న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని పాత ఐఫోన్లకు సపోర్ట్ చేయడం ఆపివేయనుంది. రానున్న అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్‌ల కోసం వాట్సాప్ పనిచేయదని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఆపిల్ ఇటీవల ఇచ్చిన సపోర్ట్ అప్‌డేట్ ప్రకారం కొన్ని పాత iPhoneలలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ పని చేయదు. WABetaInfo ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నాటికి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు ఈ ఐవోఎస్‌లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోందట. అప్‌డేట్ చేసుకోవాలనేసమాచారాన్ని అందిస్తోంది. యూజర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ ఉపయోగించడం కొనసాగించాలంటే, వారి iPhoneలు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకొమ్మని సూచిస్తోంది. ఐఫోన్ వినియోగదారులు iOS 12 లేదా తదుపరిది కలిగి ఉండాలని WhatsApp గతంలో దాని హెల్ప్ సెంటర్ పేజీలో కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సవరణ iPhone 5 , iPhone 5c అనే రెండు iPhone వెర్షన్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుందట.
iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి
iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్‌డేట్ కాకపోతే వెంటనే అప్‌డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment