ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలోకి వాట్సాప్ కొత్త స్టేటస్
ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలోకి వాట్సాప్ కొత్త స్టేటస్
Published Tue, Aug 22 2017 12:00 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
సాక్షి : వాట్సాప్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న స్టేటస్ ఫీచర్ కొత్త రూపురేఖలను సంతరించుకుంది. బీటా టెస్టింగ్ అనంతరం వాట్సాప్ ఎట్టకేలకు తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్స్‌కు టెక్ట్స్ స్టేటస్‌ను రంగులమయంగా మార్చేసింది. కలర్‌ఫుట్ టెక్ట్స్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తొలుత ఫేస్‌బుక్ గతేడాది తన ఆండ్రాయిడ్ యాప్‌కు లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో స్టేటస్ అప్‌డేట్‌కు కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫాంట్, ఎమోజీల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ కలర్‌ఫుల్ టెక్ట్స్ ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్టు వాట్సాప్ ధృవీకరించింది. అయితే అందరి యూజర్లకు ఇంకా ఇది అందుబాటులోకి రాలేదని రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే స్టేటస్‌లో వెబ్ లింక్‌లను పెట్టుకునే అవకాశం కూడా కల్పించింది. ఫేస్‌బుక్‌లో కలర్‌ఫుల్ టెక్ట్స్ అప్‌డేట్లకు అనూహ్య స్పందన ఉంది. అచ్చం అలానే వాట్సాప్ కూడా తన యూజర్లకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే సోషల్‌మీడియాలో వాట్సాప్ దూసుకెళ్తోంది. ఇది తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నారు.
Advertisement