరం చేస్తున్న చిత్రాలు ‘క్యూరేట్’ చేసినవి. ప్రతి పాత సినిమా చూడాలంటే అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఏ కేటగిరీలో ఏ సినిమా చూడడం మంచిదో, ఏ దర్శకుడు, ఏ సమాజిక దృక్పథంతో సినిమా తీశారో అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎంపిక చేస్తున్నారు ‘మూబి కాంటెన్ట్ డైరెక్టర్’ స్వేత్లానా నౌదియాల్. మొదట్లో మనికౌల్, శ్యామ్ బెనగల్, సయీద్ మీర్జా సినిమాలకు పరిమితమైన ‘మూబి’ స్వేత్లానా రాకతో రూపురేఖలు మార్చుకుంది. బాలీవుడ్ తరహాలో హాలీవుడ్ క్లాసిక్స్‌ను కూడా మూబీ ప్రసారం చేస్తోంది. నచ్చిన లేదా ఎంపిక చేసిన అన్ని చిత్రాల రైట్స్‌ను తీసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, అందుకని తమ మూబి నెల రోజుల నుంచి 18 నెలలపాటు చిత్రాల రైట్స్‌ను కొనుగోలు చేస్తోందని ఆమె చెప్పారు. (మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్) -
శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్
సాక్షి, న్యూఢిల్లీ : శాంసంగ్ స్మార్ట్ టీవీ వినియోగదారులు వచ్చే డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ సినిమాలను, ఇతర కార్యక్రమాలను చూడడం కుదరదు. సాంకేతిక పరిమితుల వల్ల ముఖ్యంగా పాత మోడళ్లలో తమ ప్రసారాలను చూడలేరని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం పేర్కొంది. రానివారు తమ కార్యక్రమాలను చూడాలంటే సరైన సెటాప్ బాక్స్‌ను అమర్చుకోవాలని సూచించింది. అయితే ఏయే మోడళ్లలో తమ కార్యక్రమాలు రావో నెట్‌ఫ్లిక్స్ వెళ్లడించలేదు. ఆపిల్ టీవీ, క్రోమ్‌క్యాస్ట్, గేమ్ కన్సోల్స్తోపాటు మరికొన్ని ఇతర సెటాప్ బాక్సులను ఉపయోగించి తమ కార్యక్రమాలను చూడవచ్చని తెలిపింది. తమ పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల తక్కువ సంఖ్యలోని వినియోగదారులపైనే ప్రభావం ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఇంకా శాంసంగ్ టీవీల యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
జొమాటో వీడియో స్ట్రీమింగ్ సేవలు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వీడియో కంటెంట్ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 16 నుంచి వీడియో స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో యాప్‌లో వీడియోస్ అనే ట్యాబ్ నుంచి వీటిని చూడొచ్చని కంపెననీ తెలిపింది. 18 ఒరిజినల్ షోలను వచ్చే మూడు నెలల కాలంలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ షోలు అన్నీ కూడా ఆహారానికి సంబంధించినవేనని కూడా స్పష్టం చేసింది. 3–15 నిమిషాల వరకు వీడియోల నిడివి ఉంటుందని వివరించింది. ‘‘ఒరిజినల్ షోలపై ఇన్వెస్ట్ చేశాం. ఫిక్షన్, నాన్ ఫిక్షన్‌కు సంబంధించి భిన్నమైన షోలనూ రూపొందించేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించాం’’ అని జొమాటో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా రఘునాథ్ తెలిపారు. హిందీ, ఇంగ్లీషులో ఉండే ఈ షోలతో దేశంలోని అన్ని ప్రాంతాలను చేరుకుంటామన్నారు. -
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్
ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. తాజా ఆండ్రాయిడ్ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్ ఆప్షన్ ఉపయోగపడనుంది. ఇన్నిరోజులు యూజర్ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్ స్క్రోల్ చేస్తూ వెతుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్ ఆప్షన్ పెట్టింది. దానిలో మనకు కావాల్సిన ఎమోజీలను టైప్ చేస్తే చాలు(ఉదాహరణకు హ్యాండ్ అని టైప్ చేస్తే), వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్ టైప్ చేసే కిందకు వచ్చేస్తాయి. వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. బీటా వెర్షన్ 2.17.246 ఎమోజీ సెర్చ్ యాక్టివేట్ అయినట్టు కంపెనీ చెప్పింది. ఎమోజీ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే, ఆ జాబితా అంతా వచ్చేస్తోంది. వాటికింద సెర్చ్ ఐకాన్ దర్శనమివ్వనుంది. సెర్చ్ ఐకాన్ క్లిక్ చేసి, యూజర్లకు తమకు కావాల్సిన ఎమోజీని సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాక తొలుత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ కూడా ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ రిలీజ్ చేసింది. రీకాల్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎఫ్ఏక్యూ పేజీ చెప్పింది. -
ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు!
ఫేస్ బుక్ వీడియోలను టెలివిజన్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోరిక సాధ్యమవుతుందట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్‌తో మన ముందుకు రాబోతుంది. ఆ ఫీచర్ తో తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టెలివిజన్ స్క్రీన్‌పై అందించేందుకు టెస్టింగ్ ప్రారంభించిందట. దీంతో యూజర్లకు అందించే వీడియో కంటెంట్‌ను ఫేస్బుక్ పెంచుకోవాలనుకుంటోంది. ఇటీవలే లైవ్ బ్రాండ్కాస్టింగ్ సర్వీసును ప్రారంభించిన ఫేస్బుక్, తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా ఫేస్బుక్ వీడియోలను టీవీలో కూడా వీక్షించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎయిర్‌ప్లే, క్రోమ్కాస్ట్ల ద్వారా ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టీవీలకు కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఎయిర్‌ప్లే, క్రోమ్‌కాస్ట్ ద్వారా వీడియోలను యాప్ నుంచి టీవీలోకి బెటర్‌గా అందించడానికి ఫేస్బుక్ యాప్‌ను టెస్ట్ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ యాప్‌లో వీడియో ప్లేయర్‌ను మినిమైజ్ చేసి, న్యూస్ ఫీడ్‌ను కూడా చూసుకోవచ్చని మార్కెటింగ్ ల్యాండ్ రిపోర్టులు చెబుతున్నాయి. క్రోమ్‌కాస్ట్ యూజర్లు ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకుని ఒకదాని తర్వాత మరొకటి ప్లే అయ్యేలా సెట్ కూడా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ కొత్త ఫీచర్‌తో ఫేస్బుక్, వీడియో స్ట్రీమింగ్ డిపార్ట్మెంట్లో ఆధిపత్య స్థానానికి వెళ్లనుంది. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్స్కు ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడనుంది. దీంతో లైవ్‌లను ఫేస్బుక్ యాప్‌లో వీక్షించే యూజర్లు ఇక నుంచి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.