వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్
Published Fri, Jun 30 2017 12:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. తాజా ఆండ్రాయిడ్ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్ ఆప్షన్ ఉపయోగపడనుంది. ఇన్నిరోజులు యూజర్ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్ స్క్రోల్ చేస్తూ వెతుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్ ఆప్షన్ పెట్టింది. దానిలో మనకు కావాల్సిన ఎమోజీలను టైప్ చేస్తే చాలు(ఉదాహరణకు హ్యాండ్ అని టైప్ చేస్తే), వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్ టైప్ చేసే కిందకు వచ్చేస్తాయి. వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. బీటా వెర్షన్ 2.17.246 ఎమోజీ సెర్చ్ యాక్టివేట్ అయినట్టు కంపెనీ చెప్పింది. ఎమోజీ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే, ఆ జాబితా అంతా వచ్చేస్తోంది. వాటికింద సెర్చ్ ఐకాన్ దర్శనమివ్వనుంది. సెర్చ్ ఐకాన్ క్లిక్ చేసి, యూజర్లకు తమకు కావాల్సిన ఎమోజీని సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాక తొలుత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ కూడా ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ రిలీజ్ చేసింది. రీకాల్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎఫ్‌ఏక్యూ పేజీ చెప్పింది.
Advertisement