Emoji Search
-
అమ్మాయిలూ.. అది ఉత్సాహం కాదు సెక్స్ అప్పీల్!
కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్ ఎమోజీ డే. స్మార్ట్ ఫోన్లలో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్డేట్స్లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్ సింబల్‌ను కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్ సింబల్స్. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం. డ్యాన్సింగ్ ట్విన్స్ విత్ హార్న్స్ ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్ అప్పీల్’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్ కాన్సెప్ట్‌లో ఫిక్షన్ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. ప్లీడింగ్ ఫేస్ ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్ ఐస్ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్ చేశావ్’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. షూటింగ్స్టార్ మ్యాజిక్ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. ది పూప్ ఎమోజీ సింబల్ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్ చేసి చూడడండి. ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్ అవుట్ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్ జెర్మీ బర్గ్(37).. 2014 జులై 17న వరల్డ్ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది. -
మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా?
ప్రేమ..సంతోషం, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాల్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ప్రతి ఏడాది జులై 17న వరల్డ్ ఎమోజీడేని జరుపుకుంటాము.ఈ సందర్భంగా ఎమోజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'బంబుల్' వరల్డ్ ఎమోజీ సందర్భంగా ఏ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86శాతానికి పెరగడంతో పాటు సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో యాక్టీవ్ గా ఉన్నట్లు నిర్ధారించింది. ఇక ఇండియన్స్‌కు చెందిన మిలీనియల్స్!! (దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్నయువత) క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఎమోజీల్లో టాప్ 5లో ఉంది. రెడ్ హార్ట్, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌ని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైళ్లలో నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీని వినియోగిస్తున్నారని బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ తెలిపారు. ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది. తొలిసారి ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల ఆహభావాలు అభిమానుల్ని అలరించాయి. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. నాడు పలుమీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్ను గీటే ఎమోజీల్ని పెట్టారు. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎమోజీలు ఇలా ఉంటాయా? బంబుల్ నివేదిక ప్రకారం ఎమోజీల వినియోగం ఎక్కువగా ఉండడంతో.. ఆయా కంపెనీలు యూజర్లను అట్రాక్ట్ చేసేలా వాయిస్‌ను సెండ్ చేస్తే దానికి తగ్గట్లు డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు! -
ఫేస్బుక్లో సౌండ్ మోత.. ఇక పండుగే!
రెగ్యులర్ ఛాటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో భావప్రకటన చేసేందుకు సులువైన మార్గాలే ఎమోజీలు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని ఒకప్పుడు తెగ ఉపయోగించేవాళ్లు. అయితే జిఫ్ ఫైల్స్, స్టికర్ల రాకతో వీటి వాడకం కొంచెం తగ్గింది. ఈ తరుణంలో ఎమోజీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫేస్బుక్ ఓ అడుగు ముందుకు వేసింది. యూజర్లకు మరింత వినోదం అందించేందుకు సౌండ్ ఎమోజీలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఫేస్బుక్ మెసేంజర్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. గురువారం రాత్రి నుంచే సౌండ్ ఎమోజీలను పంపే వీలు కల్పించింది. శనివారం(జులై17న) వరల్డ్ ఎమోజీ డే. సో.. అంతకంటే ముందే ‘సౌండ్మోజీ’ పేరుతో ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది ఫేస్బుక్. ఇంతకు ముందు ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కువ ఎమోజీలకు సౌండ్ ఎఫెక్ట్ యాక్సెస్ కల్పించింది మెసేంజర్. మెసేంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ బటన్ గనుక కనిపించకుంటే.. యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేం ఫుల్ వాల్యూమ్‌తో ఎమోజీలు పంపిస్తూ పండుగ చేసుకుంటున్నారు కొందరు యూజర్లు. ఇక ఈ విషయాన్ని అధినేత జుకర్‌బర్గ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. -
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్
ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. తాజా ఆండ్రాయిడ్ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్ ఆప్షన్ ఉపయోగపడనుంది. ఇన్నిరోజులు యూజర్ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్ స్క్రోల్ చేస్తూ వెతుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్ ఆప్షన్ పెట్టింది. దానిలో మనకు కావాల్సిన ఎమోజీలను టైప్ చేస్తే చాలు(ఉదాహరణకు హ్యాండ్ అని టైప్ చేస్తే), వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్ టైప్ చేసే కిందకు వచ్చేస్తాయి. వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. బీటా వెర్షన్ 2.17.246 ఎమోజీ సెర్చ్ యాక్టివేట్ అయినట్టు కంపెనీ చెప్పింది. ఎమోజీ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే, ఆ జాబితా అంతా వచ్చేస్తోంది. వాటికింద సెర్చ్ ఐకాన్ దర్శనమివ్వనుంది. సెర్చ్ ఐకాన్ క్లిక్ చేసి, యూజర్లకు తమకు కావాల్సిన ఎమోజీని సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాక తొలుత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ కూడా ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ రిలీజ్ చేసింది. రీకాల్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎఫ్ఏక్యూ పేజీ చెప్పింది.